యు పి ఎస్ సి

యుపిఎస్సి సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేసిన ఐఆర్ఎస్ అధికారిణి శ్రీమతి సుమన్ శర్మ (ఐటి :1990)

Posted On: 25 MAY 2023 4:56PM by PIB Hyderabad

ఐఆర్ఎస్ అధికారిణి (ఐటి:1990) శ్రీమతి సుమన్ శర్మ యుపిఎస్సి సభ్యురాలిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారాన్ని
 యుపిఎస్సి ఛైర్మన్ డాక్టర్ మనోజ్ సోని ఆమె చేత ప్రమాణం చేయించారు
ఇండియన్ రెవిన్యూ సర్వీస్ (ఇన్ కం టాక్స్) 1990 బ్యాచ్ కు చెందిన అధికారిణి అయిన శ్రీమతి సుమన్ శర్మ,
30 సంవత్సరాలకు పైగా తన కెరీర్లో  పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. అంతర్జాతీయ పన్నులు,  బదిలీ ధరలు,
ఎగుమతి ప్రోత్సాహక పథకాలు, పవర్ ట్రేడింగ్ ఒప్పందాలు వంటి అంశాల విషయంలో కీలక పాత్ర పోషించారు.
ఆదాయపన్నుశాఖలోని ఇన్వెటిగేషన్ విభాగంలో పనిచేస్తున్నప్పుడు ఆమెకు బెస్ట్ సెర్చ్ కి అవార్డు లభించింది. న్యూఢిల్లీలో సిఎల్ఎలో
ఫారిన్ ట్రేడ్ కు అడిషనల్ డైరక్టర్ జనరల్గా ఆమె ఉత్తరాది జోన్ కు సంబంధించి అన్ని రకాల ఎగుమతిదారుల విషయంలో
ఎగుమతి ప్రోత్సాహక పథకాలను పర్యవేక్షించారు.


శ్రీమతి శర్మ, మిడ్ కెరీర్ కోర్సు కింద అమెరికాలోని నార్త్ కరోలీనాలోని డ్యూక్ యూనివర్సిటీ నుంచి బడ్జట్ అంచనాలపైనా,
గుర్గ్రామ్లోని  ఎం.డి.ఐ , బెంగళూరు ఐఐఎం, ఐబిఎఫ్డి, ఆంస్టర్ డామ్, నెదర్లాండ్స్ లనుంచి మేనేజ్ మెంట్ కోర్సులు చేశారు.
ప్రస్తుతం సుమన్ శర్మసోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ ఇ సి ఐ) మేనేజింగ్ డైరక్టర్గా ఉన్నారు. ఎస్.ఇ.సి.ఐ మేనేజింగ్ డైరక్టర్ గా
ఆమె ఉన్న సమయంలో కంపెనీ రాబడి, లాభాలు గణనీయంగా పుంజుకున్నాయి.
 శ్రీమతి శర్మ విధానపరమైన సంస్కరణలకు సంబంధించిన వివిధ బోర్డులు, కమిటీల
లలో కూడా నామినేట్ అయ్యారు.

***

 



(Release ID: 1927405) Visitor Counter : 126


Read this release in: English , Urdu , Hindi