హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఢిల్లీ గుజరాతీ సమాజ్ ఏర్పాటై 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


శ్రీ శ్రీ లక్ష్మీనారాయ్ ట్రస్ట్ లోని గుజరాతీ సీనియర్ సెకండరీ పాఠశాలలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, డాక్టర్ విక్రమ్ సారాభాయ్ విగ్రహాలను ఆవిష్కరించిన శ్రీ అమిత్ షా

గుజరాతీ సమాజం దేశంలోను, ప్రపంచంలోను అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. వారు ఎప్పుడూ ఏ సమాజంతో అయినా కలిసిపోతూ వారు నివశిస్తున్న సమాజానికి సేవ కూడా చేస్తూ ఉంటారు.

ఢిల్లీలో నివశిస్తున్న గుజరాతీలను ఈ సంస్థ వారి సంస్కృతి, నాగరికతతో అనుసంధానం చేయడంతో పాటు వారు దేశం కోసం, సమాజం కోసం సేవ చేసేందుకు ఉత్తేజితం చేస్తుందని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ సంస్థ 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దానితో అనుబంధం కలిగిన అందరినీ అభినందించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కారణంగా భారతదేశం ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తం అవుతోంది.
గుజరాతీలైన గాంధీజీ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, మొరార్జీ దేశాయ్, శ్రీ నరేంద్ర మోదీ ఆధునిక భారత చరిత్రకు ఎన్నో పనులు చేశారు. వారు యావత్ దేశానికి గర్వకారణం.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హయాంలో గత 9 సంవత్సరాలుగా జరిగిన కృషి కారణంగా దేశం ఎన్నో విజయాలు సాధించింది. 2014 సంవత్సరంలో ప్రపంచంలో 11వ పెద్ద ఆర్థిక

Posted On: 18 MAY 2023 10:23PM by PIB Hyderabad

ఢిల్లీ గుజరాతీ సమాజం ఏర్పాటై 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక  కార్యక్రమంలో కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్  షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శ్రీశ్రీ లక్ష్మీనారాయణ్  ట్రస్ట్  కు చెందిన గుజరాత్  సీనియర్  సెకండరీ పాఠశాలలో సర్దార్  వల్లభ్  భాయ్  పటేల్, డాక్టర్  విక్రమ్  సారాభాయ్  విగ్రహాలను శ్రీ అమిత్  షా ఆవిష్కరించారు.

సంస్థతో అనుసంధానమైన  పలువురు ప్రజల నుంచి ఏమీ ఆశించకుండా  ఈ సంస్థ 125 సంవత్సరాలు పూర్తి చేసుకుందని శ్రీ అమిత్  షా తన ప్రసంగంలో అన్నారు. సమాజం, సంఘం పటిష్ఠతను అది ప్రతిబింబిస్తుంది. దేశంలోను,  ప్రపంచంలోను అంతా వ్యాపించి ఉన్న గుజరాతీ సమాజం ఏ  సమాజంతో అయినా మమేకమైపోతూ సేవ చేస్తూ ఉంటుంది.  ఢిల్లీలో నివశించే గుజరాతీలు వారి సంస్కృతి, నాగరికతతో అనుసంధానమై ఉండేందుకు  సహాయపడుతుంది. దేశ, సమాజ సేవ చేసేలా  గుజరాతీలను ఉత్తేజితం చేస్తూ ఉంటుంది అని పేర్కొన్నారు. 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్థతో అనుబంధం గల అందరినీ ఆయన అభినందించారు.

గుజరాతీ సమాజం దానికది ప్రత్యేక ఆమోదనీయత పొందిందని కేంద్ర హోం,  సహకార శాఖల మంత్రి అన్నారు. ఢిల్లీలో నివశిస్తున్నప్పటికీ గుజరాతీ  సమాజం గుజరాతీ స్వభావాన్ని కొనసాగించడంతో పాటు సంస్కృతి ని పరిరక్షిస్తూ సమాజాన్ని ముందుకు నడిపిస్తుందని ఆయన చెప్పారు. ఢిల్లీలో ప్రతీ ఒక్క సమాజానికి చెందిన ప్రజలు నివశిస్తారంటూ వారి వలెనే గుజరాతీ సమాజం కూడా ఎంతో హుందాగా జీవనం సాగిస్తూ ఉంటారన్నారు.  

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కారణంగా భారతదేశ  ప్రతిష్ఠ ప్రపంచం అంతటా విస్తరిస్తున్నదని శ్రీ అమిత్  షా తెలిపారు. మహాత్మాగాంధీ, సర్దార్  వల్లభ్  భాయ్, మొరార్జీ దేశాయ్, శ్రీ నరేంద్ర మోదీ ఈ నలుగురూ  ఆధునిక భారత చరిత్రకు ఎంతో సేవ అందించారని ఆయన చెప్పారు.  గాంధీజీ కృషి కారణంగా దేశానికి స్వాతంత్ర్యం లభిస్తే సర్దార్  పటేల్  కృషితో భారతదేశం ఐక్యం అయిందని, శ్రీ మొరార్జీ దేశాయ్  కృషితో ప్రజాస్వామ్య పునరుజ్జీవం జరిగిందని ఆయన చెప్పారు.  నేడు శ్రీ నరేంద్ర మోదీ కృషి కారణంగా దేశం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సాధిస్తోందన్నారు. ఈ నలుగురు గుజరాతీలు దేశానికి ఎంతో సేవ చేశారంటూ వారు దేశానికి గర్వకారణమని చెప్పారు.  

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 9 సంవత్సరాల కాలంలో దేశం ఎన్నో విజయాలు సాధించిందని కేంద్ర హోం మంత్రి అన్నారు. 2014 సంవత్సరంలో శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన సమయానికి భారతదేశం ప్రపంచంలో 11వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. నేడు గత 9 సంవత్సరాల కాలంలో ప్రపంచంలో 5వ స్థానానికి చేరింది అని చెప్పారు. ఐఎంఎఫ్  సహా పలు ఏజెన్సీలు భారతదేశం ఉజ్వల స్థితిలో ఉన్నట్టు చెబుతున్నాయని శ్రీ షా తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకున్న సర్జికల్ దాడులు, వైమానిక దాడులు వంటి నిర్ణయాత్మక చర్యల కారణంగా ఏ దేశం అయినా భారతదేశం సరిహద్దులను దాటి రాలేదనే సందేశం ప్రపంచానికి ఇచ్చిందని ఆయన చెప్పారు. 130 కోట్ల జనాభా గల సువిశాల దేశంలో కోవిడ్  వ్యాక్సినేషన్  ఎంతో సజావుగా, తేలిగ్గా పూర్తయిందన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్  ఉత్పత్తి  దేశంగాను, స్టార్టప్  ల విభాగంలో మూడో పెద్ద దేశంగాను, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో నాలుగో పెద్ద దేశంగాను మారిందని శ్రీ అమిత్  షా తెలిపారు.

ఎలాంటి దౌర్జన్యకర సంఘటనలు లేకుండా జమ్ము కశ్మీర్  లో 370 అధికరణాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రద్దు చేయగలిగారని, ఉగ్రవాదాన్ని ఏ విధంగాను సహించని విధానాన్ని అనుసరించారని ఆయన చెప్పారు. ఫలితంగా గత 9 సంవత్సరాల కాలంలో ఎలాంటి పెద్ద ఉగ్రవాద సంఘటన జరగలేదని ఆయన అన్నారు.  దేశ అంతర్గత భద్రతను, సరిహద్దుల భద్రతను పటిష్ఠం చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎంతో కృషి చేశారని శ్రీ షా తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతీ ఒక్కరికీ చెందిన వ్యక్తి, ప్రతీ ఒక్కరూ ఆయనకు చెందిన వారేనని చెబుతూ ఇది మనందరికీ గర్వకారణమని చెప్పారు. 

 

(Release ID: 1925440) Visitor Counter : 141