చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
న్యాయ విభాగం పరిధిలోని న్యాయ బంధు ఆధ్వర్యంలో ఆర్‌టిఐ చట్టం, 2005పై అవగాహనా సదస్సును నిర్వహించిన ప్రో బోనో క్లబ్
Posted On:
01 JUN 2023 5:30PM by PIB Hyderabad
న్యాయ విభాగం పరిధిలోని న్యాయ బంధు కింద షిల్లాంగ్‌లోని ప్రోబోనో (ప్రజాహితార్థం / ఉచిత) క్లబ్ ఆఫ్ ఎన్ఇహెచ్‌యు (నేహు) 2005 నాటి ఆర్‌టిఐ చట్టంపై అవగాహనా సదస్సును నిర్వహించింది. చట్టం ప్రాముఖ్యతను, కీలకమైన ప్రభుత్వ సమాచారాన్ని తెలుసుకునే తమ హక్కు గురించి పౌరులకు అవగాహన కల్పించవలసిన ప్రాధాన్యతను పట్టి చూపారు.
అవసరమైనప్పుడు ఈ హక్కును వినియోగించుకోవలసిన ప్రాముఖ్యతను, వ్యక్తులను సాధికారం చేయడం, గ్రామీణ మేఘాలయలో అవగాహనను పెంచవలసిన అవసరానన్ని గురించి గౌరవ అతిథులు హీమాంగ్‌లాంగ్ నాంగ్ప్లూ & ప్రాఫెసర్ ప్రభా శంకర్ శుక్ల నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ రవి కాంత్ మిశ్రా అధ్యక్షత వహించారు. సమావేశంలో అనేక చట్ట ప్రయోజనాలను, ప్రభుత్వ అధికారుల జవాబుదారీతనాన్ని నిర్ధారించడంలో దాని పాత్రను వివరించారు.
***
(Release ID: 1929297)
Visitor Counter : 132