హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కాశ్మీర్ లోయలో ఖీర్ భవానీ మేళా, 2023 ను ఆనందోత్సాహాలతో జరుపుకున్న కాశ్మీరీ పండితులు, స్థానికులు


ఖీర్ భవానీ మేళా విజయవంతంగా ముగిసిన సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, సిఎపిఎఫ్ లు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు స్థానిక అధికారులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా

కాశ్మీర్ లో జ్యేష్ఠ అష్టమి నాడు నిర్వహించే ఖీర్ భవానీ మేళాకు కాశ్మీరీ పండిట్ సోదర సోదరీమణుల ఆధ్యాత్మిక క్షేత్రంలో పవిత్ర స్థానం ఉంది; మేళాకు 25000 మందికి పైగా భక్తులు హాజరయ్యారు; హోం మంత్రి

ఖీర్ భవానీ మాత దివ్యానుగ్రహం ఎల్లప్పుడూ మనతో ఉండాలి - శ్రీ అమిత్ షా

Posted On: 29 MAY 2023 5:35PM by PIB Hyderabad

ప్రతి సంవత్సరం జ్యేష్ఠ అష్టమి రోజున కాశ్మీరీ పండిట్లు ఖీర్ భవానీ ఆలయం గా పేరొందిన మాతా రగ్నేయ దేవి ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు. ఈ సంవత్సరం మే 28 న మేళాను కాశ్మీరీ పండిట్లు మాత్రమే కాకుండా కాశ్మీర్ లోయ స్థానికులు కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు.

 

కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా తన ట్వీట్ లో " కాశ్మీర్ లో జ్యేష్ఠ అష్టమి నాడు జరిగే ఖీర్ భవానీ మేళా కాశ్మీరీ పండిట్ సోదరీ, సోదరుల ఆధ్యాత్మిక హృదయాలలో పవిత్ర స్థానాన్ని ఆక్రమించింది. ఈ మేళాకు 25 వేల మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ఖీర్ భవానీ మేళాను విజయవంతంగా నిర్వహించినందుకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, కేంద్ర సాయుధ పోలీసు దళాల సిఎపిఎఫ్ లు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు , స్థానిక పాలనా యంత్రాంగానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఖీర్ భవానీ మాత దివ్యానుగ్రహం ఎల్లప్పుడూ మనతో ఉండాలని కోరుకుంటున్నాను.‘‘

 

ఖీర్ భవానీ మేళా మే 26 న ప్రారంభమై మే 28 న అంటే జ్యేష్ట అష్టమి నాడు ముగిసింది. మేళా మొదటి రోజు జమ్మూ నుంచి 107 బస్సుల్లో 2500 మందికి పైగా భక్తులు ఆలయానికి చేరుకున్నారు.

 

భక్తుల సౌకర్యార్థం గండేర్ బల్ జిల్లా యంత్రాంగం సమగ్ర, విస్తృత ఏర్పాట్లు చేసింది. గండేర్ బల్ జిల్లా పోలీసు యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీలు తమ తమ గుడారాలను ఏర్పాటు చేసి భక్తులకు అల్పాహారాన్ని అందించారు.

గండేర్ బల్ జిల్లా పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 20 సి ఎ పి ఎఫ్ కాన్వాయ్ లతో పాటు జమ్ముకశ్మీర్ పోలీసు సిబ్బంది,  ఎస్కార్ట్ వాహనాలు, ఆర్ ఒ పి, సి టి క్యు ఆర్ టి లు, లా అండ్ ఆర్డర్ విభాగాలు, అడిషనల్ నాకా పాయింట్లు మొత్తం మోహరింపు ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. భక్తుల కోసం పది భోజన శాల లను ఏర్పాటు చేశారు.

 

మే 28 సాయంత్రం హారతి/ పూజతో మేళా ప్రశాంతంగా ముగిసింది. కాశ్మీరీ పండిట్లు ఇతర స్థానిక సమూహాలు తమ ప్రియమైన వారి, సమాజ శాంతి, శ్రేయస్సు సంతోషం కోసం ప్రార్థనలు జరిపారు.

గత ఏడాది జ్యేష్ఠ అష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని సుమారు 18 వేల మంది కశ్మీరీ పండిట్లు, భక్తులు ప్రసిద్ధ మాతా ఖీర్ భవానీ ఆలయాన్ని సందర్శించారు. ఖీర్ భవానీని కాశ్మీరీ పండిట్ల దేవతగా భావిస్తారు, వారికి అక్కడ చాలా గుర్తింపు ఉంది. కొన్నేళ్లుగా ఖీర్ భవానీ మేళా కశ్మీర్ లో మత సామరస్యానికి, సోదరభావానికి చిహ్నంగా మారింది.

 

*****


(Release ID: 1928280) Visitor Counter : 193