జల శక్తి మంత్రిత్వ శాఖ
గోబర్ ధన్ కోసం ఏకీకృత నమోదు పోర్టల్ ప్రారంభించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్రసింగ్ షేఖావత్
ఇండియాలో సిబిజి / బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడి & భాగస్వామ్యం మరియు క్రమబద్ధం చేసే ప్రక్రియను మదింపు చేసే ఏక కేంద్ర భండారంగా పోర్టల్ పనిచేస్తుంది.
ఇప్పటివరకు దేశంలో ఏర్పాటైన 650కి పైగా గోబర్ ధన్ ప్లాంటులు & ఈ పోర్టల్ ద్వారా 'వ్యర్థం నుంచి సంపద' సృష్టి యాత్రలో గణనీయమైన విజయం సాధించాము: శ్రీ షేఖావత్
Posted On:
01 JUN 2023 6:14PM by PIB Hyderabad
గోబర్ ధన్ కోసం ఏకీకృత నమోదు పోర్టల్ ను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్రసింగ్ షేఖావత్ ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా బయో గ్యాస్/ సిబిజి రంగంలో ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడి & భాగస్వామ్యం మరియు క్రమబద్ధం చేసే ప్రక్రియను మదింపు చేసే ఏక కేంద్ర భండారంగా ఈ పోర్టల్ పనిచేస్తుంది. అన్నిటికి మించి ముఖంగా ఇండియాలో సిబిజి/బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియను క్రమబద్ధం చేస్తుంది
ఇండియాలో బయోగ్యాస్/సిబిజి/బయో సి ఎన్ జి ప్లాంటు ఏర్పాటు చేయతలపెట్టిన ఏ ప్రభుత్వం, సహకార లేక ప్రైవేటు సంస్థ అయినా గురువారం ప్రారంభించిన పోర్టల్ లో నమోదు చేసుకొని రిజిస్ట్రేషన్ నంబరు పొందాలి. ఈ రిజిస్ట్రేషన్ నంబరు సహాయంతో వివిధ మంత్రిత్వాలు / ప్రభుత్వ శాఖల నుంచి బహుసంఖ్యలో ప్రయోజనాలను, మద్దతును పొందవచ్చు. అందువల్ల రాష్ట్రాలు తమ పరిధిలోని సిబిజి / బయోగ్యాస్ ప్లాంట్ల ఆపరేటర్లు నమోదు చేసుకొని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మరియు భవిష్యత్తులో అందించబోయే మద్దతును పొందేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాలకు సలహా ఇచ్చారు.
సేంద్రీయ జీవ-వ్యవసాయ వనరుల ధన్ (గోబర్ ధన్)ను ఉద్రిక్తపరచడానికి భారత ప్రభుత్వ చేస్తున్న కీలకమైన ఈ ఉపక్రమం
సంపూర్ణ ప్రభుత్వ గమనమార్గం మరియు 'వ్యర్థం నుంచి సంపద' సృష్టి దిశలో వృత్తాకార ఆర్ధిక వ్యవస్థను ప్రోత్సహించడం లక్ష్యం.
బయోగ్యాస్ /సిబిజి ప్లాంట్ల / బయో - సి ఎన్ జి ప్లాంట్లు ఏర్పాటు కోసం బలిష్టమైన పర్యావరణవ్యవస్థను నిర్మించడం లక్ష్యం. తద్వారా సహనీయ ఆర్ధిక వృద్ధిని మరియు వృత్తాకార ఆర్ధిక వ్యవస్థను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ భావన.
గోబర్ ధన్ కు జలశక్తి మంత్రిత్వానికి చెందిన తాగునీటి మరియు పారిశుద్ధ్య శాఖ (డిడిడబ్ల్యుఎస్) ఈ పోర్టల్ అభివృద్ధి చేసింది. https://gobardhan.co.inలో సందర్శించవచ్చు.
అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు / ప్రిన్సిపల్ సెక్రెటరీలు (గ్రామీణ పారిశుద్ధ్యానికి ఇన్ ఛార్జీలుగా ఉన్నవారు) మరియు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వాలు మరియు శాఖల ప్రతినిధులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి
చక్షుష రీతిలో హాజరయ్యారు.
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షేఖావత్ సమావేశంలో ప్రసంగిస్తూ ఈ ఏకీకృత పోర్టల్ సహకార ఫెడరలిజానికి చక్కని ఉదాహరణ అని, ఎందుకంటే ఈ కార్యక్రమంలో భాగస్వామ్య పక్షాలైన కేంద్ర మంత్రిత్వాలు, కేంద్ర మరియు రాష్ట్రాలకు చెందిన అన్ని సంబంధిత శాఖలు పోర్టల్ అభివృద్ధి మరియు మోహరింపులో కలసికట్టుగా పనిచేశాయని ఆయన అన్నారు. "మన దార్శనిక ప్రధానమంత్రి 'వ్యర్థం నుంచి సంపద' సృష్టి అనే భాధ్యతను అప్పగించారు. ఆ ప్రేరణతో గోబర్ ధన్ కార్యక్రమానికి ఉపక్రమించాము
650కి పైగా గోబర్ ధన్ ప్లాంటులు మరియు ఇప్పుడు ప్రారంభిస్తున్న పోర్టల్ ద్వారా 'వ్యర్థం నుంచి సంపద' సృష్టి యాత్రలో ఆవశ్యకమైన విజయాన్ని సాధించాము" అని మంత్రి తెలిపారు. పోర్టల్ ద్వారా వ్యాపారం సులభ సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షిస్తుందన్నారు. ఈ రోజు ఇక్కడ హాజరైన మనందరం గోబర్ ధన్ కార్యక్రమంలో సత్వర రీతిలో 'గతి ఔర్ ప్రగతి' సాధించడానికి కలసికట్టుగా/సంయుక్తంగా పనిచేయాలి" అని ఆయన అన్నారు. చివరగా పోర్టల్ అభివృద్ధి చేసిన అధికారులను, భాగస్వామ్య పక్షాలను మంత్రి అభినందించారు.
అన్ని భాగస్వామ్య మంత్రిత్వాల సమాలోచన ప్రక్రియ ఫలితమే ఈ పోర్టల్ అని ఈ సందర్బంగా మాట్లాడిన తాగునీటి మరియు పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి విని మహాజన్ అన్నారు. స్వయంగా చూడటానికి వీలుగా పోర్టల్ ను అన్ని రాష్టాలకు, మంత్రిత్వాలకు, శాఖలకు అందుబాటులోకి తెచ్చి (డ్రై రన్) నడిపి చూశామని, పరీక్షించి చూశామని అన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న గోబర్ ధన్ మరియు ప్రతిపాదిత ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారాన్ని ఈ పోర్టల్ అందిస్తుందని అన్నారు. ఈ రంగానికి చెందిన పెట్టుబడిదారులకు మరియు పారిశ్రామికవేత్తలకు ఇది విలువైన సాధనమని అన్నారు.
***
(Release ID: 1929303)
Visitor Counter : 221