పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం పర్యావరణ స్పృహను కలిగించాల్సిన అవసరం ఉందన్న శ్రీ భూపేందర్ యాదవ్
మిషన్ లైఫ్ కింద ప్రతి గ్రామంలో పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన శ్రీ యాదవ్
Posted On:
22 MAY 2023 5:47PM by PIB Hyderabad
అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం పర్యావరణ స్పృహను కలిగించాల్సిన అవసరం ఉందని కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మరియు కార్మిక మరియు ఉపాధి మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ అన్నారు. ముంబైలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..మనం తరచుగా పర్యావరణం నుండి ఉత్తమమైన వాటిని తీసుకుంటాము కాని వ్యర్థాలను తిరిగి ఇస్తాము, అభివృద్ధితో మన వినియోగం పెరుగుతుందని చెప్పారు.
మనం అనవసరమైన వినియోగాన్ని ప్రోత్సహిస్తే ఒక భూమి సరిపోదని శ్రీ యాదవ్ అన్నారు. రాబోయే కాలంలో అభివృద్ధితో పాటు జీవవైవిధ్య పరిరక్షణకు బాటలు వేయాల్సిన అవసరం ఉందన్నారు.
మిషన్ లైఫ్ కింద ప్రతి గ్రామంలో పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్లను ఏర్పాటు చేయాలని శ్రీ యాదవ్ ప్రతిపాదించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల కార్యదర్శి శ్రీమతి లీనా నందన్, జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ చైర్మన్ శ్రీ సి.అచలేందర్ రెడ్డి మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేకమైన జన్యు బ్యాంకు చొరవను అభినందిస్తూ శ్రీ యాదవ్ ఇలా అన్నారు. “మహారాష్ట్రలో ఉన్న పశ్చిమ కనుమలు జీవవైవిధ్యంతో సమృద్ధిగా ఉన్నాయి. మహారాష్ట్రలో ఆరు జాతీయ ఉద్యానవనాలు, నలభై ఎనిమిది వన్యప్రాణుల అభయారణ్యాలు మరియు మూడు రామ్‌సర్ సైట్‌లు ఉన్నాయి. అందువల్ల అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇంతకంటే మంచి ప్రదేశం మరొకటి ఉండదు.
ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్‌ను వివరిస్తూ ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను మిషన్ లైఫ్‌తో కలపాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రకృతి మరియు పర్యావరణం మన జీవితానికి చాలా ముఖ్యమైనవి అని పేర్కొన్న ఆయన మిషన్ లైఫ్‌తో 'మొత్తం సమాజం' విధానాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు.
మిల్లెట్స్ ప్రాముఖ్యతపై శ్రీ యాదవ్ మాట్లాడుతూ, “మిల్లెట్స్ స్థానికుల స్వరాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది భారతీయ వాతావరణానికి మరియు నేలకి సరిపోయే పంట. పోషకాహార లోపాన్ని తగ్గించడానికి కరువు నిరోధక మిల్లెట్ ముఖ్యమైనవి. జీవవైవిధ్య బోర్డు మినుములకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. ఇది కమ్యూనిటీలతో యాక్సెస్ మరియు ప్రయోజన భాగస్వామ్యాన్ని ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకుంది.
పర్యావరణ పరిరక్షణ దేశ విశ్వాసానికి సంబంధించిన అంశం అని శ్రీ యాదవ్ పునరుద్ఘాటించారు. మన ముందు తరం సహజ వనరులను కాపాడినందువల్లే మనకు సహజ వనరులు అందుబాటులో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మరియు వాటిని మన భవిష్యత్ తరాల కోసం రక్షించడం మన కర్తవ్యం. అది ఈనాటి అత్యంత ముఖ్యమైన సందేశం”.
ఈ సందర్భంగా జరిగిన సభలో పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే మాట్లాడుతూ “మనం పర్యావరణాన్ని పరిరక్షిస్తే, ప్రతిగా పర్యావరణం మనల్ని కాపాడుతుంది. పర్యావరణం నుంచి తీసుకున్నంత తిరిగి ఇవ్వకపోతే ప్రకృతిలో సమతుల్యత దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రకృతి మనుగడ సాగిస్తే మనం మనగలుగుతాము, భూమి మనుగడ సాగిస్తుంది" అని చెప్పారు.
మిల్లెట్స్ గురించి మంత్రి ప్రస్తావిస్తూ “భారతదేశం చొరవ కారణంగా ప్రపంచం మొత్తం నేడు మిల్లెట్ వైపు ఆకర్షితులవుతోంది. సామూహిక ఉద్యమం ద్వారా మనం మినుములకు డిమాండ్‌ను మరియు సరఫరాను పెంచాలి. మనం ప్రజా ఉద్యమాన్ని సృష్టించి మినుములపై అవగాహనను సామాన్యుల్లో కల్పించాలి. ఉజ్వల భవిష్యత్తు దిశగా ప్రకృతి, సంస్కృతి, సాహిత్యం అనే మంత్రాన్ని మంత్రి అందించారు.
పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి లీనా నందన్ మాట్లాడుతూ “ఈ రోజు మన జీవితాలు ఎక్కువగా జీవవైవిధ్యంపై ఆధారపడి ఉన్నాయని మనం గుర్తించే రోజు." అని పేర్కొన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ మంత్రి శ్రీ. సుధీర్ ముంగంటివార్ కూడా వీడియో సందేశం ద్వారా సభను ఉద్దేశించి ప్రసంగించారు.
పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన ‘బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ ఆఫ్ ఇండియా’ మరియు ‘అదర్ ఎఫెక్టివ్ ఏరియా బేస్డ్ మేనేజ్‌మెంట్’ అనే రెండు ప్రచురణలను ఈ సందర్భంగా ప్రముఖులు విడుదల చేశారు.
ఈ వేడుకలో ఇతర ప్రముఖుల సమక్షంలో శ్రీ భూపేందర్ యాదవ్ మిల్లెట్స్‌పై ప్రత్యేక దృష్టి సారించిన జీవవైవిధ్య ప్రదర్శనను ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో అటవీ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు, మహారాష్ట్ర జీన్ బ్యాంక్ ప్రాజెక్ట్, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు ఇతర సంస్థల పనిని ప్రదర్శించారు. మిల్లెట్ల ప్రచారంలో పాల్గొన్న వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు కూడా ప్రదర్శనలో భాగంగా ఉన్నాయి.
(Release ID: 1926523)
Visitor Counter : 187