రక్షణ మంత్రిత్వ శాఖ
ఐరాస శాంతిపరిరక్షకుల 75వ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకున్న భారతీయ సైన్యం
Posted On:
29 MAY 2023 11:35AM by PIB Hyderabad
భారతసైన్యం 75వ అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని పురస్కరించుకొని, సోమవారం న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సైన్యాధ్యక్షుడు) వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్, నావికాదళ, వైమానికదళ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఐక్యరాజ్య సమితి ప్రతినిధులతో కలిసి పుష్పగుచ్ఛాలను ఉంచి మరణించిన సహచరులకు నివాళులర్పించారు. ఇదే రోజున 1948లో తొలి ఐరాస శాంతిపరిరక్షక మిషన్ పాలస్తీనాలో యుఎన్ ట్రూస్ సూపర్‌విజన్ ఆర్గనైజేషన్ (యుఎన్‌టిఎస్ఒ- ఐరాస తత్కాల సంధి పర్యవేక్షణ సంస్థ) తన కార్యకలాపాలను ప్రారంభించింది.
ప్రతి ఏడాదీ ఈ రోజున ఐరాస శాంతి పరిరక్షక మిషన్లలో పని చేస్తున్న లేదా సేవ చేస్తున్న స్త్రీ, పురుషుల అంకితభావం, వృత్తినైపుణ్యం, సాహసానికి, శాంతి కోసం తమ ప్రాణాలను అర్పించినవారి జ్ఞాపకాలను గౌరవించడం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు, ఐరాస నివాళులు అర్పిస్తాయి. ఈ ఏడాది ఐరాస శాంతి పరిరక్షకుల దినోత్సవ 75వ వార్షికోత్సవం.
ఐరాస శాంతిపరిరక్షక కార్యకలాపాలకు దోహదం చేయడమే కాక అతి భారీ స్థాయిలో దళాలను మోహరించిన సుసంపన్నమైన వారసత్వాన్ని కలిగి ఉంది. నేటివరకూ శాంతిపరిరక్షక మిషన్లకు, దాదాపు 2,75,000 దళాలను పంపగా, ప్రస్తుతం 12 యుఎన్ మిషన్లలో సుమారు 5900 దళాలు ప్రస్తుతం మోహరించి ఉన్నాయి.
భారత సైనిక సిబ్బంది సవాళ్ళతో కూడిన భూభాగాల్లో క్లిష్ట పరిస్థుతుల్లో పని చేయడానికి ఐరాస నిబంధలను కాపాడడేందుకు అత్యున్నత త్యాగం చేసే స్థాయిలో తమ ఆదర్శప్రాయమైన వృత్తి నైపుణ్యం, మానవతా దృక్పథం, సాహసం, పరాక్రమాన్ని ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతికి హామీ ఇచ్చేందుకు 159 మంది భారతీయ సైనికులు అత్యున్నత త్యాగాన్ని చేశారు. ప్రస్తుత మోహరింపు మాత్రమే కాక, భౌతిక శక్తిగా పదాతిదళ బెటాలియన్‌ను, హెలికాప్టర్‌తో కూడిన చిన్న యుద్ధనౌకతో పాటు ఇంజినీర్ కంపెనీని& సిగ్నల్ కంపెనీని ఫోర్స్ ఎనేబ్లర్లుగా (సైన్యానికి సహాయకంగా) ఐరాస ఆదేశానుసారం మోహరిస్తామని ప్రతిజ్ఞ చేసింది.
ఐరాస నిబంధనల కింద సంఘర్షణాత్మక ప్రాంతాలలో మహిళా శాంతిపరిరక్షకులను మోహరించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని, భారత్ ఫీమేల్ ఎంగేజ్‌మెంట్ టీమ్స్ (ఎఫ్ఇటలు)ను మొనుస్కో (MONUSCO ), యునిస్ఫా (లైబీరియా అనంతరం రెండవ అతిపెద్ద మహిళా కంటింజెంట్)ను మోహరించింది. భారతదేశం యున్డోఫ్ (UNDOF)లో మహిళా సైనిక పోలీసులను, మహిళా స్టాఫ్ అధికారులు/ సైనిక పరిశీలకులను పలు మిషన్లలో మోహరించింది.
శాంతిపరిరక్షక కార్యకలాపాలకు వినూత్న శిక్షణను ఇచ్చేందుకు న్యూఢిల్లీలో ఐరాస శాంతిపరిరక్షక కార్యకలాపాల కేంద్రం (సియుఎన్‌పికె)ను భారతీయ సైన్యం ఏర్పాటు చేసింది. ప్రతి ఏడాది ఈ కేంద్రం 12,000 దళాలకు శిక్షణను ఇస్తుంది. సంభావ్య శాంతిపరిరక్షకుల, శిక్షకుల కోసం కంటింజెంట్ స్థాయి శిక్షణ నుంచి జాతీయ, అంతర్జాతీయ కోర్సులు నిర్వహించడం వరకు అనేక కార్యకలాపాలను సియుఎన్‌పికె చేపడుతుంది. ఉత్తమ ఆచరణలను పంచుకోవడంలో భాగంగా విదేశీ ప్రతినిధులకు ఆతిథ్యమిస్తుంది. ఐరాస శాంతి పరిరక్షక శిక్షణ రంగంలో సామర్ధ్యాన్ని పెంపొందించడంలో భాగంగా స్నేహపూర్వక విదేశీ దేశాలకు క్రమం తప్పకుండా చర శిక్షణ బృందాలను కేంద్రం పంపుతుంది. ఈ సంస్థ రెండు దశాబ్దాలలో ఉత్తమ కేంద్రంగా, అనుభవాలకు, ఉత్తమ ఆచరణలకు కోశాగారంగా పరిణామం చెందింది.
ఐక్యరాజ్య సమితి మిషన్లలో భారతీయ సైనికుల కార్యాచరణ సామర్ధ్యాన్ని, స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు, భారతీయ సైన్యం అత్యాధునిక పరికరాలు, వాహనాలను మోహరించింది. ఈ వాహనాలు, పరికరాలు భారత్‌లో తయారు చేసినవే కాక, మిషన్ ప్రాంతాలలో క్లిష్టతరమైన భౌగోళిక ప్రాంతాల, వాతావరణ, కార్యాచరణ పరిస్థితులలో అస్థిరతలను విజయవంతంగా తట్టుకుని నిలబడ్డాయి.
ఐక్యరాజ్య సమితి, ఆతిథ్య దేశాలు, భాగస్వామ్య దేశాల సామర్ద్యాల అభివృద్ధిలో భారతదేశంముందంజలో ఉంది.
చురుకైన, సరళమైన యూనిట్లను, శాంతిపరిరక్షకుల శిక్షణ, లాజిస్టిక్ మద్దతు, జెండర్ సమానత్వాన్ని పెంచడం, సాంకేతికత విస్తరింపులకు సహకరించడం ద్వారా ఐరాస చొరవలకు మద్దతు అందించేందుకు ఇది ఎప్పుడూ కృషి చేసింది. శిక్షన మౌలికసదుపాయాల అభివృద్ధి, పౌర - సైనిక సహకారం (సిఎంఐసి) కార్యకలాపాలను అందించడం ద్వారా ఆతిథ్య దేశ సామర్ధ్య అభివృద్ధికి భారతదేశం క్రియాశీలను మద్దతును అందించడాన్ని కొనసాగిస్తోంది.
****
(Release ID: 1928086)
Visitor Counter : 246