రక్షణ మంత్రిత్వ శాఖ
మారిన హిండన్ వైమానిక దళ కేంద్ర కమాండ్
Posted On:
01 JUN 2023 12:56PM by PIB Hyderabad
ఎయిర్ కొమొడోర్ వినయ్ ప్రతాప్ సింగ్ నుంచి 01 జూన్ 2023న హిండన్ వైమానిక దళ కమాండ్ బాధ్యతలను ఎయిర్ కొమొడోర్ సంజయ్ చోప్రా స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవాతు అందరినీ ఆకట్టుకుంది.
ఎయిర్ కొమొడోర్ సంజయ్ చోప్రాను హెలికాప్టర్ పైలట్‌గా 1995 డిసెంబర్‌లో భారతీయ వైమానిక దళంలో ప్రవేశించారు. ఆయన అర్హత కలిగిన ఫ్లైయింగ్ ఇనస్ట్రక్టర్ మాత్రమే కాక 4700 గంటల పాటు హెలికాప్టర్ నడిపారు.ఆయన సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్‌ఫేర్ పూర్వ విద్యార్ధి. వైమానిక అధికారి ఒక హెలికాప్టర్ యూనిట్‌ను, ఫ్లైయింగ్ స్టేషన్‌ను నిర్వహించడమే కాక అనేక కార్యాచరణ బాధ్యతలను నిర్వహించారు. ఆయన వాయుసేన పతక గ్రహీత.
(Release ID: 1929034)
Visitor Counter : 138