గనుల మంత్రిత్వ శాఖ
మార్చి 2023లో 6.8 శాతం పెరిగిన ఖనిజ ఉత్పత్తి
Posted On:
18 MAY 2023 4:23PM by PIB Hyderabad
మార్చి, 2023 (ఆధారం: 2011-12=100) నెలలో మైనింగ్ మరియు క్వారీ రంగం యొక్క ఖనిజ ఉత్పత్తి సూచిక 154.2 వద్ద నిలిచింది. మార్చి, 2022 నెల స్థాయితో పోలిస్తే ఇది 6.8 శాతం ఎక్కువ. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం) వెలువరించిన తాత్కాలిక డేటా ప్రకారం 2022-23 సంవత్సరం ఏప్రిల్-మార్చి కాలానికి సంచిత వృద్ధి గత సంవత్సరం సంబంధిత కాలంలో 5.8 శాతంగా నిలిచింది. మార్చి, 2023లో ముఖ్యమైన ఖనిజాల ఉత్పత్తి స్థాయి ఈ విధంగా ఉంది: బొగ్గు 1078 లక్షల టన్నులు, లిగ్నైట్ 46 లక్షల టన్నులు, సహజ వాయువు (ఉపయోగించినది) 2890 మిలియన్ క్యూ. మీటర్, పెట్రోలియం (ముడి) 25 లక్షల టన్నులు, బాక్సైట్ 2115 వేల టన్నులు, క్రోమైట్ 555 వేల టన్నులు, రాగి కాన్సన్ట్రేట్ 12 వేల టన్నులు, బంగారం 161 కిలోలు, ముడి ఇనుము 281 లక్షల టన్నులు, సీసం 42 వేట టన్నులు, ముడి మాంగనీస్ 311 వేల టన్నులు, జింక్ కాన్సన్ట్రేట్ 181 వేల టన్నులు, సున్నపు రాయి 402 లక్షల టన్నులు,
ఫాస్ఫోరైట్ 220 వేల టన్నులు, మాగ్నసైట్ 11 వేల టన్నులు, డైమండ్ 3 క్యారెట్లు.
అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మార్చి, 2023 సానుకూల వృద్ధి చూపిన ముఖ్యమైన ఖనిజాలు: రాగి (41.9%), క్రోమైట్ (34%), ఫాస్ఫోరైట్ (32.8%), మాంగనీస్ ధాతువు (13.6%), బొగ్గు (12.5%), సున్నపురాయి (7.6) %), సీసం (6.3%), ఇనుప ఖనిజం (4.7%), బాక్సైట్ (3.6%), మరియు సహజ వాయువు (యు) (2.7%).
******
(Release ID: 1925319)
Visitor Counter : 157