పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

దేశీయ విమానయాన సంస్థల ప్రయాణీకుల చేరవేతలో 43.85 శాతం పెరుగుదల


నెలవారీ వృద్ధి గత ఏడాది కాలంలో 22.18 శాతంగా ఉంది.

మొత్తంమీద విమాన సర్వీసుల రద్దు రేటు కేవలం 0.47 శాతం మాత్రమే.

Posted On: 23 MAY 2023 11:58AM by PIB Hyderabad
దేశీయ విమానయాన సర్వీసులు ప్రయాణీకుల చేరవేతలో గణనీయమైన పురోగతిని సాధించాయి. వివిధ దేశీయ విమానయాన సంస్థలు అందించిన ట్రాఫిక్‌ డాటా ప్రకారం, ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 503.92 లక్షలకు చేరింది. ఫలితంగా వార్షిక వృద్ధిరేటు 42.85 శాతానికి చేరింది. అంతకుముందు సంవత్సరం ఇదే  కాలంలో దేశీయ విమానాలలో ప్రయాణం చేసిన ప్రయాణికుల సంఖ్య 352.75 లక్షలు మాత్రమే.
ఇంత పెద్ద ఎత్తున ప్రయాణికుల సంఖ్య పెరగడాన్ని బట్టి దేశీయ విమానయాన పరిశ్రమ ఎంత వేగంగా వృద్ధి చెందుతున్నదో తెలుస్తున్నది. ప్రస్తుతం పెరుగుతున్న అనుసంధానత ప్రయత్నాలు , ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయాలు కల్పించడం వంటివి ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.
అలాగే పెరుగుతున్న దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్యను గమనించినపుడు, విమానయాన రంగంలో సానుకూల వృద్దివైపు సాగుతున్న విషయం తెలుస్తుంది.
దీనికితోడు, ఎం.ఒ.ఎం వృద్ధి రేటు 2022 ఏప్రిల్‌ నుంచి 2023 ఏప్రిల్‌ వరకు 22.18 శాతం పెరిగింది.దీనిని బట్టి దేశీయ విమానయాన సర్వీసుల ప్రాధాన్యత తెలుస్తోంది. క్రమంగా దేశీయ విమానప్రయాణికుల సంఖ్య పెరగడం ఎయిర్‌ లైన్స్‌, విమానాశ్రయాలు, పౌరవిమాన యాన మంత్రిత్వశాఖ సమష్ఠి కృషికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇది సురక్షితమైన, సమర్ధ, కస్టమర్‌ కేంద్రిత సేవలు అందించినందుకు లభించిన గుర్తుగా కూడా చెప్పుకోవచ్చు.
దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతోపాటు, షెడ్యూల్డ్‌ దేశీయ విమానయాన సర్వీసుల రద్దు 2023 ఏప్రిల్‌లో కేవలం 0.47 శాతంగా ఉంది. అలాగే ప్రతి 10,000 మంది ప్రయాణికులకు ఫిర్యాదులు కేవలం 0.28 శాతం మాత్రమే. సమర్దవంతమైన ప్రణాళిక, నిర్వహణాపరమైన సామర్ధ్యం పెంపు, పౌరవిమాన యాన మంత్రిత్వశాఖ తీసుకున్న సానుకూల నిర్ణయాలు, వంటి కారణాల వల్ల కొవిడ్‌ `19 కారణంగా గత ఇంతకు ముందు రెండు  సంవత్సరాలపాటు విమాన ప్రయాణీకుల సంఖ్య మందకొడిగా ఉన్నప్పటికీ ప్రస్తుతం దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది.
కేంద్ర పౌరవిమానయాన, ఉక్కు శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ఇందుకు సంబంధించి ప్రస్తావిస్తూ, పౌరవిమానయాన రంగానికి సంబంధించి స్టేక్‌ హోల్డర్లందరి సమష్టి కృషి కారణంగా ఏవియేషన్‌రంగం ప్రగతి పథంలో పయనించడమే కాక, ఇది ఇండియాను ఏవియేషన్‌ హబ్‌గా నిలబెట్టేందుకు దోహదపడుతున్నదని అన్నారు. దేశీయ విమానయాన రంగం క్రమంగా పుంజుకుంటుండడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాక, దేశం నలుమూలలా ప్రజలకు అనుసంధానత కల్పిస్తుందన్నారు. విమానయాన రంగం మరింతగా వృద్ధిచెందేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి కొలాబరేటర్లతో , స్టేక్‌ హోల్డర్లతో కలసిపనిచేస్తున్నామన్నారు. ప్రయాణికుల భద్రత, విమానయాన సర్వీసుల సమర్ధత పెంపు, ప్రయాణికుల సంతృప్తి స్థాయి పెంపునకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.
 
***


(Release ID: 1926810) Visitor Counter : 136