మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
జాతీయ మహిళా కమిషన్
ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తల కోసం జాతీయ మహిళా కమిషన్, ఇడిఐఐల చే
దేశవ్యాప్తంగా , 100 ఎంటర్ప్రెన్యుయర్షిప్ అవగాహనా
కార్యక్రమాలు.
నాడు పోస్టు చేయడమైనది:
02 JUN 2023 5:15PM by PIB Hyderabad
జాతీయ మహిళా కమిషన్ (ఎన్.సి.డబ్ల్యు), ఎంటర్ ప్రెన్యుయర్షిప్ డవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఇడిఐఐ)
సహకారంతో దేశవ్యాప్తంగా ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు, ఉజ్జయినిలోని
విక్రం యూనివర్సిటీ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకటించింది.
ఎన్సిడబ్ల్య , ఇడిఐఐ సహకారంతో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 100 అవగాహనా కార్యక్రమాలలో తొలి అవగాహనా కార్యక్రమాన్ని,
మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ పటేల్, కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ సహాయమంత్రి డాకర్ ముంజపర మహేంద్ర భాయ్,
లు ప్రారంభించారు. ఎన్.సి.డబ్ల్యు ఛైర్పర్సన్ శ్రీమతి రేఖాశర్మ,ఇడిఐఐ డైరక్టర్ జనరల్ డాక్టర్ సునీల్ శుక్ల, ఎన్.సి.డబ్ల్యు సభ్యురాలు శ్రీమతి మీనాక్షి నెగి , పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఎం.ఎస్.ఎం.ఇ పరిశ్రమల శాఖ కమిషనర్,కార్యదర్శి, ఐఎఎస్ అధికారి శ్రీ పి.నరహరి, రాజ్భవన్ కు చెందిన ఉన్నతాధికారులు, పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఇఎపి కార్యక్రమం ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ పటేల్,భారతదేశం, సబ్కా సాథ్, సబ్ కా వికాస్ దార్శనికతతో ముందుకు పోతున్నదనని అన్నారు. మహిళల నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోందని , దీనికి గుర్తింపు, ఆమోదం లభిస్తోందని ఆయన అన్నారు.
స్వయం సహాయక బృందాలలోని మహిళలు చెప్పుకోదగిన స్థాయిలో ముందుకు వెళుతున్నారని ఆయన అన్నారు.
తమ విజయాల గురించి, వారి కృషి గురించి, భవిష్యత్ ప్రణాళికల గురించి తెలియజెప్పడంలో వారు తమ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన తెలిపారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలో అమలు జరుగుతున్న కార్యక్రమాల ద్వారా మహిళలు గణనీయమైన ప్రగతిని సాధించారు.
గ్రామీణ ప్రాంతాలలో మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం సబ్సిడీలు సమకూర్చడంతో వారు బాగా పురోభివృద్ధి సాధించారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద మహిళలకు శిక్షణ, అభివృద్ధి అవకాశాలు కల్పించారు. జాతీయ మహిళా కమిషన్, మహిళా ఎంటర్ప్రెన్యుయర్ షిప్ డవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఎంటర్ప్రెన్యుయర్ షిప్ ద్వారా మహిళా సాధికారతకు తీసుకుంటున్న అసాధారణ చర్యలకు అభినందనలు తెలియజేస్తున్నట్టు మంత్రి తెలిపారు.
మహిళా పారిశ్రామికవేత్తలకు అనువైన వాతావరణం ఉండాలన్న విషయాన్ని నొక్కిచెబుతూ డాక్టర్ ముంజపారా, ‘‘ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో మహిళల నాయకత్వాన్ని వేగవంతం చేసేందుకు, మహిళల నేతృత్వంలో అభివృద్ధి అజెండాను ముందుకు తీసుకువెళ్లేందుకు, మేం పనిచేస్తున్నాం ”అని అన్నారు.
సమాజానికి వెన్నెముక అయిన మహిళలు, మన భవిష్యత్తునుతీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారని వారు అన్నారు. వారికి సాధికారత కల్పించడం మన నైతిక బాధ్యతమాత్రమే కాక,సుస్థిరాభివృద్ధికి అత్యావశ్యకమని అన్నారు.
జాతీయ మహిళా కమిషన్, ఎంటర్ ప్రెన్యుయర్షిప్ డవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ఆఫ్ఇండియా కు మధ్య సహకారంతో, మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సామర్ధ్యాన్ని పెంచేందుకు ఇది దోహదపడుతుందన్నారు. అలాగే సంబంధిత స్టేక్ హోల్డర్లకు అవగాహన కల్పించడానికి ఉపకరిస్తుందని చెప్పారు.
ఎన్.సి.డబ్ల్యు ఛైర్పర్సన్ శ్రీమతి రేఖా శర్మ మాట్లాడుతూ,“ మహిళలు సమాజంలో కీలకపాత్ర వహిస్తున్నప్పటికీ, వారు ఆర్ఙిక సాధికారతలో వెనుకబడి ఉన్నారు. ఆర్థిక స్వావలంబన విషయంలో మహిళలను మరింత ప్రోత్సహించచవలసి ఉంది”అని అన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు మద్దతునిచ్చేందుకు అనువైన వాతావరణం ఇండియాలో ఉందని" వారు తెలిపారు.ఇందుకు అనుగుణంగా ఎం.ఎస్.ఎం.ఇలు ఏర్పాటు చేసుకునేందుకు మహిళలను ప్రోత్సహించడం జరుగుతోంది.
మహిళా పారిశ్రామికవేత్తలు ఇతర మహిళలకు ఉపాధి కల్పించడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇది ప్రస్తుత అవసరం. మహిళలు తమ విజయాల గురించి ,నెట్వర్క్, భవిష్యత్ కార్యకలాపాల గురించి అందరికీ తెలియజేస్తుండాలి. ఎంటర్ ప్రెన్యుయర్షిప్ డవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఇడిఐఐ) వారి మద్దతుతో ఇదంతా సాధ్యపడుతుందని వారు తెలిపారు. ఇడిఐఐ వంటి సంస్థలు, మహిళల సాధికారత కృషిలో చేయూతనిస్తే , విజయం తప్పక సాధిస్తామని వారు అన్నారు.
ఈ సమావేశంలో డాక్టర్ సునీల్ శుక్లా మాట్లాడుతూ, “గత పది సంవత్సరాలుగా , ఇండియా చెప్పుకోదగిన అభివృద్ధి సాధించింది.
ఇది దేశ మహిళలను వివిధ రంగాలలో ప్రోత్సహించడం , వారికి ఆర్ధిక స్వాతంత్ర్యం కల్పించడం వల్లే సాధ్యమైంది.ఎన్.సి.డబ్ల్యు, ఇడిఐఐ లు పరస్పరం సహకరించుకుంటూ మహిళల అభ్యున్నతికి కృషి చేస్తుండడం అభినందించదగిన విషయం, మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నందుకు అభినందనలు ”అని ఆయన అన్నారు. ఇది దేశాన్ని మరింత బలోపేతం చేస్తుంది అని సునీల్ శుక్లా అన్నారు.
జాతీయ మహిళా కమిషన్ మెంబర్ సెక్రటరీ శ్రీమతి మీనాక్షి నెగీ ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులనను సత్కరించారు.
మహిళల సాధికారతకు చేపడుతున్న చర్యలు, వారి కృషిని ఆమె అభినందించారు.మహిళలు గొప్పనాయకులుగా ఎలా రుజువుచేసుకున్నదీ
ఆయన తెలిపారు. మహిళలు ప్రధాన స్రవంతి ఆర్ధిక వ్యవస్థలో భాగస్వాములు అయ్యేలా వారి శక్తి యుక్తులు సద్వినియోగం అయ్యేలా చూడాలన్నారు.
ఈ దిశగా ఎంటర్ ప్రెన్యుయర్షిప్ అవగాహనా కార్యక్రమాలు గొప్ప ముందడుగుగా ఆమె తెలిపారు.
ఒక రోజుపాటు నిర్వహించే ఇఎపిలో పాల్గొనే మహిళకు ఎంటర్ప్రెన్యుయర్షిప్ ను ఒక కెరియర్గా ఎంచుకునేలా చేయడం, ఇందుకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకునేలా చూడడం, సామాజిక, ఆర్ధిక, కుటుంబ పరమైన అవరోధాలను అధిగమించి, మంచి ఎంటర్ప్రెన్యుయర్లుగా ఎదిగేందుకు అవగాహన కల్పించడం వంటివి చేస్తారు.మహిళలలో ఎంటర్ప్రెన్యుయర్ షిప్ నైపుణ్యాలు అభివృద్ధిలోకి వచ్చేట్టుచేయడం ఈ ఇపిఎల ఉద్దేశం. దీనివల్ల వారు నైపుణ్యాలు
పొందడానికి, తమ స్వంత వ్యాపారాలు నిర్వహించుకోవడానికి అవసరమైన ప్రేరణ పొందడానికి ఈ కార్యక్రమం ఉపకరిస్తుంది.
ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం అనంతరం, పానెల్ చర్చా కార్యక్రమాలను ఏర్పాటు చేశారరు. ఇందులో వివిధ రంగాలకు చెందిన నిపుణులు,
ఎంటర్ ప్రెన్యుయర్షిప్కు సంబంధించిన మౌలిక అంశాలు, వ్యాపార అవకాశాలు,
ఎంటర్ప్రెన్యురియల్ ఆలోచనా ధోరణిని అలవరచుకునేట్టు చేయడం , మహిళలు సాధారణంగా ఎదుర్కొనే రకరకాల సమస్యలను అధిగమించేందుకు వ్యూహాలు, స్త్రీ, పురుష సమానత్వానికి సంబంధించిన అంశాలు, సవాళ్లు, ప్రభుత్వ పథకాలు, విధానాలపై సమాచారం వంటి వాటిని మహిళా వ్యాపార వేత్తలకు తెలియజేయడం వంటివి చర్చించారు.
***
(రిలీజ్ ఐడి: 1929716)
సందర్శకుల సూచీ సంఖ్య : : 244