రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

దేశంలో మొట్టమొదటి ఎలివేటెడ్ 8-లేన్ యాక్సెస్ కంట్రోల్ ఎక్స్‌ప్రెస్ వే పనులు వచ్చే ఏప్రిల్‌ నాటికి పూర్తి


- సుమారు రూ. 9000 కోట్ల వ్యయంతో 29.6 కి.మీ పొడవుతో తో ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే పనులు

Posted On: 18 MAY 2023 3:00PM by PIB Hyderabad

రూ. 9000 కోట్ల వ్యయంతో తో 29.6 కి.మీ పొడవుతో నిర్మిస్తున్న దేశంలోనే మొట్టమొదటి ఎలివేటెడ్ 8-లేన్ యాక్సెస్ కంట్రోల్ ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే 2024 ఏప్రిల్‌ నాటికి దాదాపుగా పూర్తవుతుందని శ్రీ నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. హర్యానాలో 18.9 కి.మీ రహదారిని సింగిల్ పిల్లర్‌పై, ఢిల్లీలో 10.1 కి.మీ పొడవు రహదారిని 34 మీటర్ల వెడల్పుతో ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తున్నట్లు ఆయన వివరించారు.  కేంద్ర మంత్రి శ్రీ గడ్కరీ ఈ రోజు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా, కేంద్ర సహాయ మంత్రి శ్రీ జనరల్ వి. సింగ్, కేంద్ర సహాయ మంత్రి శ్రీ రావు ఇంద్రజిత్ సింగ్, ఎంపీ శ్రీ ప్రవేశ్ సింగ్ వర్మ మరియు ఎంపీ శ్రీ రమేష్ బిధూరితొ కలిసి ఈ రోజు ఎక్స్‌ప్రెస్‌వే పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా శ్రీ గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ ఈ ఎక్స్‌ప్రెస్‌వే యొక్క రోడ్ నెట్‌వర్క్ నాలుగు స్థాయిలలో ఉందని వివరించారు. టన్నెల్‌, అండర్‌పాస్‌, గ్రేడ్‌ రోడ్డు, ఎలివేటెడ్‌ రోడ్డు, ఫ్లైఓవర్‌ మీదుగా ఫ్లైఓవర్‌ రూపాలలో వీటిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఎక్స్ ప్రెస్ వేకు ఇరువైపులా 3 లైన్ల సర్వీస్ రోడ్డును నిర్మిస్తున్నారు. ఢిల్లీలోని ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై దేశంలోనే అత్యంత విశాలమైన 8 లేన్‌ల సొరంగం 3.6 కి.మీ పొడవుతో నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇది ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి హర్యానా మరియు పశ్చిమ ఢిల్లీ ప్రజల కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని వివరించారు.  శ్రీ గడ్కరీ హర్యానాలో, ఈ ఎక్స్‌ప్రెస్‌వే హర్సారు సమీపంలోని పటౌడీ రోడ్ (ఎస్.హెచ్-26) మరియు బసాయి సమీపంలోని ఫరూఖ్‌నగర్ (ఎస్.హెచ్-15ఏ) లను కలుస్తుంది, ఇది కాకుండా, ఇది గుర్గావ్ సెక్టార్-88 (బీ) సమీపంలో ఢిల్లీ-రేవారీ రైలు మార్గాన్ని కూడా దాటుతుంది. ) మరియు భర్తాల్ వద్ద యుఈఆర్-II వద్ద కలుపుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే గుర్గావ్‌లోని సెక్టార్-21ని సెక్టార్-88, 83, 84, 99, 113 మరియు ద్వారకను గ్లోబల్ సిటీకి కలుపుతుందని ఆయన చెప్పారు. ఈ మొత్తం ఎక్స్‌ప్రెస్‌వేలో ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఐటీఎస్) సౌకర్యం ఉంటుందని ఆయన తెలిపారు.

****



(Release ID: 1925320) Visitor Counter : 108