నౌకారవాణా మంత్రిత్వ శాఖ
కేంద్ర ఓడరేవులు, నౌకానిర్మాణం, జలమార్గాల మంత్రిత్వ శాఖ మేధోమథన శిబిరం ముగిసిన తరువాత 'పంచ కర్మ సంకల్ప్' ప్రకటించిన శ్రీ శర్బానంద సోనోవాల్
పర్యావరణ హితమైన నౌకా నిర్మాణం, రవాణా ప్రోత్సహించేందుకు 30% ఆర్థిక సహాయం చేయనున్న మంత్రిత్వ శాఖ
టగ్ పరివర్తన కార్యక్రమం కింద జవహర్ లాల్ నెహ్రు పోర్టు, వి ఓ చిదంబరనార్ పోర్టు, పారాదీప్ పోర్టు మరియు
కాండ్లాలోని దీన దయాళ్ పోర్టు చేరి రెండేసి టగ్ లను సేకరించుకుంటాయి
కాండ్లాలోని దీన దయాళ్ పోర్టులో, ట్యుటీకోరన్ లోని వి ఓ చిదంబరనార్ పోర్టులో హైడ్రోజన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
నదీ, సముద్ర యాత్రకు సంబంధించిన వివరాలను, వాటి బుకింగ్ లను తెలియజేసేందుకు ఏకగవాక్ష పోర్టల్
2024 నాటికి జవహర్ లాల్ నెహ్రు పోర్టు , ట్యూటికోరన్ పోర్టు స్మార్ట్ పోర్టులుగా మారుతాయి.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో పర్యావరణ హితమైన నౌకాయాన రంగంలో ప్రపంచ అగ్రగామి కావాలనే భావనకు కట్టుబడి ఉన్నామని మేము పునరుద్ఘటిస్తున్నాము: శ్రీ శర్బానంద సోనోవాల్
Posted On:
22 MAY 2023 6:17PM by PIB Hyderabad
కేరళలోని మున్నార్ లో సోమవారం జరిగిన మంత్రిత్వ శాఖ రెండవ మేధోమథన శిబిరం తరువాత మాట్లాడుతూ పర్యావరణ హితమైన నౌకాయానం మరియు పోర్టుల డిజిటైజేషన్ పైన దృష్టిని కేంద్రీకరిస్తూ ఐదు ప్రధానమైన ప్రకటనలు చేశారు. మంత్రితో పాటు ఈ శాఖకు చెందిన సహాయ మంత్రులు శ్రీపాద్ నాయక్, శ్రీ శంతను ఠాకూర్, కార్యదరిశి సుధాన్షు పంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన పోర్టుల చైర్ పర్సన్లు , ఇతర సంస్థల / పి ఎస్ యుల అధినేతలు , సీనియర్ అధికారులు పాల్గొన్నారు. మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ ఉపక్రమణల వల్ల ఇండియా వాణిజ్య నౌకాదళంలో ప్రపంచ నేత కాగలదని మంత్రి అన్నారు.
'పంచ కర్మ సంకల్ప్'లో ఐదు ప్రధాన ప్రకటనలు ఉన్నాయి . అవి-- పర్యావరణ హితమైన నౌకా నిర్మాణం, నౌకాయానం, రవాణాను ప్రోత్సహించేందుకు మంత్రిత్వ శాఖ 30% ఆర్థిక సహాయం చేస్తుంది. పర్యావరణ హితమైన టగ్ పరివర్తన కార్యక్రమం కింద జవహర్ లాల్ నెహ్రూ పోర్టు, వి ఓ చిదంబరనార్ పోర్టు, పారాదీప్ పోర్టు, కాండ్లాలోని దీన్ దయాళ్ పోర్టు చెరి రెండు టగ్స్ చొప్పున సేకరిస్తాయి. దీన దయాళ్ పోర్టును, వి ఓ చిదంబరనార్ పోర్టును పర్యావరణ హిత హైడ్రోజెన్ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తారు. నదీ, సముద్ర యాత్రకు సంబంధించిన వివరాలను, వాటి బుకింగ్ లను తెలియజేసేందుకు ఏకగవాక్ష పోర్టల్ ఏర్పాటు. వచ్చే ఏడాదిలో జవహర్ లాల్ నెహ్రు పోర్టు , ట్యూటికోరన్ పోర్టు స్మార్ట్ పోర్టులుగా మారుతాయి.
పర్యావరణ హితమైన నౌకాయానంతో పాటు పోర్టు కార్యకలాపాల డిజిటైజేషన్ పైన శిబిరంలో దృష్టిని కేంద్రీకరించినట్లు సోనోవాల్ తెలిపారు. సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ మాట్లాడుతూ మంత్రిత్వ శాఖ చేపట్టిన సాగరమాల కార్యక్రమం ద్వారా చేపట్టిన పోర్టుల ఆధునీకరణ ప్రాజెక్టుల వల్ల పోర్టుల సామర్ధ్యం బాగా పెరిగిందని అన్నారు. గత ఎనిమిదేళ్లలో సాగరమాల కార్యక్రమం కింద చేపట్టిన 90 పోర్టు ఆధునీకరణ ప్రాజెక్టులు పూర్తయ్యాయి.
మరో సహాయ మంత్రి శ్రీ శంతను ఠాకూర్ మాట్లాడుతూ గడచిన తొమ్మిదేళ్లలో భారతీయ నౌకాయాన రంగంలో , పోర్టులలో అవకాశాలు పటిష్టమయ్యాయని అన్నారు. సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
శిబిరం రెండవ రోజు సమావేశంలో సుపరిపాలన, పని సంస్కృతి మరియు నాయకత్వం గురించి చర్చించారు. గడచిన తొమ్మిదేళ్లలో సరుకుల రవాణా గణాంకాలను వివరిస్తూ సరుకుల రవాణా క్రమంగా వృద్ధి చెందిందని తెలిపారు.
***
(Release ID: 1926671)
Visitor Counter : 237