సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వారణాసి దివ్య కళా శక్తి కార్యక్రమానికి ప్రముఖులు, దివ్యాంగులైన కళాకారులు


దివ్యాంగుల కళా సామర్థ్యాలు వెలుగులోకి రావాలన్న మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దార్శనికత నెర్చనున్న దివ్య కళా శక్తి

- దివ్య కళా శక్తి కార్యక్రమంలో పాల్గొన్న కార్యదర్శి రాజేష్ అగర్వాల్, వికలాంగ కళాకారుల అసాధారణ ప్రదర్శనలను ప్రశంసించారు

Posted On: 27 MAY 2023 9:50PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ వికలాంగుల సాధికారత విభాగం కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ ఈ రోజు మే 27న వారణాసిలోని రుద్రాక్ష కన్వెన్షన్ & కల్చరల్ సెంటర్‌లో  ఏర్పాటు చేసిన 'దివ్య కళా శక్తి' కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ప్రజాప్రతినిధులు, రాష్ట్ర పరిపాలన, వివిధ ప్రభుత్వేతర సంస్థలు, ఆశా వర్కర్లు, అంగన్‌వారీ వర్కర్లు, ప్రాథమిక, మాధ్యమిక ఉపాధ్యాయులు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు, సంగీత ప్రతినిధులు, పునరావాస నిపుణులు మరియు డిపార్ట్‌మెంట్‌లోని వాటాదారులతో సహా వివిధ రంగాలకు చెందిన సుమారు 1,600 మంది ప్రేక్షకులు ఈ కార్యక్రమాలన్ని వీక్షించారు. 'దివ్య కళా శక్తి' అనే సాంస్కృతిక కార్యక్రమంలో దివ్యాంగుల పిల్లలు మరియు యువకుల అసాధారణ ప్రదర్శనలను వెలుగులోకి తెచ్చే కార్యక్రమం. అశక్తతలో సామర్థ్య నిరూపణ దిశగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖలోని వికలాంగుల సాధికారత విభాగం (దివ్యాంగజన్) ఆధ్వర్యంలోని సీఆర్సీ-లక్నో అనే సంస్థ ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 18, 2019, మరియు జూలై 23, 2019న రాష్ట్రపతి భవనం మరియు బాలయోగి ఆడిటోరియంలో ఇలాంటి జాతీయ కార్యక్రమాలను నిర్వహించిన తరువాత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ దర్శకత్వంలో దివ్య కళాశక్తిని నిర్వాహకులుప్రాంతీయ స్థాయిలకు తీసుకువెళుతున్నారు. ఈ దిశలో భాగంగా ముంబయి, అరుణాచల్, చెన్నై, న్యూఢిల్లీ మరియు గౌహతిలోని పశ్చిమ ప్రాంతం, ఈశాన్య మరియు దక్షిణ ప్రాంతంతో సహా వివిధ ప్రదేశాలలో ఐదు ప్రాంతీయ “దివ్య కళా శక్తి” కార్యక్రమాలు ఇప్పటికే జరిగాయి. ఈసారి, ఆరవ దివ్య కళా శక్తి కార్యక్రమాన్ని దివ్య నగరమైన వారణాసిలో నిర్వహించారు. ఇందులో పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ వంటి ఆరు రాష్ట్రాల నుండి సుమారు 100 మంది కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. నేటి కార్యక్రమం పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ ప్రాంతాల జానపద మరియు ప్రాంతీయ నృత్య రూపాల యొక్క ప్రత్యేక కలయికను ప్రతిబింబించింది.

 

 

డిపార్ట్మెంట్ కొరియోగ్రాఫర్లతో వారి రిహార్సల్స్ మరియు ప్రాక్టీస్ సెషన్లను ఏర్పాటు చేసింది. కార్యక్రమం ఇలాంటి పిల్లలలో క్రమశిక్షణ, సమయస్ఫూర్తి, పనితీరు వారి మేధోసృజనాత్మక మరియు గుప్త వారు స్వీయ-వాస్తవికత కోసం ఉపయోగించాల్సిన గుప్త సామర్థ్యాలకు గొప్ప ఉదాహరణగా నిలిచింది కార్యక్రమానికి సీనియర్ ప్రభుత్వ అధికారులుసృజనాత్మక వ్యక్తులుఅధ్యాపకులుప్రధానోపాధ్యాయులు మరియు వివిధ వికలాంగుల న్యాయవాద సమూహాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ ప్రముఖులు పాల్గొన్నారుశారీరకదృశ్యవినికిడిమేధావిఆటిజం నుండి బహుళ వైకల్యాలు మరియు మరుగుజ్జు వంటి వైకల్యాలున్న పిల్లలు మరియు యువకులు ప్రదర్శనలో పాల్గొన్నారు. వారు కళసంస్కృతిక్రీడలు లేదా ఏదైనా  రంగంలోనైనా రాణించగలరని వారి ప్రదర్శన నిరూపించిందిదివ్యాంగులు ప్రతిభావంతులైన మానవులు, మా దివ్యాంగు సోదరీమణులు మరియు సోదరులకు సమగ్రమైనప్రాప్యత మరియు సమానమైన భవిష్యత్తును నిర్ధారించడానికి మేము దృఢంగా కృషి చేస్తున్నాముఅని ప్రధాన మంత్రి చెప్పిన స్ఫూర్తిదాయకమైన మాటలను దివ్యాంగులైన పిల్లలు మరియు ప్రేక్షకులు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారువారి మనోధైర్యం మరియు వివిధ రంగాలలో సాధించిన విజయాలు మనందరికీ స్ఫూర్తినిస్తాయి." అని కార్యవదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ అన్నారు. కళాకారులందరి పనితీరును మెచ్చుకున్నారు మరియు దివ్యాంగుల పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించారు, అటువంటి కార్యక్రమాలు ఇకపై కూడా నిర్ణీత వ్యవధిలో జరుగుతాయని తెలిపారు. అన్ని గ్రూపుల పనితీరును కూడా ఆయన అభినందించారు. జాయింట్ సెక్రటరీ శ్రీ రాజీవ్ శర్మ ప్రముఖులందరికీ స్వాగతం పలికారుఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శ్రీ అజిత్ కుమార్దివ్యాంగులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. వారిలోని ప్రతిభను గుర్తించి క్రీడలు లేదా సాంకేతిక విద్య మొదలైన ప్రతి రంగంలో పాల్గొనాలని కోరారు వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ ఎస్రాజలింగం మాట్లాడుతూ కాశీని అందమైనపరిశుభ్రమైన మరియు అందుబాటులో ఉండే నగరంగా మార్చడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

******


(Release ID: 1927819) Visitor Counter : 144


Read this release in: English , Urdu , Hindi