పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
కలబురగి విమానాశ్రయంలో నైట్ ల్యాండింగ్ సౌకర్యానికి డీజీసీఏ ఆమోదం
- కలబురగి విమానాశ్రయాన్ని నవంబర్ 22, 2019న ప్రారంభించారు
प्रविष्टि तिथि:
29 MAY 2023 3:58PM by PIB Hyderabad
కర్ణాటకలోని కలబురగి విమానాశ్రయంలో నైట్ ల్యాండింగ్ సౌకర్యానికి డైరెక్టరేట్-జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) 17 మే 2023న ఆమోదం తెలిపింది. కలబురగి విమానాశ్రయాన్ని నవంబర్ 22, 2019న అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బి ఎస్ యడియూరప్ప ప్రారంభించారు. ఇది 09-27 (3175మీ x 45మీ) రన్వే మరియు 03 ఎయిర్క్రాఫ్ట్లను పార్క్ చేయడానికి అనువైన ఆప్రాన్ (1 ఏ-320, 02 ఏటీఆర్ 72/క్యూ-400.)ని కలిగి ఉంది. విమానాశ్రయంలో నైట్ ల్యాండింగ్ సౌకర్యం కల్పించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. నైట్ ల్యాండింగ్ సదుపాయం కోసం డీజీసీఏ ఆమోదంతో విమానాశ్రయంలో ఏరోడ్రోమ్ లైసెన్స్ వీఎఫ్ఎర్ (విజువల్ ఫ్లైట్ రూల్స్) నుండి ఐఎఫ్ఆర్ (ఇన్స్ట్రుమెంటల్ ఫ్లైట్ రూల్స్)కి అన్ని రకాల వాతావరణ కార్యకలాపాలకు సవరించబడింది.
విమానాశ్రయం కింది కనెక్టివిటీని కలిగి ఉంది:
|
ఎయిర్ పోర్ట్
|
ఎయిర్ లైన్స్
|
లాస్ట్ / నెక్ట్స్ సిటీ సెర్వుడ్
|
వారానికి రాకపోకలు (రాక మరియు పోక)
స్లాట్ అలకేషన్ ప్రకారం
|
|
జీబీఐ
|
స్టార్ ఎయిర్
|
తిరుపతి
|
8
|
|
జీబీఐ
|
అలయన్స్ ఎయిర్
|
బెంగళూరు
|
10
|
|
జీబీఐ
|
స్టార్ ఎయిర్
|
బెంగళూరు
|
8
|
***
(रिलीज़ आईडी: 1928287)
आगंतुक पटल : 196