పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం ప్రతి ఒక్కరూ యోగా చేసేలా ప్రోత్సహించడానికి మిషన్ లైఫ్ కింద హైదరాబాద్ లో జరగనున్న యోగా కౌంట్ డౌన్ కార్యక్రమంలో పాల్గోనున్న జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
Posted On:
28 MAY 2023 8:51PM by PIB Hyderabad
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటయ్యే కార్యక్రమాల్లో ప్రజలు వేళా సంఖ్యలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. పర్యావరణంపై అవగాహన కల్పించి, పర్యావరణ పరిరక్షణ కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం కోసం ప్రతి ఏటా నిర్వహిస్తున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈ ఏడాది లైఫ్ మిషన్ కు ప్రాధాన్యత ఇచ్చి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం కేంద్ర పర్యావరణ, అటవీ , వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కార్యాచరణ కార్యక్రమాన్ని సిద్ధం చేసింది. గ్లాస్గోలో 2021 లో జరిగిన UNFCCC COP26 ప్రపంచ దేశాల సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లైఫ్ కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. పర్యావరణహిత సుస్థిరమైన జీవనశైలిని అవలంభించి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని లైఫ్ మిషన్ కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాలకు భారతదేశం పిలుపు ఇచ్చింది. లైఫ్ మిషన్ ను విజయవంతం చేయడానికి ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ దినోత్సవం రోజున భారీ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర పర్యావరణ, అటవీ , వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. జూన్ 5న నిర్వహించే కార్యక్రమానికి ముందు దేశ వ్యాప్తంగా పలు సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి జన సమీకరణకు శ్రీకారం చుట్టాయి.
నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ (NMNH)
మైసూరు కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ 28.05.2023న మిషన్ లైఫ్ (పర్యావరణహిత జీవనశైలి)లో భాగంగా "ప్లాస్టిక్ కాలుష్యం , ప్లాస్టిక్ వాడకంపై అవగాహన చర్చ" నిర్వహించింది. దీనిలో 194 మంది విద్యార్థులు ,ప్రజలు పాల్గొన్నారు. పర్యావరణ అనుకూల జీవనశైలి ప్రాధాన్యత అంశంపై చర్చ జరిగింది.
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా:
హైదరాబాద్ లో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మిషన్ లైఫ్ పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.
హైదరాబాద్‌లో జరిగిన కౌంట్ డౌన్ టు యోగా డే కార్యక్రమంలో 700 మంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి హాజరయ్యారు. పాల్గొన్నవారు మిషన్ లైఫ్ ప్రతిజ్ఞ తీసుకున్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సిబ్బంది యోగా ప్రాముఖ్యత వివరించి, కార్యక్రమంపై అవగాహన కల్పించడానికి హాజరైన వారితో మాట్లాడి మిషన్ లైఫ్ కింద ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రతి ఒక్కరూ యోగాను అనుసరించాలని కోరారు.
నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్‌మెంట్ (NCSCM)
మిషన్ లైఫ్ లక్ష్యాలు ప్రచారం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్‌మెంట్ తమిళనాడుకు రాష్ట్రంలోని చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంగల్పట్టు జిల్లా మహాబలిపురంలో తీర ప్రాంత శుభ్రత, అవగాహన కార్యక్రమం నిర్వహించింది. భారతదేశంలోని పురాతన స్మారక కట్టడాలు కలిగి ఉన్న ప్రాంతాల్లో మహాబలిపురం ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడ ఏకశిలా, గుహ దేవాలయాలు ఉన్నాయి. మహాబలిపురాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తించింది. మహాబలిపురం లో ఉన్న కట్టడాలు భారతీయ సాంప్రదాయ వాస్తుశిల్పం వైభవానికి చిహ్నంగా కనిపిస్తాయి. ఈ అద్భుతమైన నిర్మాణాలు ఆరవ శతాబ్దం కాలానికి చెందినవి. ప్రతి సంవత్సరం 10.76 లక్షల మంది దేశీయ సందర్శకులు, లక్ష మందికి పైగా విదేశీ సందర్శకులు మహాబలిపురం పర్యటిస్తున్నారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అంచనా వేసింది. , ముఖ్యంగా వారాంతాల్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పర్యాటక రంగంపై ఆధారపడి ప్రాంత ప్రజలు జీవిస్తున్నారు.ప్రజల సామాజిక ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపే పర్యాటక రంగం నిర్వహణ సక్రమంగా జరగాల్సి ఉంటుంది. నిర్వహణ సక్రమంగా లేనప్పుడు సముద్ర-తీర పర్యావరణ వ్యవస్థ నాణ్యత దెబ్బ తింటుంది. బీచ్‌లలో చెత్త కాలుష్యాన్ని పెంచుతుంది. ప్లాస్టిక్ కాలుష్యం ప్రస్తుతం అత్యంత తీవ్రమైన పర్యావరణ సమస్యలలో ఒకటిగా ఉంది. బీచ్ టూరిజం సమస్య పరిష్కారానికి దోహదపడుతుంది. జీవావరణ శాస్త్రం, ప్రజారోగ్యం, వాతావరణం, ఆర్థిక వ్యవస్థలను సముద్ర తీర ప్రాంతాల్లో పేరుకు పోయే చెత్త ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. సముద్రపు చెత్తాచెదారం, ముఖ్యంగా ప్లాస్టిక్ గత రెండు దశాబ్దాలుగా ప్రపంచ సమస్యగా మారింది. దీనివల్ల ప్రజలు, పర్యావరణం, సముద్ర తీర ప్రాంతాలు తీవ్రంగా కోలుకోలేని విధంగా దెబ్బ తింటున్నాయి. తీర ప్రాంతాల్లో చెత్త లేకుండా చేయడం,, పరిశోధకులు, తీరప్రాంత నిర్వాహకుల సహకారంతో కాలుష్యం గురించి సామాజిక అవగాహన పెంచడం వంటి కార్యక్రమాల ద్వారా కాలుష్య సమస్య పరిష్కారం అవుతుందని గుర్తించారు. సముద్రపు చెత్త సమస్య పరిష్కార అంశంలో చైతన్యవంతులైన ప్రజలు కీలకంగా ఉంటారు.. మామల్లపురం బీచ్‌లో చారిత్రాత్మక ప్లాగింగ్ సందర్భంగా ప్రధానమంత్రి ముందు ఉండి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా దేశంలోని తీరప్రాంతాలు, బీచ్‌లలో చెత్తాచెదారాన్ని తొలగించేందుకు తీరప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో పౌరులు చురుగ్గా పాల్గొనాలని కోరారు.
శుభ్రత కార్యక్రమంలో భాగంగా పర్యాటకులు, నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్‌మెంట్ శాస్త్రవేత్తలతో కలిసి బీచ్ క్లీన్-అప్‌లో స్వచ్ఛందంగా పాల్గొని ప్లాస్టిక్ సీసాలు, ఆహార వ్యర్ధాలు , ప్లాస్టిక్ సామాగ్రి , పాదరక్షలు, సీసాల మూతలు , ప్లాస్టిక్ స్ట్రా , ప్లాస్టిక్ కంటైనర్‌లతో సహా 40 కిలోల చెత్తను సేకరించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 250 మంది సందర్శకులు, వ్యాపారులు, దుకాణదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రజలు పర్యావరణం కోసం జీవనశైలి (LiFE) అంశాలపై అవగాహన కల్పించారు.పర్యాటకులతో కలిసి శాస్త్రవేత్తలు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వినియోగం, బాధ్యతాయుతమైన పర్యాటకం, మూలం వద్ద వ్యర్థాలను వేరు చేయడం, నీరు, శక్తి , జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లను నివారించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఎన్‌సిఎస్‌సిఎం సిబ్బంది బీచ్ వెండర్లు, టూరిస్టులకు జూట్ బ్యాగులు, క్యాప్‌లను పంపిణీ చేశారు. సముద్రపు ఆవాసాల సున్నితత్వం, వాతావరణ మార్పుల ప్రభావం , ప్రకృతితో సామరస్యంగా జీవించాల్సిన అవసరం గురించి సరళమైన విధానంలో పర్యాటకులకు ఎన్‌సిఎస్‌సిఎం సిబంది వివరించారు. సముద్ర తీర ప్రాంత ప్రత్యేకతలను ప్రజలకు వివరించిన ఎన్‌సిఎస్‌సిఎం శాస్త్రవేత్తలు, సిబ్బంది పర్యావరణ పరిరక్షణ కోసం అవలంభించాల్సిన పద్దతులను వివరించారు. పర్యావరణ నాణ్యత కోసం రోజువారీ జీవితంలో చెత్త ఉత్పత్తి తగ్గించడం ప్రాముఖ్యతను వివరించారు.కార్యక్రమంలో భాగంగా బీచ్‌లో ప్లకార్డులు, పోస్టర్లు, లైఫ్ మస్కట్‌లను ప్రదర్శించారు.
***
(Release ID: 1928084)
Visitor Counter : 285