విద్యుత్తు మంత్రిత్వ శాఖ

సుబంసిరి దిగువ జ‌ల‌విద్యుత్ ప్రాజెక్టు (2000 మెగావాట్లు) నిర్మాణ పురోగ‌తి, భ‌ద్ర‌తా అంశాల‌ను స‌మీక్షించిన విద్యుత్ మంత్రి శ్రీ ఆర్‌.కె. సింగ్‌

Posted On: 31 MAY 2023 2:46PM by PIB Hyderabad

ఎన్‌హెచ్‌పిసి అమ‌లు చేస్తున్న అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌/ అస్సాంలో ఉన్న సుబ‌న్‌సిరి దిగువ జ‌ల విద్యుత్ ప్రాజెక్టు (2000 మెగావాట్ల‌) పురోగ‌తిని స‌మీక్షించేందుకు కేంద్ర విద్యుత్‌, నూత‌న & పున‌రుత్పాద‌క ఇంధ‌న శాఖ మంత్రి శ్రీ ఆర్‌.కె. సింగ్ న్యూఢిల్లీలో స‌మావేశాన్ని నిర్వ‌హించారు. 
నిర్మాణ పురోగ‌తి, ప్రాజెక్టుకు సంబంధించిన భద్ర‌తా అంశాలు, రానున్న వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని అవ‌స‌ర‌మైన సంసిద్ధ‌త‌పై విద్యుత్ మంత్రి స‌మీక్షించారు.  
వివిధ ప్యాకేజీల‌లో సాధించిన పురోగ‌తి వ‌ర్త‌మాన స్థితిని, భ‌ద్ర‌త ప‌ర‌గ‌ణ‌న‌ల వివ‌రాల‌తో పాటు, వానాకాల నెల‌ల దృష్ట్యా నిర్దేశించిన సాంకేతిక ప్ర‌మాణాల ప్ర‌కారం దాని సంసిద్ధ‌త‌ను ప్రాజెక్టు అధిప‌తి వివ‌రించారు. 
డ్యామ్ ను బ‌ల‌ప‌ర‌చ‌డంలో (14 బ్లాకులు ఎగువ‌స్థాయి 210 మీట‌ర్ల‌ను, మిగిలిన రెండు బ్లాకుల‌ను జూన్ 2023నాటికి పూర్తి)  ప్రాజెక్టు గ‌ణనీయ‌మైన పురోగ‌తిని సాధించింది. దీనితో పాటుగా, గ‌త ఆరు నెల‌ల కాలంలో 2.5 లక్ష‌ల క్యూబిక్ మీట‌ర్ల కంటే ఎక్కువ కాంక్రీట్‌ను పోయ‌డంతో డ్యామ్ ఎత్తును 37 మీట‌ర్లు పెంచ‌డ‌మ‌న్న‌ది ఒక అద్భుత‌మైన ఫీట్‌గా చెప్పుకోవ‌చ్చు. అంతేకాక‌, న‌దీ ముఖంగా ఉన్న విద్యుత్ కేంద్ర గోడ‌ను 116 మీట‌ర్ల సుర‌క్షిత ఎత్తువ‌ర‌కు పెంచ‌డ‌మే కాక అన్ని యూనిట్ల‌కు టెయిల్ రేస్ ఛానెల్ ( ఆన‌క‌ట్ట నుంచి నీటిని తీసుకుపోయే కాలువ‌) ను పూర్తి చేశారు. నీటి వాహ‌క వ్య‌వ‌స్థ ఇప్పుడు దాదాపు సిద్ధ‌మైంది. 
స‌మీక్ష అనంత‌రం, ప‌ని పురోగ‌తిపై కేంద్ర మంత్రి సంతృప్తిని వ్య‌క్తం చేసి, అవ‌స‌ర‌మైన ముంద‌స్తు భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌తో ముందుకు వెళ్ళ‌వ‌ల‌సిందిగా ఎన్‌హెచ్‌పిసిని ఆదేశించారు. రానున్న డిసెంబ‌ర్ లేదా 2024 జ‌న‌వ‌రిలో 250 మెగావాట్ల సామ‌ర్ధ్యంతో కూడిన తొలి యూనిట్‌ను ప్రారంభించేందుకు కంపెనీ  కృషి చేస్తోంద‌ని ఎన్‌హెచ్‌పిసి సిఎండి హామీ ఇచ్చారు. 
స‌మావేశానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ, కేంద్ర విద్యుత్ ప్రాధిక‌ర‌ణ సంస్థ‌, ఎన్‌హెచ్‌పిసికు చెందిన సీనియ‌ర్ అధికారుల‌తో క‌లిసి మంత్రిత్వ శాఖ‌ కార్య‌ద‌ర్శి (విద్యుత్) హాజ‌ర‌య్యారు. 

 

***
 



(Release ID: 1928667) Visitor Counter : 126