సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
మే 18న గ్లోబల్ యాక్సెసిబిలిటీ అవేర్‌నెస్ డేని (జీఏఏడీ) నిర్వహించనున్న దివ్యాంగుల సాధికారికత శాఖ
- జీఏఏడీ అనేది వైకల్యాలున్న వ్యక్తులు సమాజంలో స్వతంత్ర మరియు ఉత్పాదక సభ్యులుగా పాల్గొనడానికి ఒక ప్రగతిశీల చర్య
Posted On:
17 MAY 2023 6:03PM by PIB Hyderabad
వికలాంగుల సాధికారత విభాగం (డీఈపీడబ్ల్యుడీ) 2023 మే 18వ తేదీన గ్లోబల్ యాక్సెసిబిలిటీ అవేర్‌నెస్ డే (జీఏఏడీ)ని నిర్వహించనుంది, దివ్యాంగుల ఎదుగుదల మరియు అభివృద్ధికి సమాన అవకాశాలు కల్పించే సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో పాటు వారికి ఉత్పాదక, సురక్షితమైన మరియు గౌరవప్రదమైన జీవితాలను గడపేలా చర్యలు చేపట్టాలనే దృష్టికోణంతో దీనిని నిర్వహిస్తున్నారు. భారత ప్రభుత్వంలోని సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ కింద డీఈపీడబ్ల్యుడీ విభాగం దేశంలోని వికలాంగుల అభివృద్ధి అజెండాను పర్యవేక్షించే నోడల్ కేంద్రం. దివ్యాంగుల 'సమ్మిళితత'ను కేంద్ర ఆదేశంగా ఉంచుతూ, డీఈపీడబ్ల్యుడీతో అనుబంధించబడిన 65 ఇన్‌స్టిట్యూట్‌లు/ సంస్థలతో డిపార్ట్‌మెంట్ భారతదేశం అంతటా 80 కంటే ఎక్కువ ప్రదేశాలలో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం జీఏఏడీని మే 3వ గురువారం నాడు జరుపుకుంటారు. జీఏఏడీ ముఖ్య ఉద్దేశ్యం ప్రతి దివ్యాంగులు ఒక్కరూ డిజిటల్-వెబ్, సాఫ్ట్‌వేర్, మొబైల్ మొదలైన వాటి గురించి మాట్లాడటం, ఆలోచించడం మరియు నేర్చుకోవడం. దివ్యాంగులకు వాటిపై అవగాహన కల్పిస్తూ వివిధ సాధికారికత పథకాలలో వారిని భాగస్వామ్యం చేయడం. జీఏఏడీ యొక్క ఉద్దేశ్యంతో సమలేఖనం చేయడం మరియు సాంకేతికతను వికలాంగులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, మొబైల్/ పీసీ అలాగే బ్యాంకింగ్ సిస్టమ్స్, యూనివర్సల్ డిజైన్, అసిసిటివ్ వంటి అంశాలు సాంకేతికతలు, మరియు వైకల్యం ప్రాతినిధ్యాలపై సెమినార్‌లు/ వెబినార్‌లను కూడా నిర్వహిస్తారు. సహాయాలు మరియు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) కిట్‌లను పంపిణీ చేయడానికి, కొత్త సహాయాలు & సహాయక పరికరాలను ప్రారంభించేందుకు మరియు ఇతర అవగాహన కల్పన కార్యక్రమాలలో అందుబాటులో ఉండే షార్ట్ ఫిల్మ్‌లను ప్రదర్శించడానికి శిబిరాలు నిర్వహించబడతాయి. అన్ని ఈవెంట్‌లలో టెక్నాలజీ యాక్సెసిబిలిటీ రంగానికి చెందిన నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమల నాయకులు, విధాన నిర్ణేతలు తదితరులు పాల్గొంటారు. అంతేకాకుండా, వేలాది మంది వికలాంగులు, డిజిటల్ యాక్సెసిబిలిటీ డొమైన్‌లో చాలా మంది నిపుణులు తమ సవాళ్లు మరియు అనుభవాలను పంచుకోవడానికి కూడా పాల్గొంటారు. డిపార్ట్‌మెంట్ నిర్వహిస్తున్న జీఏఏడీ యొక్క వేడుక మరియు అవగాహన కల్పన అనేది జాతీయ స్థాయి వేడుక, ఇది భారతదేశంలోని అనేక ప్రదేశాలలో ఒకే రోజున సంబంధిత వాటాదారులందరినీ ఒకచోట చేర్చి విజ్ఞానం, అనుభవాలు, వీక్షణలు మరియు ఆలోచనలను పంచుకోవడానికి మరియు తాజా పరిణామాలు మరియు పోకడలను చర్చించడానికి వేదికగా నిలుస్తుంది. ఈ వేడుక పీడబ్ల్యుడీల అవసరాలకు అనుగుణంగా పరస్పర విశ్వాసం మరియు సంస్థల పరస్పర చర్యను మరింత బలోపేతం చేస్తుంది ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడానికి కూడా వీలు కల్పిస్తుంది. మార్చి 2023లో డీఈపీడబ్ల్యుడీ నిర్వహించిన 3-రోజుల వెబ్-యాక్సెసిబిలిటీ వర్క్‌షాప్‌కు కొనసాగింపుగా డిజిటల్ యాక్సెసిబిలిటీని బలోపేతం చేయడంలో ఈ కసరత్తు మరో మైలురాయిగా నిలుస్తుంది. వైకల్యం ఉన్న ప్రతి వ్యక్తి వెబ్‌లో మొదటి-స్థాయి డిజిటల్ అనుభవానికి అర్హుడనే దృఢ నమ్మకంతో, జీఏఏడీ వేడుక అనేది వికలాంగులు సమాజంలో స్వతంత్ర మరియు ఉత్పాదక సభ్యులుగా పాల్గొనేలా చేయడం ఈపీడబ్ల్యుడీ యొక్క ప్రగతిశీల దశ.
******
(Release ID: 1925110)
Visitor Counter : 160