వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఐపిఈఎఫ్ పిల్లర్-II (సరఫరా గొలుసులు) టెక్స్ట్-ఆధారిత చర్చలకు విజయవంతమైన మరియు గణనీయమైన ముగింపు; ఇతర పిల్లర్స్‌ ఆధ్వర్యంలో మంచి పురోగతి


ఐపిఈఎఫ్ సరఫరా గొలుసులలో పెట్టుబడుల సమీకరణతో పాటు ఒప్పందంలోని కార్యాచరణ ఆధారిత అంశాలను త్వరితగతిన అమలు చేయాలని పిలుపునిచ్చిన శ్రీ పీయూష్ గోయల్

ప్రాంతీయ హైడ్రోజన్ ఇనిషియేటివ్‌ను పరిచయం చేసిన పలువురు ఐపిఈఎఫ్ భాగస్వాములు

Posted On: 28 MAY 2023 10:51AM by PIB Hyderabad

నిన్న జరిగిన ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పిరిటీ (ఐపిఈఎఫ్) రెండవ మంత్రివర్గ సమావేశానికి డెట్రాయిట్‌లో యుఎస్ ఆతిథ్యం ఇచ్చింది. కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ వర్చువల్‌గా ఈ మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు.

ఐపిఈఎఫ్‌ని యూఎస్‌ఏ మరియు ఇండో పసిఫిక్ ప్రాంతంలోని ఇతర భాగస్వామ్య దేశాలు సంయుక్తంగా మే 23, 2022న టోక్యోలో ప్రారంభించాయి. ఐపిఈఎఫ్‌లో ఆస్ట్రేలియా, బ్రూనై, ఫిజి, ఇండియా, ఇండోనేషియా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం,యూఎస్‌ఏతో సహా 14 భాగస్వామ్య దేశాలకు సభ్యత్వం ఉంది. ఈ ప్రాంతంలో వృద్ధి, శాంతి మరియు శ్రేయస్సును ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో భాగస్వామ్య దేశాల మధ్య ఆర్థిక బంధాన్ని బలోపేతం చేయడానికి ఇది ప్రయత్నిస్తుంది.

ఫ్రేమ్‌వర్క్ వాణిజ్యానికి సంబంధించిన నాలుగు స్తంభాల చుట్టూ నిర్మించబడింది (పిల్లర్ I); సరఫరా గొలుసులు (పిల్లర్ II); క్లీన్ ఎకానమీ (పిల్లర్ III); మరియు ఫెయిర్ ఎకానమీ (పిల్లర్ IV). పిల్లర్-Iలో పరిశీలక హోదాను కలిగి ఉండగా భారతదేశం ఐపిఈఎఫ్ పిల్లర్స్ II నుండి IV వరకు చేరింది.

ఈ మంత్రివర్గ సమావేశంలో, సరఫరా గొలుసు (పిల్లర్-II) కింద చర్చలు గణనీయంగా ముగిశాయి; ఇతర ఐపిఈఎఫ్ పిల్లర్ల క్రింద మంచి పురోగతి నివేదించబడింది. సంబంధిత ఐపిఈఎఫ్ పిల్లర్లలో ప్రతి (క్రింద ఉన్న లింక్) టెక్స్ట్-ఆధారిత చర్చలకు సంబంధించిన పరిణామాలపై నవీకరణను అందించడానికి మంత్రివర్గ సమావేశం ముగింపులో పిల్లర్ల వారీగా ప్రెస్ స్టేట్‌మెంట్ జారీ చేయబడింది.

సప్లై చెయిన్స్ (పిల్లర్-II) కింద ఐపిఈఎఫ్ భాగస్వామ్య దేశాలు వీటిని కోరుతున్నాయి: సంక్షోభ ప్రతిస్పందన చర్యల ద్వారా మరింత స్థితిస్థాపకంగా పటిష్టంగా మరియు చక్కగా సమీకృతం చేయబడ్డ సరఫరా గొలుసులు, వ్యాపార కొనసాగింపును మెరుగ్గా నిర్ధారించడానికి మరియు లాజిస్టిక్స్ మరియు కనెక్టివిటీని మెరుగుపరచడానికి అంతరాయాలను తగ్గించడానికి సహకారం; ముఖ్యంగా క్లిష్టమైన రంగాలలో పెట్టుబడులను ప్రోత్సహించడం మరియు కీలక వస్తువుల ఉత్పత్తి; మరియు అవసరమైన నైపుణ్యం మరియు రీస్కిల్లింగ్ ద్వారా కార్మికుల పాత్ర మెరుగుదల, మరియు ఐపిఈఎఫ్ అంతటా నైపుణ్యాల ఆధారాల ఫ్రేమ్‌వర్క్‌ల పోలికను పెంచడం వంటివి. ఈ పిల్లర్ క్రింద తన జోక్యం సందర్భంగా శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఐపిఈఎఫ్‌లో ఆర్థిక వ్యవస్థలు మరియు సరఫరా/విలువ గొలుసుల యొక్క లోతైన ఏకీకరణను ప్రోత్సహించగల వేగవంతమైన చర్చల మరియు పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందాన్ని అందించడంలో చర్చల బృందాలను అభినందించారు మరియు ఈ ఒప్పందంలో భాగంగా గుర్తించబడిన ఆధారిత సహకార మరియు సహకార అంశాలు త్వరితగతిన అమలు చేయాలని కోరారు.

క్లీన్ ఎకానమీ (పిల్లర్-III) కింద ఐపిఈఎఫ్ భాగస్వాములు పరిశోధన, అభివృద్ధి, వాణిజ్యీకరణ, లభ్యత, ప్రాప్యత మరియు స్వచ్ఛమైన ఇంధనం మరియు వాతావరణ అనుకూల సాంకేతికతల విస్తరణపై సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడం మరియు ఈ ప్రాంతంలో వాతావరణ సంబంధిత ప్రాజెక్టులకు పెట్టుబడిని సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంకా, ఆసక్తి ఉన్న ఐపిఈఎఫ్ భాగస్వాములు ఈ ప్రాంతంలో పునరుత్పాదక మరియు తక్కువ కార్బన్ హైడ్రోజన్ మరియు దాని ఉత్పన్నాల విస్తృత విస్తరణను ప్రోత్సహించడానికి ప్రాంతీయ హైడ్రోజన్ చొరవను ప్రవేశపెడుతున్నారు. ఈ పిల్లర్ క్రింద తన జోక్యం సందర్భంగా శ్రీ గోయల్ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో కూడిన దీర్ఘకాలిక వాతావరణ ఫైనాన్స్‌ను సమీకరించడం మరియు స్వచ్ఛమైన ఇంధన సాంకేతికతలకు మెరుగైన ప్రాప్యత వంటి కార్యాచరణ-ఆధారిత అంశాలపై కేంద్రీకృతమై ఉండాలని భారతదేశం కోరుకుంటుందని  హైలైట్ చేశారు.

ఫెయిర్ ఎకానమీ (పిల్లర్-IV) కింద ఐపిఈఎఫ్ భాగస్వాములు ఐపిఈఎఫ్ ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యం,వ్యాపారంమరియు పెట్టుబడిని పెంచడానికి సమర్థవంతమైన అవినీతి నిరోధక మరియు పన్ను చర్యల అమలును బలోపేతం చేసే ఒప్పందం యొక్క టెక్స్ట్ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ పిల్లర్‌ క్రింద తన జోక్యం సందర్భంగా మంత్రి మాట్లాడూతూ అవినీతి రహిత పరిపాలనను అందించడానికి భారతదేశ శాసన మరియు పరిపాలనా చట్రాన్ని మెరుగుపరచడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ డైనమిక్ నాయకత్వంలో భారతదేశం తీసుకున్న బలమైన చర్యలను ఎత్తిచూపారు మరియు ఎన్‌ఎస్‌సిఏసి మరియు ఎఫ్‌ఏటిఎఫ్‌ ప్రమాణాల అమలులో భారతదేశం నిబద్ధతను పునరుద్ఘాటించారు.

 

Link for Press Statement

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2023/may/doc2023528205801.pdf

 

***



(Release ID: 1928049) Visitor Counter : 122