రక్షణ మంత్రిత్వ శాఖ
పరిశ్రమల సమస్యలను అర్థం చేసుకోవడానికి & తమ విధానాల పట్ల అవగాహనను పెంచేందుకు హైదరాబాదులో పరిశ్రమలతో సమావేశాన్ని నిర్వహించిన డిఆర్‌డిఒ
భారత్‌ను నికర రక్షణ ఎగుమతిదారిగా చేసేందుకు సాధ్యమైనంత మద్దతు ఇచ్చేందుకు హామీ
Posted On:
28 MAY 2023 11:31AM by PIB Hyderabad
పరిశ్రమలతో చర్చ, మేథోమథన సెషన్‌ను మే 27, 2023న హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సిఐ)లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ) నిర్వహించింది. ఎంఎస్ఎంఇలు & స్టార్టప్‌లు సహా అన్ని రక్షణకు సంబంధించిన పరిశ్రమలను ఒక వేదికపైకి తెచ్చి వారి ఆందోళనలను అవగాహన చేసుకోవడమే కాక డిఆర్‌డిఒ చేపట్టిన పలు పరిశ్రమ అనుకూల చొరవలు, విధానాల గురించి పెంచడం ఈ ఒకరోజు సమావేశ లక్ష్యం. ఈ కార్యక్రమంలో 180కి పైగా పరిశ్రమలు పాల్గొన్నాయి.
రక్షణ పరిశోధన& అభివృద్ధి విభాగం కార్యదర్శి, డిఆర్‌డిఒ చైర్మన్ డాక్టర్ వి. సమీర్ కామత్ చింతన్ పేరుతో జరిగిన బహిరంగ మేథోమథన సదస్సుకు అధ్యక్షత వహించారు. భారత్‌ను నికర రక్షణ ఎగుమతిదారుగా చేసేందుకు వారి సామర్ధ్యాలను నిర్మించుకోవడంలో మార్గదర్శి పాత్ర వహిస్తూనే, సాధ్యమైనంత మద్దతును డిఆర్‌డిఒ అందిస్తుందని ఆయన పరిశ్రమలకు హామీ ఇచ్చారు. భారతీయ రక్షణ ఉత్పత్తి రంగం పూర్తి స్వయం సమృద్ధిని సాధించేందుకు ఇస్తున్న ప్రోత్సాహానికి మరింత బలాన్ని ఇచ్చేందుకు క్రమం తప్పకుండా ఇటువంటి చొరవలను చేపట్టవలసిన అవసరాన్ని డిఆర్‌డిఒ చైర్మన్ నొక్కి చెప్పారు.
డైరెక్టొరేట్ ఆఫ్ ఇండస్ట్రీ ఇంటర్‌ఫేస్ & టెక్నాలజీ మేనేజ్‌మెంట్ (డిఐఐటిఎం) డైరెక్టర్ శ్రీ అరుణ్ చౌదరి మాట్లాడుతూ భారతీయ పరిశ్రమలకు మద్దతును ఇచ్చే వివిధ డిఆర్‌డిఓ చొరవలు, విధానాల పై సంక్షిప్త వివరణను ఇచ్చారు. పరిశ్రమలకు డిఆర్‌డిఒ సాంకేతిక బదిలీ ప్రక్రియను వివరిస్తూ, విధాన ముఖ్యలక్షణాలను పట్టి చూపారు. అభివృద్ధి & ఉత్పత్తి భాగస్వాములుగా పరిశ్రమల ఎంపిక ప్రక్రియ అవసరాన్ని ఆయన వివరించారు. సాంకేతిక అభివృద్ధి నిధి (టిడిఎఫ్) పథకంలోని ముఖ్యాంశాలను పరిశ్రమలకు తగిన రీతిలో వివరించారు. డిఆర్‌డిఒ తమ భారతీయ పరిశ్రమలు తమ మౌలికసదుపాయా పరీక్షా కేంద్రం, డిఆర్‌డిఒ పేటంట్ల వినియోగంపై డిఆర్‌డిఒ విధానం, ప్రక్రియల వివరాలను ఇచ్చారు.
ఎంఎస్ఎంఇలు, రక్షణ తయారీ సంస్థల పరిపక్వతను కొలించేందుకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసిఐ) సహకారంతో డిఆర్‌డిఒ సిస్టం ఫర్ అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ అసెస్‌మెంట్ అండ్ ర్యాంకింగ్ (ఎస్ఎఎంఎఆర్ - ఆధునిక తయారీ మూల్యాంకనం & ర్యాంకింగ్ కోసం విధానం)ని ప్రమాణంగా అభివృద్ధి చేసింది.
ఈ కార్యక్రమం సందర్భంగా ఎస్ఎఎంఎఆర్ గురించి, జియో- ట్యాగింగ్, టైమ్ స్టాంపింగ్ తో డిజిటైజ్డ్ మూల్యాంకనం గురించి విహంగ వీక్షణాన్ని సమర్పించారు. రాయితీ దరలతో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు ఎస్ఎఎంఎఆర్ ను డిఆర్‌డిఒ అందిస్తోంది.
ఎంఎస్ఎంఇలు & భారీ పరిశ్రమల వాటాదారులతో పాటు స్టార్టప్ వ్యవస్థాపకులు డిఆర్‌డిఒతో పని అనుభవాన్ని గురించి ప్రెజెంటేషన్లు ఇచ్చారు. వర్తమాన ప్రక్రియలు, విధానాలను మెరుగుపరిచేందుకు విలువైన సూచనలను ఇవ్వడమే కాక, వ్యాపారం చేయడాన్ని సులభతరం చేసేందుకు మార్గాలను గురించి సూచనలు చేశారు.
రక్షణ్య పర్యావరణ వ్యవస్థలోని వాటాదారులందరితో మరింత సమన్విత చర్యల అవసరాన్ని క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల డిజి, డాక్టర్ బిహెచ్‌విఎస్ నారాయణ మూర్తి, ప్రొడక్షన్ కోఆర్డినేషన్ & సర్వీసెస్ ఇంటరాక్షన్ డిజి డాక్టర్ చంద్రికా కౌశిక్ పట్టి చూపారు. ఈ కార్యక్రమానికి డైరెక్టొరేట్ ఆఫ్ క్వాలిటీ, రిలయబిలిటీ & సేఫ్టీ వైస్ అడ్మిర్ రంజిత్ సింగ్ సహా, డిఆర్‌డిఒ డైరెక్టర్లు & శాస్త్రవేత్తలు హాజరయ్యారు.
ఈ కార్యక్రమం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైన మద్దతును, హామీలను కోరడానికి, ఎదుర్కొంటున్న సవాళ్ళను వ్యక్తం చేయడానికి ఒక అవకాశాన్ని కల్పించడమే కాక బహరింగ మేధోమథన సెషన్ ఆత్మచింతన్ & మంథన్‌కు ఒక ప్రత్యేక ప్రారంభాన్ని అందించింది.
వ్యాపారాన్ని చేయడం సులభతరం చేసేందుకు, పరిశ్రమకు చేయూతను అందించేందుకు పునర్నిర్వచించిన చట్రాన్ని రూపొందించడానికి చర్చలు జరిగాయి.
***
(Release ID: 1928052)
Visitor Counter : 153