శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
అగరబత్తుల తయారీపై ఒకరోజు శిక్షణ వర్క్‌షాప్‌ను నిర్వహించిన సిఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సిపిఆర్ మరియు విభ
प्रविष्टि तिथि:
30 MAY 2023 3:31PM by PIB Hyderabad
సిఎస్‌ఐఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (సిఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సిపిఆర్) ఉన్నత్ భారత్ అభియాన్ (యూబిఏ) మరియు విజ్ఞాన భారతి (విభ) సహకారంతో 25 మే 2023న ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లోని పిల్లి పడవ్ గ్రామం గైండిఖాతా క్లస్టర్) లోని గ్రామ పంచాయతీ భవన్‌లో అగరబత్తుల తయారీపై ఒకరోజు శిక్షణ వర్క్‌షాప్ నిర్వహించింది.
లక్నోలోని సిఎస్‌ఐఆర్-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ (సిఎస్‌ఐఆర్-సిఐఎంఏపి) అభివృద్ధి చేసిన అగరుబత్తీల తయారీ సాంకేతికత (తెలుసుకోవడం)పై రైతులకు మరియు మహిళలకు శిక్షణ ఇవ్వడం మరియు ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ వర్క్‌షాప్ జరిగింది. వర్క్‌షాప్‌లో 120 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. యూబిఏ నెట్‌వర్క్ స్థానిక కోఆర్డినేటర్ శ్రీమతి మీనాక్షి చౌదరి స్వాగత ప్రసంగంతో కార్యక్రమం ప్రారంభమైంది. సిఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సిపిఆర్ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ యోగేష్ సుమన్ ప్రేక్షకులకు సమాచారం అందించారు. సీఎస్‌ఐఆర్ టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధిని సృష్టించేందుకు ఈ సంస్థలు సంయుక్తంగా చేస్తున్న ప్రయత్నాల ప్రాముఖ్యత గురించి ఆయన చర్చించారు.

అగరబత్తుల తయారీ వర్క్‌షాప్‌లో పాల్గొన్న మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సిఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సిపిఆర్ శాస్త్రవేత్త డాక్టర్ యోగేష్ సుమన్.
సిఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సిపిఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్. రంజన అగర్వాల్ ఆన్‌లైన్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అగరబత్తుల తయారీ సాంకేతికత ప్రాముఖ్యత గురించి ప్రేక్షకులకు వివరించారు. మరియు మహారాష్ట్రలోని షిర్డీ సమీపంలో జీవనోపాధిలో సృష్టించిన వ్యత్యాసాన్ని వివరించారు. ముఖ్యంగా మహిళల జీవితాల్లో, జీవనోపాధిలో ఈ టెక్నాలజీ తీసుకొచ్చిన మార్పుల గురించి ఆమె ప్రస్తావించారు. ఈ సాంకేతికత యొక్క పర్యావరణ ప్రాముఖ్యత గురించి మరియు స్థానిక పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా వృత్తాకార ఆర్థిక వ్యవస్థను రూపొందించడానికి ఇది ఎలా దోహదపడుతుందో ఆమె వివరించారు. అనంతరం జరిగిన సభలో యూబీఏ జాతీయ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ వీరేంద్ర కుమార్ విజయ్ ప్రసంగించారు. ఉన్నత్ భారత్ అభియాన్ గురించి మరియు అది ఆత్మ నిర్భర్ భారత్‌ను రూపొందించే దిశగా ఎలా పురోగమిస్తోందో వివరించారు. గ్రామ ప్రధాన్ శ్రీ శశి ఝండ్వాల్ నిరుద్యోగం మరియు జీవనోపాధికి సంబంధించిన స్థానిక సమస్యల గురించి మరియు అటువంటి సాంకేతికతల జోక్యం వాటిని ఎలా పరిష్కరించగలదో ప్రస్తావించారు. ఇంత ఉపయోగకరమైన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సిఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సిపిఆర్ మరియు యూబీఐ బృందాలకు
కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

శిక్షణ సెషన్ సంగ్రహావలోకనం
శిక్షణా సమావేశాన్ని సిఎస్‌ఐఆర్-సిఐఎంఏపి నుండి టెక్నికల్ ఆఫీసర్ శ్రీ మనోజ్ యాదవ్ నిర్వహించారు. ఈ శిక్షణ పట్ల పాల్గొన్నవాళ్లు ఆసక్తిని కనబరిచారు. ఇది వారి చురుకైన భాగస్వామ్యం నుండి స్పష్టమైంది. శ్రీ మనోజ్ చాలా వివరణాత్మక ప్రదర్శనలో ట్రైనీలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఎదురయ్యే చిక్కుల గురించి మరియు వివిధ మార్గాల ద్వారా ముడిసరుకు యొక్క ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ సాంకేతికత స్వయంశక్తితో కూడుకున్నదని, గృహోపకరణాలను ఉపయోగించి అగరబత్తిని తయారు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఉన్నత్ భారత్ అభియాన్ (యూబిఏ) మరియు విజ్ఞాన భారతి (విభ) సహకారంతో సిఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సిపిఆర్ ఇటువంటి శిక్షణా వర్క్‌షాప్‌ల శ్రేణిని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలు యూబిఏ నెట్‌వర్క్‌తో అనుబంధించబడిన గ్రామాల్లో జీవనోపాధి అవకాశాలను సృష్టించడంపై దృష్టి సారించాయి. సిఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సిపిఆర్ బృందానికి సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. యోగేష్ సుమన్‌తో పాటు సీనియర్ సైంటిస్ట్ డా. శివ నారాయణ్ నిషాద్; డాక్టర్ వినాయక్, సీనియర్ సైంటిస్ట్ మరియు సిఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సిపిఆర్ శాస్త్రవేత్త శ్రీమతి మీటాలి భారతి నేతృత్వం వహిస్తారు.
<><><><><>
(रिलीज़ आईडी: 1928346)
आगंतुक पटल : 203