వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

బెంగళూరు లో ఈ నెల 23 నుండి 25 వరకు జరగనున్న 2వ వాణిజ్య, పెట్టుబడి వర్కింగ్ గ్రూప్ సమావేశం


2వ టీఐడబ్ల్యూజి సమావేశాన్ని ప్రారంభించనున్న శ్రీమతి అనుప్రియ పటేల్

Posted On: 19 MAY 2023 12:25PM by PIB Hyderabad

భారతదేశం జి20 ప్రెసిడెన్సీ క్రింద 2వ టీఐడబ్ల్యూజి  సమావేశం ఈ నెల 23 - 25 తేదీల్లో బెంగళూరులో నిర్వహించనున్నారు. ఈ సమావేశాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ 24న ప్రారంభిస్తారు. ఈ మూడు రోజుల సమావేశంలో, జి20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాలు, ప్రాంతీయ గ్రూపులు, అంతర్జాతీయ సంస్థల నుండి 100 మంది ప్రతినిధులు బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ సంస్కరణలపై చర్చిస్తారు.. అలాగే ప్రపంచ వాణిజ్యంలో ఎంఎస్ఎంఈలను ఏకీకృతం చేయడం, స్థితిస్థాపకమైన జీవీసీలను రూపొందించడంపై చర్చిస్తారు. 

మే 23న,  టీఐడబ్ల్యూజి మొదటి రోజు, ట్రేడ్ అండ్ టెక్నాలజీ పై సెమినార్ నిర్వహిస్తారు. ఈ రంగానికి చెందిన నిపుణులు, విద్యావేత్తలు, అభ్యాసకులను కలిగి ఉన్న రెండు ప్యానెల్ చర్చలలో పాల్గొంటారు. సాంకేతికతను మార్చే వాణిజ్యం, సమ్మిళిత వృద్ధికి సాంకేతికత .. వంటి ఇతివృత్తాలను చర్చిస్తారు. సెమినార్ తర్వాత గైడెడ్ సిటీ టూర్, సాంస్కృతిక కార్యక్రమం, జి20 ప్రతినిధుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. .

24న జరిగే సాంకేతిక సెషన్‌లో భారత ప్రెసిడెన్సీ అనుసరించే ప్రాధాన్యతలలో ఒకటైన డబ్ల్యూటిఓ సంస్కరణల అంశం చర్చిస్తారు. మరాకేష్ ఒప్పందం, దాని బహుపాక్షిక వాణిజ్య ఒప్పందాలు... డబ్ల్యూటిఓ పారదర్శక, సమ్మిళిత పని తీరుకు అద్దం పడతాయి. 

రెండవ, మూడవ రోజున, సీమాంతర వాణిజ్యానికి కీలకమైన బిల్లులు,,  మూలాధారమైన పత్రాలు, డిజిటలైజేషన్‌కు సంబంధించి, మెటా ఇన్ఫర్మేషన్ పోర్టల్‌ను రూపొందించడానికి కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేయడంపై ప్రెజెంటేషన్ లు ఉంటాయి. మార్చి 28 నుండి 30 వరకు ముంబైలో జరిగిన 1వ టిఐడబ్ల్యూజి  సమావేశంలో చర్చల నుండి ఈ ఆలోచనలు వెల్లడయ్యాయి. 

భారతదేశం జి20 ప్రెసిడెన్సీ లక్ష్యం, ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులను వేగవంతం చేయడం.. దీనిలో ఎదుర్కొంటున్న సవాళ్లపై భాగస్వామ్య అవగాహనను రూపొందించడం, వృద్ధితో పాటు పారదర్శకంగా చేయడానికి ఇప్పటికే ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవడం. ఈ విధంగా, ఒక స్థితిస్థాపక,  స్థిరమైన ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు కోసం సాధారణ పరిష్కారాలను కనుగొనే దిశగా ప్రపంచాన్ని నడిపించే గ్లోబల్ సినర్జీలను నిర్మించడానికి ఇదొక ప్రయత్నం. 

******



(Release ID: 1925822) Visitor Counter : 110