సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇంటర్ నేశనల్మ్యూజియమ్ ఎక్స్ పో 2023 ను ప్రారంభించిన ప్రధాన మంత్రి


నార్థ్ బ్లాక్ మరియు సౌథ్ బ్లాక్ లలో త్వరలో సిద్ధం కాబోతూఉన్న నేశనల్ మ్యూజియమ్ తాలూకు వర్చువల్ వాక్ థ్రూ ను కూడా ఆయన ప్రారంభించారు

ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ ఎక్స్ పో, గ్రాఫిక్ నోవెల్ – ఎ డే ఎట్ ది మ్యూజియమ్, డైరెక్టరీ ఆఫ్ ఇండియన్మ్యూజియమ్స్, పాకెట్ మేప్ ఆఫ్ కర్తవ్య పథ్ మరియు మ్యూజియమ్ కార్డ్ స్ ను కూడా ఆవిష్కరించారు

‘’మ్యూజియమ్ గతం నుండి ప్రేరణ ను అందించడం తో పాటు గాభవిష్యత్తు పట్ల కర్తవ్య భావన ను ప్రసాదిస్తుంది’’

‘‘దేశం లో ఒక క్రొత్త సాంస్కృతిక ప్రధానమైనటువంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరచడం జరుగుతున్నది’’

స్థానిక మరియు గ్రామీణ మ్యూజియమ్ లను ప్రతి ఒక్క రాష్ట్రంయొక్క మరియు సమాజం లోని ప్రతి ఒక్క సెగ్మెంట్ యొక్క వారసత్వాన్ని పరిరక్షించడానికిఒక ప్రత్యేక ప్రచార ఉద్యమాన్ని ప్రభుత్వం నడుపుతున్నది’’

తరాల తరబడి పరిరక్షించినటువంటి బుద్ధ భగవానుని పవిత్రఅవశేషాలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తం గా బుద్ధ భగవానుని యొక్క అనుచరుల ను ఏకంచేస్తున్నాయి’’

‘‘మన యొక్క వారసత్వం ప్రపంచపు ఏకత్వానికి అగ్రగామి వలె మారగలుగుతుంది’’

చరిత్రాత్మకమైన ప్రాముఖ్యం కలిగినటువంటి వస్తువుల నుపరిరక్షించుకోవాలన్న భ

Posted On: 18 MAY 2023 5:05PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ‘ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ ఎక్స్ పో 2023’ ను ప్రారంభించారు. నార్థ్ బ్లాకు లో మరియు సౌథ్ బ్లాకు లో త్వరలో తయారు కానున్న నేశనల్ మ్యూజియమ్ గుండా ఒక వర్చువల్ వాక్ థ్రూ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన టెక్నో మేళా, కన్జర్వేశన్ లేబ్ మరియు ఎగ్జిబిశన్ లలో ప్రధాన మంత్రి కలియదిరిగారు. ఆజాదీ కా అ మృత్ మహోత్సవ్ లో భాగం గా 47 వ ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ డే సందర్భం లో ఈ సంవత్సరపు ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ ఎక్స్ పో ను ‘మ్యూజియమ్స్, సస్టెయినబిలిటి ఎండ్ వెల్ బీయింగ్’ ఇతివృత్తం గా నిర్వహించడం జరుగుతోంది.

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ డే సందర్భం లో ప్రతి ఒక్కరి కి అభినందనల ను వ్యక్తం చేశారు. ఈ సందర్భం యొక్క ప్రాధాన్యాన్ని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, భారతదేశం స్వాతంత్ర్యం యొక్క అమృత్ మహోత్సవాన్ని సంబురం గా జరుపుకొంటూ ఉండగా, ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ ఎక్స్ పో కార్యక్రమం వల్ల సాంకేతిక విజ్ఞానం కలబోత తో చరిత్ర లోని వేరు వేరు అధ్యాయాలు ప్రాణం పోసుకొంటున్నాయి అని అభివర్ణించారు. మనం ఒక మ్యూజియమ్ లోకి అడుగు పెట్టినప్పుడు మనం గత కాలం తో అనుబంధాన్ని ఏర్పరచుకొంటామని, మరి మ్యూజియమ్ తథ్యాన్ని, ఇంకా రుజువు తో ముడిపడ్డ వాస్తవాన్ని కళ్లకు కడుతుంది; అంతేకాదు, భవిష్యత్తు పట్ల ఒక కర్తవ్య భావన ను రేకెత్తిస్తుంది అని ఆయన అన్నారు. ఈ నాటి ‘సస్టెయినబిలిటి ఎండ్ వెల్ బీయింగ్’ అనే ఇతివృత్తం నేటి కాల పు ప్రపంచం యొక్క ప్రాథమ్యాల ను ప్రముఖం గా చాటుతుందని మరియు ఈ కార్యక్రమాన్ని మరింత ప్రాసంగికం గా మలుస్తోందని ఆయన అన్నారు. నేటి ప్రయాస లు యువ తరాని కి వారి యొక్క వారసత్వం గురించి చక్కటి పరిచయాన్ని ఇవ్వగలుగుతాయన్న ఆశ ను ప్రధాన మంత్రి వెలిబుచ్చారు.

 

ఈ రోజు న నిర్వహిస్తున్న కార్యక్రమాని కంటే ముందు తాను మ్యూజియమ్ ను సందర్శించిన సంగతి ని కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. సందర్శకుల మనసు ను పెద్ద ఎత్తున ప్రభావితం చేయగలిగే రీతి లో ప్రణాళిక పరమైనటువంటి మరియు ఆచరణ పరమైనటువంటి ప్రయాస లు సాగాయి అంటూ ఆయన ప్రశంస ను వ్యక్తం చేశారు. ఈ రోజు న జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం భారతదేశం లో మ్యూజియమ్ ల జగతి లో ఒక పెద్ద మేలు మలుపు అవుతుంది అన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

 

వందల సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉన్నటువంటి ఈ దేశం యొక్క వారసత్వం లో చాలా భాగం బానిసత్వం కాలం లో ధ్వంసం అయిపోయింది, అప్పట్లో పురాతనమైనటువంటి చేతిరాత పుస్తకాల ను మరియు పుస్తకాలయాల ను తగులబెట్టడం జరిగింది అని ప్రధాన మంత్రి చెప్తూ, ఇది భారతదేశానికొక్కదానికే కాక యావత్తు ప్రపంచానికి వాటిల్లిన నష్టం అని స్పష్టంచేశారు. ఏనాడో కోల్పోయిన ఈ గడ్డ యొక్క వారసత్వాన్ని పునరుద్ధరించే మరియు పరిరక్షించే దిశ లో స్వాతంత్ర్యం అనంతరం ఎటువంటి ప్రయత్నాలు జరగకపోవడం విచారకరం అని ఆయన అంటూ, పౌరుల లో అవగాహన లోపం మరింత తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిందన్నారు. ఆజాదీ కా అమృత్ కాల్ లో దేశం ‘పాంచ్ ప్రణ్’ లేదా ఐదు సంకల్పాల ను తీసుకోవడాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, మన వారసత్వాన్ని చూసుకొని మనం గర్వపడాలి అన్నారు. దేశం తాలూక ఒక నవీనమైన సాంస్కృతిక వారసత్వాన్ని దిద్ది తీర్చడం జరుగుతోందని ఆయన నొక్కిపలికారు. ఈ ప్రయాసల లో, స్వాతంత్ర్యం కోసం భారతదేశం సలిపిన పోరాటం తో పాటు గా దేశం యొక్క వేల సంవత్సరాల నాటి ప్రాచీన వారసత్వాన్ని కూడా ఏ వ్యక్తి అయినా గమనించవచ్చును అని ఆయన అన్నారు. ప్రతి రాష్ట్రం యొక్కయు మరియు సమాజం లోని ప్రతి సెగ్మెంట్ యొక్కయు వారసత్వం తో పాటు స్థానిక మ్యూజియమ్ లను , గ్రామ ప్రాంతాల మ్యూజియమ్ లను పరిరక్షించడం కోసం ఒక ప్రత్యేక ప్రచార ఉద్యమాన్ని ప్రభుత్వం నడుపుతోందని ఆయన తెలియ జేశారు. భారతదేశం లో ఆదివాసి సముదాయాలు స్వాతంత్ర్య సమరానికి అందజేసినటువంటి తోడ్పాటుల కు శాశ్వతత్వాన్ని సంతరింపచేసేందుకు పది ప్రత్యేకమైన మ్యూజియమ్ లను అభివృద్ధి పరచే పని జరుగుతోంది, ఈ కార్యం ఆదివాసి భిన్నత్వం తాలూకు దృష్టి కోణాన్ని అందించడానికి ప్రపంచం లోని అత్యంత విశిష్టం అయినటువంటి కార్యక్రమాల లో ఒకటి గా ఉండగలదు అని ఆయన వివరించారు. భారత భూమి యొక్క వారసత్వాన్ని కాపాడేందుకు సంబంధించిన ఉదాహరణల ను ప్రధాన మంత్రి చెప్తూ, దాండి పథ్ ను గురించి ప్రస్తావించారు. ఆ మార్గం గుండా మహాత్మ గాంధీ తన ఉప్పు సత్యాగ్రహం సమయం లో పాదయాత్ర ను చేపట్టారు మరి ఆయన ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించిన ప్రదేశం లో స్మారకచిహ్నాన్ని నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. డాక్టర్ శ్రీ బి.ఆర్. ఆమ్బేడ్ కర్ యొక్క మహాపరినిర్వాణ స్థలం అయినటువంటి దిల్లీ లోని 5, అలీపూర్ రోడ్ లో ఆ ప్రదేశాన్ని ఒక జాతీయ స్మారకం గా పునరభివృద్ధి పరచడాన్ని గురించి కూడా ఆయన ప్రస్తావించారు. దీనితో పాటు గా, శ్రీ ఆమ్బేడ్ కర్ జీవనం తో సంబంధం కలిగివున్నటువంటి పాంచ్ తీర్థ్ ను అభివృద్ధి పరచడం జరిగిందన్నారు. వాటి లో శ్రీ ఆమ్బేడ్ కర్ పుట్టిన మవూ, ఆయన జీవించినటువంటి లండన్, ఆయన జీవన యాత్ర లో తొలి అడుగుల ను వేసినటువంటి నాగ్ పుర్, ఇంకా ఆయన సమాధి ఈనాటికీ నెలకొన్నటువంటి ముంబయి లోని చైత్య భూమి లు ఉన్నట్టు వివరించారు. సర్ దార్ పటేల్ గారి ఏకతా విగ్రహం వద్ద గల ఒక మ్యూజియమ్, పంజాబ్ లోని జలియాఁవాలా బాగ్, గుజరాత్ లోని గోవింద్ గురు జీ యొక్క స్మారకం, వారాణసీ లోని మన్మహల్ మ్యూజియమ్ మరియు గోవా లో ఉన్న మ్యూజియమ్ ఆఫ్ క్రిస్టియన్ ఆర్ట్ ల తాలూకు ఉదాహరణల ను కూడా ఆయన పేర్కొన్నారు. దేశ పూర్వ ప్రధానుల జీవన ప్రస్థానం మరియు సేవల కు అంకితం చేసినటువంటి దిల్లీ లోని ప్రధాన్ మంత్రి సంగ్రహాలయ్ ను కూడా ఆయన జ్ఞ‌ప్తి కి తీసుకు వచ్చి ఆ మ్యూజియమ్ ను ఒక సారి చూడాలంటూ అతిథుల కు విజ్ఞ‌ప్తి చేశారు.

 

   ఏ దేశమైనా స్వీయ వారసత్వ పరిరక్షణకు నడుంబిగిస్తే ప్రపంచంలోని ఇతర దేశాలతోనూ సాన్నిహిత్యం ఏర్పడుతుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ మేరకు బుద్ధ భగవానుని పవిత్ర చారిత్రక అవశేషాలను తరతరాలుగా భద్రపరచడాన్ని, వాటిద్వారా ప్రపంచవ్యాప్తంగా గల ఆయన అనుయాయులు ఏకం కావడాన్ని ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు. ఈ నేపథ్యంలో గత బుద్ధ పూర్ణిమనాడు మంగోలియాకు నాలుగు పవిత్ర బౌద్ధ అవశేషాలను పంపగా, శ్రీలంక నుంచి ఖుషీనగర్‌కు పవిత్ర అవశేషాలు రావడాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా గోవాలోని సెయింట్ కేతేవన్ వారసత్వం భారతదేశంలో సురక్షితంగా ఉందని, దీనికి సంబంధించిన పురాతన అవశేషాలను జార్జియాకు పంపినప్పుడు ఆ దేశంలో పెల్లుబికిన ఆనందోత్సాహాలను గుర్తుచేశారు. ఈ తరహాలోనే “మన వారసత్వం ప్రపంచ ఏకీకరణకు నాంది పలుకుతుంది” అని ప్రధాని ప్రకటించారు.

   విష్యత్తరాల కోసం వనరుల పరిరక్షణలో ప్రదర్శనశాలలు చురుగ్గా పాలుపంచుకోవాలని ప్రధాని సూచించారు. భూగోళం ఎదుర్కొన్న అనేక విపత్తుల సంకేతాలను ఇవి పరిరక్షించి, ప్రదర్శించగలవని, అదే సమయంలో మారుతున్న భూగోళ స్వరూపాన్ని కూడా  ప్రస్ఫుటం చేయగలవని ఆయన వివరించారు. ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పాకశాస్త్ర విభాగం గురించి మాట్లాడుతూ- భారతదేశం కృషితో ఆయుర్వేదం, శ్రీ అన్న చిరుధాన్యాల ప్రాచుర్యం ఇనుమడించడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో శ్రీ అన్న సహా ఇతర ఆహారధాన్యాల చరిత్రను తెలిపే ప్రదర్శనశాలల ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

   చారిత్రక ప్రాధాన్యమున్న అంశాల పరిరక్షణ దేశానికి ఒక అలవాటుగా మారితే ఇవన్నీ సాధ్యమేనని ప్రధానమంత్రి అన్నారు. ఇదెలా సాధ్యం కాగలదో విశదీకరిస్తూ- దేశవ్యాప్తంగా ప్రతి కుటుంబం తమ కుటుంబ ప్రదర్శనశాల వంటి ఏర్పాటుతో తమ చరిత్రను భద్రపరచుకోవాలని సూచించారు. నేటి సర్వసాధారణ అంశాలే రేపటి తరానికి భావోద్వేగ సంపద కాగలవని పేర్కొన్నారు. అదేవిధంగా పాఠశాలలు, ఇతర సంస్థలు తమ సొంత ప్రదర్శనశాలలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఇదే బాటలో నగరాలు నగర ప్రదర్శనశాలలను రూపొందించుకోవాలని సలహా ఇచ్చారు. ఇవన్నీ కలగలిస్తే రాబోయే తరాలకు భారీ చారిత్రక సంపద సమకూరుతుందని స్పష్టం చేశారు. ప్రదర్శనశాలలు యువతకు ఉపాధి అవకాశాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. అయితే, ఈ యువతరాన్ని మనం మ్యూజియం కార్మికులుగా కాకుండా ప్రపంచ సాంస్కృతిక కార్యాచరణకు మాధ్యమంగా మారగల చరిత్ర, వాస్తుశిల్పం వంటి అంశాలతో ముడిపడినదిగా పరిగణించాలని ఆయన సూచించారు. దేశ వారసత్వాన్ని విదేశాలకు చేరువ చేయడంలో, వారి గతానుభవాలను స్వీకరించడంలో ఈ యువతరం అత్యంత ప్రభావవంతమైనది కాగలదని ఆయన అన్నారు.

   ళాఖండాల దొంగరవాణా, అపహరణకు గురైనవాటి స్వాధీనం వంటి సమష్టి సవాళ్లను ప్రధానమంత్రి ప్రస్తావించారు. భారతదేశం వంటి ప్రాచీన సంస్కృతులుగల పలు దేశాలు వందల ఏళ్లుగా ఈ సమస్యతో పోరాడుతున్నాయన్నారు. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత దేశంలోని అనేక కళాఖండాలు అనైతికంగా సరిహద్దులు దాటించబడ్డాయని, ఇలాంటి నేరాల నిరోధానికి మనమంతా కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో భారత ప్రతిష్ట ఇనుమడిస్తున్న నేపథ్యంలో వివిధ దేశాలు తమవద్దగల భారత వారసత్వ చిహ్నాలైన కళాఖండాలను, ఇతర వస్తువులను వాపసు చేయడంపై ఆయన హర్షం వెలిబుచ్చారు. ఈ విధంగా అపహరణకు గురైన అనేక కళాఖండాలు తిరిగి మన దేశానికి చేరాయంటూ ప్రధాని కొన్ని ఉదాహరణలిచ్చారు. ఈ మేరకు బనారస్‌లోని అన్నపూర్ణ మాత, గుజరాత్‌లోని మహిషాసుర మర్దిని ప్రతిమలు, చోళుల కాలంనాటి నటరాజ విగ్రహాలు, గురు హరగోవింద్‌ సింగ్‌ పేరిటగల కరవాలం వంటివి మాతృభూమికి చేరాయని వివరించారు.

   మొత్తంమీద గడచిన తొమ్మిదేళ్లలో విదేశాల నుంచి 240దాకా కళాఖండాలను వెనక్కు తెచ్చామని ప్రధాని వెల్లడించారు. అయితే, స్వాతంత్రం వచ్చిన తర్వాత పలు దశాబ్దాల వ్యవధిలో తిరిగి తెచ్చిన కళాఖండాలు 20 మాత్రమేనని ఆయన గుర్తుచేశారు. ఇక దేశం నుంచి కళాఖండాల దొంగరవాణా కూడా ఈ 9 సంవత్సరాల్లో గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు ప్రధాని చెప్పారు. దీనికి సంబంధించి వివిధ దేశాల మధ్య సహకారం మరింత పెంచుకోవాల్సి ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగాగల కళాభిమానులు... ముఖ్యంగా ప్రదర్శనశాలలతో అనుబంధంగల వారు ఈ దిశగా కృషి చేయాలని శ్రీ మోదీ కోరారు. “ఏ దేశంలోని మ్యూజియంలోనైనా అనైతికంగా చేరిన విదేశీ కళాఖండాలు ఉండకూడదు. ప్రదర్శనశాలలన్నీ ఈ నైతిక నిబద్ధతను సంప్రదాయంగా మార్చుకోవాలి” అని ప్రధాని సూచించారు. “మనం మన వారసత్వాన్ని పరిరక్షించుకుందాం... అదే సమయంలో కొత్త వారసత్వాన్ని కూడా సృష్టిద్దాం” అని ప్రధాని తన ప్రసంగం ముగించారు.

   కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, సహాయ మంత్రులు శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్, శ్రీమతి మీనాక్షి లేఖితోపాటు లౌవ్రే అబుధాబి డైరెక్టర్ శ్రీ మాన్యుల్ రబాటే తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

   స్వాతంత్ర్య అమృత మహోత్సవాల్లో భాగంగా ఇవాళ 47వ అంతర్జాతీయ ప్రదర్శనశాలల దినోత్సవం (ఐఎండి) నేపథ్యంలో “ప్రదర్శనశాలలు- సుస్థిరత.. శ్రేయస్సు” ఇతివృత్తంగా  అంతర్జాతీయ మ్యూజియంల ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనశాలలపై సంబంధిత నిపుణుల మధ్య సమగ్ర సంప్రదింపులకు వీలుగా ఇది రూపొందించబడింది. భారత సాంస్కృతిక దౌత్యంలో కీలక పాత్ర పోషించే సాంస్కృతిక కేంద్రాలుగా ప్రదర్శనశాలలు అభివృద్ధి చెందడానికి ఈ కార్యక్రమం వీలు కల్పిస్తుంది. ఈ సందర్భంగా త్వరలో ఏర్పాటు కాబోయే జాతీయ మ్యూజియం సంబంధిత వర్చువల్‌ నడకదారి ప్రదర్శనను ప్రధాని కార్యాలయం సహా ఇతర మంత్రిత్వ శాఖల కార్యాలయాలు పనిచేసే ఉత్తర-దక్షిణ భవన సముదాయాల మధ్య ప్రధాని ప్రారంభించారు. భారత వర్తమాన రూపకల్పనలలో తమవంతు పాత్ర పోషించిన గతకాలపు చారిత్రక సంఘటనలు, వ్యక్తిత్వాలు, ఆలోచనలు, విజయాలను ప్రముఖంగా చూపడానికి, ప్రదర్శించడానికి చేస్తున్న సమగ్ర ప్రయత్నాల్లో భాగంగానే ఈ జాతీయ మ్యూజియం సిద్ధమవుతోంది.

    అంతర్జాతీయ మ్యూజియం ప్రదర్శన చిహ్నమైన గ్రాఫిక్‌ చిత్ర సంగ్రహం “ఎ డే ఎట్‌ ది మ్యూజియం”తోపాటు ‘ది డైరెక్టరీ ఆఫ్‌ మ్యూజియమ్స్‌, ది పాకెట్‌ మ్యాప్‌ ఆఫ్‌ కర్తవ్య పథ్‌, మ్యూజియం కార్డు’లను ప్రధానమంత్రి ఆవిష్కరించారు. ఈ గ్రాఫిక్‌ చిత్ర సంగ్రహం ‘డ్యాన్సింగ్‌ గాళ్‌’ రూపాన్నీ సమకాలీకరిస్తూ చెన్నై కళాశైలిలో కొయ్యతో రూపొందించబడింది. ఇది జాతీయ మ్యూజియాన్ని సందర్శించే బాలల బృందం గురించి వివరిస్తుంది. ఇక్కడ వారు మ్యూజియంల ద్వారా లభించే వివిధ భవిష్యత్‌ అవకాశాల గురించి తెలుసుకుంటారు. ఇక ‘డైరెక్టరీ ఆఫ్ ఇండియన్‌ మ్యూజియమ్స్’ అనేది భారతీయ ప్రదర్శనశాలల సమగ్ర అధ్యయనం. అలాగే కర్తవ్య పథం పాకెట్ మ్యాప్ వివిధ సాంస్కృతిక ప్రదేశాలు, సంస్థలను ప్రముఖంగా చూపుతుంది. అంతేకాకుండా చారిత్రక మార్గాల చరిత్ర జాడలను కూడా వివరిస్తుంది. అలాగే 75 మ్యూజియం కార్డులు దేశంలోని చారిత్రక ప్రదర్శనశాలల ముఖద్వారాల చిత్రాలతో రూపొందించబడ్డాయి. ఇవి అన్ని వయసుల వారికీ ప్రదర్శనశాలలను పరిచయంచేసేలా వినూత్న రీతిలో తయారయ్యాయి. ప్రతి కార్డులోనూ ఆయా ప్రదర్శనశాలల సంక్షిప్త సమాచారం ఉంటుంది. వివిధ దేశాల్లోని సాంస్కృతిక కేంద్రాలు, ప్రదర్శనశాలల నుంచి ప్రతినిధులు పెద్దసంఖ్యలో ఈ అంతర్జాతీయ మ్యూజియం ప్రదర్శనకు హాజరు కావడం విశేషం.

***


(Release ID: 1925328) Visitor Counter : 236