రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మలేషియాలో జరిగిన లంగ్‌కావి ఇంటర్నేషనల్ మారిటైమ్ & ఏరోస్పేస్ ఎగ్జిబిషన్‌కు హాజరైన భారత బృందం

Posted On: 23 MAY 2023 3:08PM by PIB Hyderabad

భారత రక్షణ శాఖ అదనపు కార్యదర్శి (రక్షణ ఉత్పత్తులు) శ్రీ టి.నటరాజన్ నేతృత్వంలోని భారతీయ ప్రతినిధి బృందం, 16వ లంగ్‌కావి ఇంటర్నేషనల్ మారిటైమ్ అండ్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్‌-2023కు (లిమా 23) హాజరైంది. ఈ నెల 22-25 తేదీల్లో  మలేషియాలోని లంగ్‌కావిలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎగ్జిబిషన్‌లో భాగంగా, మలేషియా రక్షణ శాఖ మంత్రి డాటో సెరి మొహమ్మద్ హసన్‌తో శ్రీ టి.నటరాజన్ సమావేశం అయ్యారు.

లిమాను 1991లో ప్రారంభించారు, రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో, అతి పెద్ద సముద్ర & అంతరిక్ష ప్రదర్శనల్లో ఇది ఒకటి. ఈ సంవత్సరం, భారత్‌ సహా 30కి పైగా దేశాల నుంచి 600 మంది ఎగ్జిబిటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

*****



(Release ID: 1926680) Visitor Counter : 188