ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

ఐటీ హార్డ్‌వేర్ కోసం పీఎల్ఐ 2.0 కింద ప్రోత్సాహకాల కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY )దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Posted On: 30 MAY 2023 5:07PM by PIB Hyderabad

భారతదేశ తయారీ సామర్థ్యాలను పెంపొందించడానికి మరియు ఎగుమతులను మెరుగుపరచడానికి మే 17, 2023న  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం...   ఐటీ హార్డ్‌వేర్ కోసం ప్రొడక్షనల్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపింది.
ఈ పథకం మే 29, 2023న నోటిఫై చేయబడింది. ఐటీ హార్డ్‌వేర్ కోసం పీఎల్ఐ స్కీమ్ 2.0 కింద దరఖాస్తుల ప్రక్రియ జూన్ 01, 2023 నుండి మొదలవుతుంది.

దేశంలో సరఫరా గొలుసులను అభివృద్ధి చేయడానికి తయారీ వ్యవస్థను విస్తృతం చేయడం, మరింతగా బలంగా చేయడం కోసం స్థానికంగా విడిభాగాలు, అసెంబ్లింగ్ ను ప్రోత్సహించడం ద్వారా దీర్ఘకాలికంగా  కొనసాగేలా ఐటీ హార్డ్ వేర్ కోసం పీఎల్ఐ స్కీమ్ దోహదపడుతుంది. అంతేకాకుండా పెరుగుతున్న అమ్మకాలను మరింతగా ప్రోత్సహించడానికి దరఖాస్తుదారులకు మరింత సులభతరమైన అవకాశాలను అందిస్తుంది. ఇంకా సెమీకండక్టర్ డిజైన్, ఐసీ తయారీ మరియు ప్యాకేజింగ్ కూడా ఐటీ హార్డ్‌వేర్ కోసం పీఎల్ఐ స్కీమ్ 2.0 యొక్క ప్రోత్సాహక భాగాలుగా చేర్చబడ్డాయి.

ఐటీ హార్డ్‌వేర్ కోసం పీఎల్ఐ స్కీమ్ 2.0 రూ. 17,000 కోట్ల బడ్జెట్‌తో ఆమోదించబడింది.
• ఈ పథకం మొత్తం ₹ 3.35 లక్షల కోట్ల ఉత్పత్తికి దారి తీస్తుందని, ఎలక్ట్రానిక్స్ తయారీలో రూ. 2,430 కోట్ల అదనపు పెట్టుబడిని తీసుకురావడానికి మరియు 75,000 అదనపు ప్రత్యక్ష ఉద్యోగాల సృష్టికి దారి తీస్తుందని అంచనా.

• ఈ పథకం ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఆల్-ఇన్-వన్ PCలు, సర్వర్‌లు మరియు అల్ట్రా స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్  పరికరాలలో పెద్ద ఎత్తున తయారీని ప్రోత్సహిస్తుంది మరియు 2025–-26 నాటికి సుమారు 300 బిలియన్ల అ మెరికన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ తయారీ టర్నోవర్‌ను సాధించడానికి గణనీయంగా దోహదం చేస్తుంది.

• ఇప్పటికే ఉన్న పీఎల్ఐ యొక్క ఆమోదించబడిన దరఖాస్తుదారులు పీఎల్ఐ 2.0 ప్రకారం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబడతారు.

ఈ పథకంలో గ్లోబల్ కంపెనీలు, హైబ్రిడ్ (గ్లోబల్/డొమెస్టిక్) కంపెనీలు మరియు దేశీయ కంపెనీలు అనే మూడు రకాల దరఖాస్తుదారులు ఉన్నారు.
 
ఐటీ హార్డ్‌వేర్ కోసం పీఎల్ఐ స్కీమ్ 2.0 యొక్క వివరాలు క్రింది యూఆర్ఎల్ లో అందుబాటులో ఉన్నాయి:
https://www.meity.gov.in/content/production-linked-incentive-scheme-pli-20-it-hardware

 

***



(Release ID: 1928517) Visitor Counter : 151