ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మణిపూర్‌కు వైద్య నిపుణుల బృందాలను పంపిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ


ఎయిమ్స్‌ కళ్యాణి, ఎయిమ్స్‌ గువాహటి, ఎన్‌ఈఐజీఆర్‌ఎంఎస్‌ షిల్లాంగ్ వైద్యులతో కూడిన బృందాలు

శస్త్రచికిత్సలు, మానసిక వైద్యం, సాధారణ, స్త్రీ సంబంధిత, పిల్లల సంబంధిత, మూత్రపిండ సంబంధిత, అత్యవసర చికిత్సల్లో నైపుణ్యం కలిగిన వైద్యులు

प्रविष्टि तिथि: 31 MAY 2023 7:17PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య మంత్రి డా.మన్‌సుఖ్ మాండవీయ ఆదేశాల మేరకు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మణిపూర్‌కు వైద్య నిపుణుల బృందాలను హుటాహుటిన పంపింది.

మణిపూర్‌లో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా కుంటుపడిన ఆరోగ్య సదుపాయాలను పునరుద్ధరించడానికి ఆరు వైద్య బృందాలను పంపింది. ప్రతి బృందంలో శస్త్రచికిత్సలు, మానసిక వైద్యం, సాధారణ, స్త్రీ సంబంధిత, పిల్లల సంబంధిత, మూత్రపిండ సంబంధిత, అత్యవసర చికిత్సల్లో నైపుణ్యం కలిగిన నలుగురు వైద్యులు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవల్లో ఈ నిపుణులు పాలుపంచుకుంటారు.

ఈ బృందాల్లో ఎయిమ్స్‌ కళ్యాణి, ఎయిమ్స్‌ గువాహటి, ఎన్‌ఈఐజీఆర్‌ఎంఎస్‌ షిల్లాంగ్ వైద్యులు ఉన్నారు.

 

*****


(रिलीज़ आईडी: 1928843) आगंतुक पटल : 168
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri