వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ప్రపంచవ్యాప్తంగా ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఖాద్య తైలాల ధరలు తగ్గించే విషయం ప్రధాన తైల ఉత్పత్తిదారుల సంఘం సభ్యులతో రెండవ సమావేశం నిర్వహించింది.

Posted On: 02 JUN 2023 5:18PM by PIB Hyderabad

ఖాద్య తైలాల గరిష్ట ధరలు మరింత తగ్గించడానికి పరిశ్రమ వర్గాలు అంగీకరించాయి.  రానున్న రోజుల్లో  ఖాద్య   తైలాల ధరలు మరింత తగ్గ గలవని వినియోగదారులు వశించవచ్చు.  

ఖాద్య తైలాల ధరల్లో తగ్గుదల వల్ల ద్రవ్యోల్బణం మరింత తగ్గొచ్చు.  

     దేశీయ ధరల్లో తగ్గుదల అదేవిధంగా కొనసాగేలా చేసేందుకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి శ్రీ సంజీవ్ చోప్రా న్యూఢిల్లీలో శుక్రవారం పరిశ్రమలో అగ్రగామి ప్రతినిధులతో రెండవ సమావేశం నిర్వహించారు.  ప్రపంచవ్యాప్తంగా ధరలు తగ్గుదల కొనసాగుతున్న నేపథ్యంలో  మనదేశంలో కూడా ఖాద్య తైలాల చిల్లర ధర మరింత తగ్గించే విషయం చర్చించేందుకు తైలాల ఉత్పత్తితో సంబంధం ఉన్న సాల్వెంట్ ఎక్సట్రాక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు శాక తైలాల ఉత్పత్తిదారుల సంఘం మొదలైన సంస్థల ప్రతినిధులని   కూడా సమావేశానికి ఆహ్వానించారు.   పరిశ్రమ ప్రతినిధులతో ఆహార, ప్రజా పంపిణీ శాఖ నెల రోజులలోపల సమావేశం నిర్వహించడం ఇది రెండోసారి.  

     ప్రపంచవ్యాప్తంగా గత రెండు నెలల్లో వివిధ ఖాద్య తైలాల ధరలు టన్నుకు 150-200 అమెరికా డాలర్లు తగ్గాయని పరిశ్రమ వారు తెలిపారు  .  తైలాల గరిష్ట ధరను ఇప్పటికే తగ్గించామని, త్వరలో మరింత తగ్గిస్తామని పరిశ్రమ ప్రముఖులు తెలిపారు.  అయితే కొత్త ధరలు రిటైల్ మార్కెట్ లో ప్రతిబింబించే సరికి కొంత సమయం పడుతుంది.  రిటైల్ మార్కెట్ ధరలు త్వరలో మరింత తగ్గే తగ్గవచ్చు.

     ఇంతకు ముందు కూడా ప్రధాన తైల ఉత్పత్తిదారుల సంఘం సభ్యులతో  ఆహార, ప్రజా పంపిణీ శాఖ అధికారులు ఇదివరకు ఒకసారి సమావేశం నిర్వహించారు.  నెల రోజుల కిందటి నుంచి కొన్ని ప్రధాన బ్రాండ్ల  రిఫైన్డ్ సన్ ఫ్లవర్ నూనె, రిఫైన్డ్ సోయాబీన్ నూనె ధర  లీటరుకు రూ. 5-15 వరకు తగ్గింది.  అదే విధమైన తగ్గింపు ఆవనూనె , ఇతర ఖాద్య తైలాల ధరల్లో కూడా కనిపించింది.  అంతర్జాతీయ ధరల్లో తగ్గుదలతో పాటు ఖాద్య తైలాలపై దిగుమతి సుంకం తగ్గించడం వల్ల అవి చౌకగా మారిన ఫలితంగా  నూనె ధరలు తగ్గాయి.  అంతర్జాతీయ ధరల్లో తగ్గుదల ప్రయోజనం పూర్తిగా తప్పనిసరిగా వినియోగదారులకు చేరాలని పరిశ్రమ వర్గాలకు  సలహా ఇవ్వడం జరిగింది.  
      దిగుమతి చేసుకుంటున్న ఖాద్య తైలాల ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో తగ్గుముఖం పట్టాయని అందువల్ల ఖాద్య తైలాల పరిశ్రమ దేశీయ మార్కెట్ లో  తదనుగుణమైన రీతిలో ధరలు తగ్గేలా నిశ్చయపరచుకోవాలని శుక్రవారంనాటి సమావేశంలో చర్చించడం జరిగింది.
       ధరల తగ్గుదల ప్రయోజనం వినియోగదారులకు చేరడంలో ఇప్పటి మాదిరిగా జాప్యం జరగకుండా త్వరితంగా చేరేలా చూడాలని అన్నారు.   ప్రధాన ఖాద్య తైలాల ధరలు తక్షణం మరింతగా లీటరుకు రూ. 8-12 వరకు తగ్గేలా చర్యలు తీసుకోవాలని, తమ సభ్యులతో మాట్లాడాలని ప్రధాన తైల ఉత్పత్తిదారుల సంఘాలకు సలహా ఇవ్వడం జరిగింది. ఉత్పత్తిదారులు, నూనె శుద్ధిచేసేవారు తాము పంపిణీదారులకు పంపే ధరలను కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది.  అప్పుడే  వినియోగదారునికి తగ్గుదల పూర్తిగా అందుతుంది
      ఉత్పత్తిదారులు / రిఫైనర్లు ధరల తగ్గుదలను పంపిణీదారులకు అందించినప్పుడు పరిశ్రమ వర్గాలు ఆ లాభాన్ని వినియోగదారునికి అందేలా చూడాలని,  ఈ విషయాన్ని క్రమం తప్పకుండా ప్రభుత్వ శాఖకు తెలియజేయాలని పరిశ్రమవర్గాలకు, ఉత్పత్తిదారులకు తెలియజెప్పడం జరిగింది.  ఇతర బ్రాండ్లతో పోల్చినప్పుడు ధరలు తగ్గించకుండా ఇంకా అధిక గరిష్ట ధర తీసుకుంటున్న కొన్ని కంపెనీలను కూడా తమ ధరలు తగ్గించవలసిందిగా సలహా ఇచ్చారు.  
       దత్తాంశాలు / సమాచార సేకరణ మరియు  ఖాద్య తైలాల ప్యాకింగ్ వంటి అంశాలను కూడా సమావేశంలో చర్చించారు.  
       ఖాద్య తైలాల ధరల తగ్గుదల కొనసాగడంవల్ల త్వరలో ఖాద్య  తైలాల పరిశ్రమ ధరలను మరింత తగ్గించవచ్చు.  దానివల్ల భారత వినియోగదారులు వంట నూనెలను మరింత తక్కువకు కొనవచ్చు.   శాక తైలాల ధరల తగ్గుదల వల్ల ద్రవ్యోల్బణం కూడా తగ్గుతుంది.
       దేశంలో  ఖాద్య  తైలాల ధరలను కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ పర్యవేక్షించడంతో పాటు సమీక్షిస్తుంది.  అవసరమైనప్పుడు జోక్యం చేసుకొని మానవ ఆహారంలో ముఖ్య భాగమైన ఖాద్య తైలాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూస్తుంది.  భౌగోళిక- రాజకీయ కారణాల వల్ల 2021-22 సంవత్సరంలో  అంతర్జాతీయ మరియు దేశీయ మార్కెట్లలో వంట నూనెల ధరలు బాగా పెరిగాయి.  అయితే 2022 జూన్ నెల మధ్య నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ఖాద్య తైలాల ధరలు తగ్గుముఖం పట్టాయి.   ఆ తగ్గుదల ప్రభావం దేశీయ మార్కెట్లో నెమ్మదిగా కనిపిస్తోంది.  అయితే వినియోగదారులకు ఊరట కలిగించే విధంగా ఖాద్య తైలాల ఉత్పత్తిదారుల సంఘాలు  ధరలను మరింత తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.


 

*****

 



(Release ID: 1929721) Visitor Counter : 101


Read this release in: English , Urdu , Marathi , Hindi