వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

44వ ఐఎస్ఓ కొపోల్కో ప్లీనరీ ప్రారంభించనున్న శ్రీ పీయూష్ గోయల్


వినియోగదారుల హక్కులు పరిరక్షించి సాధికారత కల్పించడం ద్వారా భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన చట్టపరమైన వ్యవస్థల రూపకల్పనపై చర్చించనున్న ప్లీనరీ

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ , ప్రజల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్న ప్లీనరీ

Posted On: 22 MAY 2023 1:30PM by PIB Hyderabad

 ప్రతిష్టాత్మకమైన వార్షిక ఐఎస్ఓ కొపోల్కో 44వ ప్లీనరీకి భారతదేశం ఆతిధ్యం ఇవ్వనున్నది. ఐఎస్ఓ కొపోల్కో 44వ ప్లీనరీ 2923 మే 23 నుంచి 26వ వరకు  న్యూ ఢిల్లీ జరుగుతుంది. ప్లీనరీని   కేంద్ర వాణిజ్యం,పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు,ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రారంభిస్తారు. కొపోల్కో అధ్యక్షురాలు సాడీ డాంటన్  Ms. Sadie Dainton, ఐఎస్ఓ ప్రధాన కార్యదర్శి  సెర్జియో ముజికా , ఐఎస్ఓ, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

 వినియోగదారుల ప్రయోజనాలను ప్రోత్సహించడానికి, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రమాణాలు రూపొందించి అమలు చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో ఐఎస్ఓ కొపోల్కో కృషి చేస్తోంది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ, నాణ్యత ప్రమాణాలు రూపొందించి అమలు చేసేందుకు ఐఎస్ఓ కొపోల్కో కమిటీని  ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) ఏర్పాటు చేసింది. ప్రమాణాలు పాటించడం ద్వారా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కమిటీ కార్యక్రమాలు అమలు చేస్తోంది. భారతదేశంలో ప్రమాణాలు అమలు జరిగేలా చూస్తున్నబ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) నిర్వహిస్తున్నకార్యక్రమంలో సంబంధిత అంశాలపై సదస్సులు  వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తారు. 

నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ప్రభుత్వ, వ్యాపార రంగాలకు చెందిన ప్రతినిధులు,  ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధి బృందాలు పాల్గొంటాయి.  ‘వినియోగదారులు ఎదుర్కొనే  సవాళ్లు, సవాళ్లు పరిష్కరించడానికి ఉత్తమ విధానాలు ’, ‘సుస్థిర భవిష్యత్తు కోసం వినియోగదారులకు సాధికారత’  ‘వినియోగదారులకు చట్టపరమైన భద్రత-’ కీలక అంశాలపై ఈ ఏడాది ఐఎస్ఓ కొపోల్కో 44వ ప్లీనరీ జరుగుతుంది.ప్లీనరీలో జరిగే చర్చలు, తీసుకునే నిర్ణయాలు భారతదేశానికి, ప్రపంచ దేశాలకు సంబంధించి ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి.

వివిధ దేశాలకు చెందిన మంత్రులు, నిపుణులు పలువురు ఉన్నత స్థాయి వక్తల వర్క్‌షాప్‌లు, ప్రసంగాలు  ప్లీనరీలో ఉంటాయి. మే 26న  ప్లీనరీ ముగుస్తుంది.  వినియోగదారులకు సంబంధించిన అనేక అంశాలపై నిపుణులు ప్రసంగిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ,  ప్రజల జీవితాలపై ఐఎస్ఓ కొపోల్కో  గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ )లో 168 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ గుర్తింపు కలిగిన ఐఎస్ఓ వివిధ వ్యాపార,సామాజిక రంగాలను ప్రభావితం చేసే ప్రపంచ ప్రమాణాలను అభివృద్ధి చేస్తుంది. ప్రమాణాల రూపకల్పన కోసం ఐఎస్ఓ నెలకొల్పిన  వినియోగదారుల కమిటీ (కొపోల్కో)  ప్రక్రియలో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి  తీసుకుంటుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా   ప్రమాణాల రూపకల్పన, ప్రమాణాలు అమలు చేయడానికి అవసరమైన ప్రణాళిక రూపొందించే అంశంలో కీలకంగా ఉండే ఐఎస్ఓ కొపోల్కో ప్లీనరీకి ఐఎస్ఓ  సభ్య దేశాల ప్రతినిధులు హాజరవుతారు. 

చాలా కాలం నుండి అంతర్జాతీయ ప్రామాణీకరణ అంశానికి ప్రాధాన్యత ఇస్తున్న భారతదేశం
 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) వ్యవస్థాపక సభ్యులలో ఒకటి.

జాతీయ స్థాయిలో ప్రమాణాల అమలు కోసం ఏర్పాటైన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంతర్జాతీయ జాతీయ స్థాయిలో ప్రమాణాల అమలు చేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.  ప్రామాణీకరణ విషయాలలో చురుకుగా పాల్గొంటుంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ)లోబ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సభ్యత్వం కలిగి ఉంది.  ఇండియన్ నేషనల్ కమిటీ (ఐఎన్సి) ద్వారా ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ (ఐఈసీ)లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్  సభ్యత్వం పొందింది.   పసిఫిక్ ఏరియా స్టాండర్డ్స్ కాంగ్రెస్ (పీఏఎస్సి), సౌత్ ఏషియన్ రీజినల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ( ఎస్ఏఆర్ఎస్ఓ) వంటి ప్రాంతీయ ప్రమాణాల సంస్థలలో సభ్యత్వం కలిగి ఉన్న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఐబిఎస్ఏ   (భారతదేశం, బ్రెజిల్ మరియు దక్షిణాఫ్రికా)వ్యవస్థలో  ఉంది.

 

*****



(Release ID: 1926342) Visitor Counter : 182