నీతి ఆయోగ్
అధికారిక విధాన ప్రకటన తొలి ముసాయిదా విడుదలను ప్రకటించిన జి20 స్టార్టప్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్
Posted On:
22 MAY 2023 5:32PM by PIB Hyderabad
భారతదేశపు జి 20 అధ్యక్షతన పని చేస్తున్న స్టార్టప్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ తన ప్రయత్నాలలో ముఖ్యమైన మైలురాయిని ప్రకటించేందుకు గర్విస్తోంది. అధికారిక విధాన ప్రకటనకు సంబంధించిన మూల సూచనలు, విధానాల నిర్దేశాల తొలి ముసాయిదా ప్రస్తుతం ప్రజా వ్యాఖ్యలకు అందుబాటులో ఉంది.
ఆయా దేశాల వ్యాపార వ్యవహారాల స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలను తగినట్టుగా ముసాయిదాలో ప్రతిఫలించేలా చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వాములు తమ విలువైన అందించవలసిందిగా ఇండియా స్టార్టప్ 20 అధ్యక్షులు డాక్టర్ చింతన్ వైష్ణవ్ ఆహ్వానించారు.
ప్రపంచ స్టార్టప్ సమాజంలో వృద్ధిని, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు సమ్మిళిత, సమన్వయపూరిత నిర్ణయాలు చేసే ప్రక్రియ ప్రాముఖ్యతను స్టార్టప్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ గుర్తించింది. ఈ మేరకు తాము స్టార్టప్‌లను, పెట్టుబడుదారులను, మార్గదర్శులను, ఇన్‌క్యుబేషన్/ యాక్సిలరేషన్ మేనేజర్లను, విధానకర్తలను, ఇతర పర్యావరణ వ్యవస్థల నిర్మాతలను ఈ సమీక్ష ప్రక్రియలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహికస్తామని, డాక్టర్ చింతన్ ఉద్ఘాటించారు.
ఆసక్తిగల వర్గాలు ముసాయిదా విధాన ప్రకటనను, ఫీడ్‌బ్యాక్ ఫార్మ్‌ను అధికారిక స్టార్టప్ 20 వెబ్ సైట్ః https://www.startup20india2023.org లో పొందవచ్చు. ఈ పత్రం ప్రజా సమీక్షకు, వ్యాఖ్యలకు ప్రస్తుతం అందుబాటులో ఉంది.
ఈ ముఖ్యమైన మైలు రాయిని చేరుకోవడం బృందం సామూహిక ప్రయత్నాలు చేసినందుకు డాక్టర్ చింతన్ కృతజ్ఞతను తెలిపారు. ప్రపంచ స్థాయి స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను నేరుగా ప్రభావితం చేసే విధానాలను రూపొందించడంలో విస్త్రత భాగస్వామ్య ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.
ప్రజలు అభిప్రాయాలు చెప్పేందుకు 27 మే, 2023 వరకు అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఎంగేజ్‌మెంట్ గ్రూప్ తమకు అందిన అభిప్రాయాలను సునిశితంగా మూల్యాంకనం చేస్తుంది. వివిధ దేశాలకు చెందిన భాగస్వాముల నుంచి అందుకున్న విలువైన సూచనలను అధికారిక విధాన ప్రకటన అంతిమ నివేదికలో పొందుపరుస్తారు.
సామాజిక అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తూ స్టార్టప్‌లు సఫలమయ్యేందుకు తోడ్పడే పర్యావరణ వ్యవస్థను సృష్టించాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉండటాన్నిజి20కి చెందిన స్టార్టప్ ఎంగేజ్‌మెంట్ గ్రూప్ కొనసాగిస్తోంది. స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ భవిష్యత్తును రూపుదిద్దడంలో ప్రపంచ భాగస్వాముల సమన్వయ ప్రయత్నాలు కీలక పాత్ర పోషిస్తాయి.
స్టార్టప్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ః
జి20 చట్రంలోని ఒక ప్రత్యేక వేదిక స్టార్టప్20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్. ఇది చర్చలను, సంభాషణలను సులభతరం చేయడం, ఆవిష్కరణలు ప్రోత్సహించడం, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో వృద్ధి పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు కలిగిన గ్రూప్, స్టార్టప్‌లకు, వ్యవస్థాపలకు, ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ నిర్మాతలకు మద్దతును ఇచ్చే విధానాలను రూపొందించి, అమలు చేసేందుకు కృషి చేస్తుంది.
సంపాదకులకు గమనికః
స్టార్టప్20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ ముందస్తు అనుమతి లేకుండా దయచేసి ఈ పత్రికా ప్రకటనను మార్పులు, సవరణలు చేయవద్దు. ఏదైనా సందేహాలు ఉంటే మీడియా అధికార ప్రతినిధిని సంప్రదించవచ్చు.
సంప్రదించవలసిన వ్యక్తి వివరాలుః
సుమైయా యూసుఫ్
ఇన్నొవేషన్ లీడ్ (మీడియా & కమ్యూనికేషన్),
అటల్ ఇన్నొవేషన్ మిషన్, నీతీ ఆయోగ్
మొబైల్ ః 9319364112
***
(Release ID: 1926535)
Visitor Counter : 214