గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రామ పంచాయతీ స్థాయిలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు సమర్థ్ ప్రచారాన్ని ప్రారంభించిన శ్రీ గిరిరాజ్ సింగ్


శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ఎస్‌హెచ్‌జి దీదీలు ‘లఖపతిదీదీలు’ మరియు ‘సూపర్ లఖ్పతిదీదీలు’గా మారుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కొత్త భారతదేశం ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1గా ఎదుగుతోంది: శ్రీ గిరిరాజ్ సింగ్

Posted On: 25 MAY 2023 5:28PM by PIB Hyderabad

కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ఈరోజు లక్నోలో అమృత మహోత్సవ్ కింద 50000 గ్రామ పంచాయితీలలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంపై 'సమర్థ్ క్యాంపయిన్‌'ని ప్రారంభించారు.భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 50,000 గ్రామ పంచాయతీలలో డిజిటల్ లావాదేవీల ప్రమోటింగ్‌పై సమర్థ్ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇవి  1 ఫిబ్రవరి 2023 నుండి ప్రారంభమయ్యాయి మరియు ఆజాదికాఅమృతమహోత్సవ్ కింద 15 ఆగస్టు 2023 వరకు కొనసాగుతాయి.సమర్థ ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశ్యం గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, ముఖ్యంగా మహిళలపై దృష్టి సారించడం.

 

image.png


కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయితీ రాజ్ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ..ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయక నాయకత్వంలో స్వయం సహాయక బృందాల ఎన్‌పిఎ 2014లో 9.58% ఉండగా ప్రస్తుతం 2% దిగువకు తగ్గిందని ప్రశంసించారు. బ్యాంకులు ఎస్‌హెచ్‌జి దీదీల యొక్క అత్యుత్తమ క్రెడిట్ పనితీరును గుర్తించి వారి అద్భుతమైన పనితీరుకు అనుగుణంగా వారికి రుణాలను సులభతరం చేశాయి. కొత్త డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో బిసి సఖీల సహకారాన్ని అభినందిస్తూ పిఎం మోడీ యొక్క దూరదృష్టితో కూడిన కార్యక్రమాలలో భారతదేశం నంబర్ 1 గా ఎదుగుతోందని మహిళా సాధికారతలో కూడా భారతదేశం ప్రపంచ ఉదాహరణలను సృష్టిస్తోందని మంత్రి తెలిపారు.

 

image.png


ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 5 కోట్ల 57 లక్షల లావాదేవీలకు బిసి సఖీలు డిజిటల్ పరివర్తన తీసుకువచ్చారని, బిసి సఖీలు ఇంత గొప్పగా సేవలందించారని హైలైట్ చేశారు. వారి ప్రాంగణంలో తక్కువ వాల్యూమ్ లావాదేవీలపై ఖర్చులను ఆదా చేయడానికి బ్యాంకుల వనరులకు సహాయపడింది. గ్రామాల్లో యూపీ ప్రభుత్వం రూపొందిస్తున్న డిజిటల్ గ్రామ సచివాలయాల్లో ప్రతి ఒక్కరు బ్యాంకు సఖీల సేవలను అందించే సదుపాయాన్ని కలిగి ఉంటారని ముఖ్యమంత్రి తెలిపారు.

బిసి సఖీలు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించినందుకు అభినందిస్తూ గ్రామీణాభివృద్ధి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మాట్లాడుతూ భారతదేశంలోని మహిళలు వంటశాలను నిర్వహించడమే కాకుండా దేశంలోని ప్రతి మూలలో ఉన్న పేద పౌరుల ఇంటి వద్దకు బ్యాంకులను కూడా నిర్వహిస్తున్న ఆల్ రౌండర్ అని అన్నారు.

బిసి సఖీల సహకారాన్ని గుర్తించిన ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కెపి మౌర్య..పెరిగిన సంపాదనతో బిసి సఖులు తమ ఇళ్లలోనే కాకుండా సమాజంలో కూడా గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకున్నారని, ఈ పరివర్తన  భారతదేశంలోని గ్రామాల్లో మహిళల సాధికారతకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి మరియు ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే ఆన్‌లైన్ మోడ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యూపీ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి  విజయ్ లక్ష్మీ గౌతమ్ కూడా హాజరయ్యారు.

ప్రముఖులకు స్వాగతం పలుకుతూ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ శైలేష్ కుమార్ సింగ్ #సమర్థ్‌ ప్రచారం మరియు దాని కింద దీనదయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డిఎవై-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) ద్వారా సాధించబడిన మైలురాళ్ల గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో యుపి ప్రభుత్వ వ్యవసాయ ఉత్పత్తి కమీషనర్ శ్రీ మనోజ్ కుమార్ సింగ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గ్రామీణ జీవనోపాధి అదనపు కార్యదర్శి శ్రీ చరణ్జిత్ సింగ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గ్రామీణ జీవనోపాధి డైరెక్టర్ శ్రీ రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ మరియు కేంద్ర, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. సీనియర్ బ్యాంకర్లు మరియు ఇతర వాటాదారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బిసి సఖీల 75 స్ఫూర్తిదాయక కథల సంకలనాన్ని ఆవిష్కరించారు. అలాగే బిసి సఖీల జీవితాల్లో వచ్చిన మార్పుల ప్రత్యక్ష సాక్ష్యాలను  వారి విజయ గాథలను వివరించారు. ఈ సందర్భంగా బీసీ శాఖాధికారులకు బయోమెట్రిక్‌ పీఓఎస్‌ మిషన్లు పంపిణీ చేయడంతోపాటు కొత్తగా నియమితులైన బీసీ సంఘాలకు నియామక పత్రాలను అందజేశారు.

 

image.png


లక్నోలో జరిగిన కార్యక్రమంలో భారతదేశం నలుమూలల నుండి సుమారు వెయ్యి మంది బిసి సఖీలు పాల్గొన్నారు. రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లు (ఎస్‌ఆర్‌ఎల్‌ఎంలు) మరియు భారతదేశం అంతటా ఉన్న ఇతర వాటాదారులు వెబ్‌కాస్ట్ ద్వారా ఈవెంట్‌లో చేరారు మరియు ఈవెంట్ సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.

 

image.png

*****


(Release ID: 1927399) Visitor Counter : 260


Read this release in: English , Urdu , Hindi