ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏప్రిల్‌లో ఆధార్ ప్రమాణీకరణతో 1.96 బిలియన్ల లావాదేవీలు, గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే ఇది 19% అధికం


ఏప్రిల్ 2023లో 250 మిలియన్లకు పైగా ఇ-కెవైసి లావాదేవీలు జరిగాయి

Posted On: 22 MAY 2023 5:40PM by PIB Hyderabad



ఆధార్ హోల్డర్‌లు ఏప్రిల్ 2023లో 1.96 బిలియన్ ప్రామాణీకరణ లావాదేవీలను నిర్వహించారు. ఇది ఏప్రిల్ 2022 కంటే 19.3 శాతానికి పైగా పెరిగింది. భారతదేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరియు ఆధార్ వినియోగం వృద్ధిని ఇది  సూచిస్తుంది.

ఈ ప్రామాణీకరణ లావాదేవీ సంఖ్యలలో ఎక్కువ భాగం వేలిముద్రను ఉపయోగించడం ద్వారా నిర్వహించబడ్డాయి. దాని తర్వాత జనాభా మరియు ఓటీపీ ఆధారిత ప్రమాణీకరణలు ఉన్నాయి. సులభంగా సేవలను అందించడం కోసం ముఖ ప్రామాణీకరణను కూడా అధికంగా వినియోగిస్తున్న వైనం కనిపిస్తుంది.

వయోజన జనాభాలో ఆధార్ సంతృప్తత విశ్వవ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ అన్ని వయస్సుల మధ్య సంతృప్త స్థాయి ఇప్పుడు 94.8 శాతానికి పెరిగింది. ఇది నివాసితులలో ఆధార్‌ను చేరుకోవడం మరియు స్వీకరించడాన్ని సూచిస్తుంది. ఏప్రిల్ నెలలో నివాసితుల అభ్యర్థన మేరకు 15.44 మిలియన్లకు పైగా ఆధార్‌లు అప్‌డేట్ చేయబడ్డాయి.

ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఇపిఎస్) ఆదాయ పిరమిడ్‌లో దిగువన ఉన్న వారికి ఆర్థిక చేరికను కల్పిస్తోంది. ఏప్రిల్ 2023లో ఏఇపిఎస్ మరియు మైక్రో ఏటీఎంల నెట్‌వర్క్ ద్వారా 200.6 మిలియన్లకు పైగా చివరి మైలు బ్యాంకింగ్ లావాదేవీలు సాధ్యమయ్యాయి.

ఆధార్ ఇ-కెవైసీ సేవ బ్యాంకింగ్ మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలలో పారదర్శకమైన మరియు మెరుగైన కస్టమర్ అనుభవాన్ని అందించడం ద్వారా మరియు సులభంగా వ్యాపారం చేయడంలో సహాయం చేయడం ద్వారా కీలక పాత్ర పోషిస్తోంది. ఏప్రిల్‌లోనే 250.5 మిలియన్లకు పైగా ఇ-కెవైసీ లావాదేవీలు జరిగాయి.

ఏప్రిల్ 2023 చివరి నాటికి, ఆధార్ ఇ-కెవైసి లావాదేవీల  సంఖ్య 14.95 బిలియన్‌లను దాటింది. ఇ-కెవైసిని కొనసాగించడం వల్ల ఆర్థిక సంస్థలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు వంటి సంస్థల కస్టమర్ సముపార్జన ఖర్చు గణనీయంగా తగ్గుతోంది.

గుర్తింపు ధృవీకరణ కోసం ఇ-కెవైసీ అయినా, చివరి మైల్ బ్యాంకింగ్ కోసం ఏఇపిఎస్ అయినా ధృవీకరణలు లేదా ప్రత్యక్ష నిధుల బదిలీ కోసం ప్రారంభించబడిన డిబిటి అయినా భారతదేశ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు పునాది మరియు సుపరిపాలన సాధనం.నివాసితులకు జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు మద్దతు ఇవ్వడంలో ఆధార్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.

 

***


(Release ID: 1926522) Visitor Counter : 211