రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ఐ ఐ టి గౌహతి మరియు జాతీయ రహదారులు & మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ హెచ్ ఐ డి సి ఎల్) మధ్య అవగాహన ఒప్పందం (ఎం ఓ యు)పై సంతకాలు

Posted On: 26 MAY 2023 4:20PM by PIB Hyderabad

గురువారం (25 మే,2023) నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐ ఐ టి గౌహతి మరియు జాతీయ రహదారులు & మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ హెచ్ ఐ డి సి ఎల్) మధ్య అవగాహన ఒప్పందం (ఎం ఓ యు)పై సంతకాలు జరిగాయి.

         సివిల్ ఇంజనీరింగ్,  రోడ్ల నిర్మాణం,  ప్రణాళికా రచన మరియు రూపకల్పన, ఈ రంగంలో పరిశోధనాభివృద్ధి (ఆర్ & డి)కి సంబంధించి గణనీయమైన తోడ్పాటును అందించిన ప్రతిష్టాత్మక సంస్థ ఐ ఐ టి గౌహతి.  ఆ సంస్థ నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవడమే ఈ భాగస్వామ్యం  ఉద్దేశం. అవగాహన ఒప్పందంపై ఐ ఐ టి గౌహతి డైరెక్టర్ ప్రొఫెసర్ పరమేశ్వర్ కె. అయ్యర్ ,  ఎన్ హెచ్ ఐ డి సి ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చంచల్ కుమార్ సంతకాలు చేశారు.  

ఎన్ హెచ్ ఐ డి సి ఎల్  భారత ప్రభుత్వ రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ  సంస్థ.   నిర్మాణ రంగంలో  ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి వినూత్న సాంకేతిక పరిజ్ఞానం కోసం వెతకడం, ప్రోత్సహించడం చేస్తోంది.  
అసాధారణ  వాతావరణ మరియు భౌగోళిక పరిస్థితుల్లో రహదారుల నిర్మాణ  క్షేత్రానికి అవసరమైన వినూత్నసాంకేతిక విజ్ఞానాన్ని  ప్రోత్సహిస్తోంది.  


 

*****



(Release ID: 1927627) Visitor Counter : 128


Read this release in: English , Urdu , Hindi , Manipuri