మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

నేషనల్ మిషన్ ఫర్ మెంటరింగ్‌ను అమలు చేయడానికి 60 మంది సలహాదారుల కోసం 2023 మే 31, జూన్ 1వ తేదీల్లో 2 రోజుల సామర్థ్య నిర్మాణ వర్క్‌షాప్‌ నిర్వహించిన నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్

Posted On: 01 JUN 2023 6:11PM by PIB Hyderabad

పాఠశాలల ఉపాధ్యాయులకు సలహాలు సూచనలు అందించి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి సలహాదారులను నియమించాలని జాతీయ విద్యా విధానం 2020 లో ప్రతిపాదించారు. దీనికోసం సలహాదారుల బృందాన్ని ఏర్పాటు చేయాలని జాతీయ విద్యా విధానంలో సూచించారు. వయస్సు, పదవి తో సంబంధం లేకుండా సలహాదారులు  జాతీయ విద్యా విధానంలో పొందుపరిచిన లక్ష్యాలు నెరవేరేలా చూసి 21వ శతాబ్దపు అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో సహకరిస్తారుదేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 30  సెంట్రల్ స్కూల్‌లలో (15 కేవీ లు, 10 జెఎన్వి , 5 సీబీఎస్ఈ) నేషనల్ మిషన్ ఫర్ మెంటరింగ్ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా  29 జూలై 2022న  నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్  ప్రారంభించింది.

నేషనల్ మిషన్ ఫర్ మెంటరింగ్ ను సమర్థవంతంగా అమలు చేయడం, ఉపాధ్యాయులకు అవసరమైన మార్గదర్శక నైపుణ్యాలు, సాంకేతికతతో కూడిన నాణ్యమైన వృత్తిపరమైన సహకారం  అందించడానికి ఎంపిక చేసిన 60 మంది సలహాదారుల  కోసం 2023 మే 31, జూన్1న ఎన్ సి టిఈ    2 రోజుల సామర్థ్య నిర్మాణ వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఎన్ సి టిఈ చైర్‌పర్సన్ ప్రొఫెసర్   యోగేష్ సింగ్ 2 రోజుల వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు . వివిధ అంశాలపై ప్రొఫెసర్  యోగేష్ సింగ్ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు  సలహాదారులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమాన్ని సులభంగా అమలు చేయడం కోసం అభివృద్ధి చేసిన ఎన్ సి టిఈ వెబ్ పోర్టల్‌ను  ప్రొఫెసర్  యోగేష్ సింగ్ ప్రారంభించారు.  నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ సభ్య కార్యదర్శి  శ్రీమతి కేసాంగ్ వై. షెర్పా కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఉపాధ్యాయుల కోసం విజయవంతమైన, సమర్థవంతమైన కార్యక్రమాలు  నిర్వహించడానికి పోర్టల్ ఉపయోగపడుతుంది.

బోధన నాయకత్వ నైపుణ్యాలు, డిజిటల్ విద్య, సామాజిక-భావోద్వేగ అభ్యాసం, సమ్మిళిత విద్య, వృత్తి నైపుణ్యం , నైతికత, తరగతి గది నిర్వహణ, 21వ శతాబ్దపు సమాచార  నైపుణ్యాలు, ప్రతిభ/ నైపుణ్యం వంటి అంశాలలో నేషనల్ మిషన్ ఫర్ మెంటరింగ్‌  కి మార్గదర్శకులుగా వ్యవహరించేందుకు వివిధ రంగాలకు చెందిన 60 మంది అత్యుత్తమ నిపుణులను నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎంపిక చేసింది.

***(Release ID: 1929301) Visitor Counter : 137


Read this release in: English , Urdu , Hindi , Manipuri