గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నిలదొక్కుకుని వ్యాపారంలో అభివృద్ధి సాధించడానికి వీధి వ్యాపారులకు సహకరిస్తున్న"పీఎం స్వనిధి" శ్రీ హర్దీప్ ఎస్ పూరి


ప్రధానమంత్రి స్వనిధి పథకం ప్రారంభమై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

Posted On: 01 JUN 2023 2:28PM by PIB Hyderabad

వీధి వ్యాపారాలు స్వావలంబన సాధించి అభివృద్ధి సాధించడం లక్ష్యంగా ప్రారంభమైన వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వనిది) విజయవంతంగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పూరి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో "పీఎం స్వనిధి" పథకం అత్యంత వేగంగా అమలు జరుగుతున్నదని మంత్రి పేర్కొన్నారు. భారతదేశంలో నగరాలు, పట్టణాల్లో వీధి వ్యాపారులకు గౌరవం, స్థిరత్వాన్ని అందించిన "పీఎం స్వనిధి" గతంలో ఎన్నడూ లేని విధంగా  ఆర్థిక చేరికలు , డిజిటల్ అక్షరాస్యత సాధించడానికి అవకాశం కలిగించిందని ఆయన పేర్కొన్నారు.

2020 జూన్ 1న ప్రధానమంత్రి స్వనిధి పథకం ప్రారంభమైంది.వీధి వ్యాపారులకు స్వయం ఉపాధి కలిగించి, స్వావలంబన, ఆత్మవిశ్వాసం కల్పించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం  "పీఎం స్వనిధి" పధకానికి రూపకల్పన చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూక్ష్మ-రుణ  పథకాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పథకంగా  "పీఎం స్వనిధి" గుర్తింపు పొందింది. దీనివల్ల ప్రజలకురుణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.సామాజిక భద్రత కల్పించే అంశంలో "పీఎం స్వనిధి" కీలకంగా మారింది. 

ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వనిధి) యోజన ప్రారంభమై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా  గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA) విజ్ఞాన్ భవన్‌లో  ఈరోజు ఇక్కడ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. కోవిడ్ -19 వల్ల వ్యాపారాలు మూతపడి  నష్టపోయిన వీధి వ్యాపారులు  జీవనోపాధిని పునః ప్రారంభించేందుకు పీఎం స్వనిధి అవకాశం కల్పించింది.  వీధి వ్యాపారులను ఆర్థికంగా పురోగతి సాధించడానికి, వీడి వ్యాపారులను  ప్రధాన స్రవంతిలో చేర్చడానికి పీఎం స్వనిధి సహకారం అందించింది. కోవిడ్  మహమ్మారి మధ్య ప్రారంభమైన  ఈ పథకం దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులకు గణనీయమైన సహకారాన్ని అందించింది.

విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా పీఎం స్వనిధి  పథకం కింద అమలు చేసిన ముఖ్యమైన కార్యక్రమాలు, సాధించిన విజయాలతో ఒక పుస్తకాన్ని విడుదల చేశారు.  దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులను ఆదుకోవడానికి, వారి జీవన విధానాన్ని మార్చేందుకు  పథకం ద్వారా చేపట్టిన వివిధ కార్యక్రమాలు, సంస్కరణలను పుస్తకంలో పొందుపరిచారు. కార్యక్రమంలో  గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి , అదనపు డీజీ (మీడియా) శ్రీ  రాజీవ్ జైన్, సంయుక్త కార్యదర్శి, మిషన్  డైరెక్టర్ శ్రీ రాహుల్ కపూర్,  కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు, డిజిటల్ చెల్లింపుదారులు , ముఖ్య భాగస్వాములు, పీఎం స్వనిధి లబ్ధిదారులు , సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 

రుణ  దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడానికి,పథకానికి సంబంధించిన వివిధ సమాచారాన్ని వీధి వ్యాపారులకు అందించడానికి అభివృద్ధి చేసిన పీఎం స్వనిధి   మొబైల్ యాప్‌ను మంత్రి  ప్రారంభించారు.  వ్యాపార నమోదు ధృవీకరణ పత్రాన్ని సులువుగా పొందడం కోసం చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఎంఎస్ఎంఈ  సహాయంతో పీఎం స్వనిధి పోర్టల్‌లో వీధి వ్యాపారులవ్యాపార ప్రచారం కోసం   'ఉద్యమ్' రిజిస్ట్రేషన్ మరియు 'ఉద్యమ్ అసిస్ట్' సర్టిఫికెట్ పొందే సదుపాయం కూడా అందుబాటులోకి తెచ్చారు. 

పధకాన్ని లక్ష్యాల మేరకు అమలు చేసిన  రాష్ట్రాలు, రుణ సంస్థలను  సత్కరించారు.  వీధి వ్యాపారులకు పెద్ద సంఖ్యలో రుణాలు అందించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లను సత్కరించారు.  ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్,   స్త్రీ నిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ లను సన్మానించారు. 

 పీఎం స్వనిధి లబ్ధిదారులతో కేంద్ర గుణ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి  శ్రీ హర్దీప్ ఎస్ పూరి మాట్లాడారు.  పథకం వల్ల తమకు కలిగిన ప్రయోజనాలను లబ్ధిదారులు మంత్రికి వివరించారు. పధకాన్ని విజయవంతగామ్ అమలు చేయడానికి సహకారం అందించిన   కేంద్ర మంత్రిత్వ శాఖలు , రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, రుణ సంస్థలు సంబంధిత వర్గాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

 పీఎం స్వనిధి పథకం గత మూడేళ్లలో గణనీయమైన మైలురాళ్లను సాధించింది.  వీధి వ్యాపారులకు మూడు విడతల్లో మూలధనాన్ని రుణ రూపంలో  ఈ పథకం అందిస్తుంది.   ఇది భారతదేశం అంతటా 36 లక్షల మంది వీధి వ్యాపారులకు స్మూక్ష రుణ పరపతి సౌకర్యాన్ని అందించింది.   జూన్ 30, 2023 నాటికి 48.5 లక్షల మందికి రుణాలు మంజూరు అయ్యాయి. వీరిలో  46.4 లక్షలకు పైగా  వీధి వ్యాపారులకు  5,795 కోట్ల రూపాయల మేరకు రుణాలుగా అందించారు.   డిజిటల్ విధానంలో కార్యకలాపాలు నిర్వహించడానికి పీఎం స్వనిధి లబ్ధిదారులకు శిక్షణ ఇవ్వడం పథకంలో కీలకమైన అంశం. వీడి వ్యాపారుల అభివృద్ధి, ఆత్మ గౌరవ సాధన కోసం మంత్రిత్వ శాఖ కృషి సాగిస్తోంది. 

 *******


(Release ID: 1929072) Visitor Counter : 385