సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
వికలాంగులకు విద్యలో సాధికారత కల్పించేందుకు ఏర్పాటైన జాతీయ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి
అంగ వైకల్యం కలిగిన వ్యక్తులకు సమగ్ర విద్య, నైపుణ్యాభివృద్ధి అందించడానికి వర్క్‌షాప్ నిర్వహించిన రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
Posted On:
16 MAY 2023 6:24PM by PIB Hyderabad
"జాతీయ విద్యా విధానం: 2020 నేపథ్యంలో వికలాంగుల రంగంలో శిక్షణ సంస్థలు, హెచ్‌ఆర్‌డి సామర్థ్యం పెంపుదల" అనే అంశంపై జబల్పూర్ లో 2023 మే 16న ఏర్పాటైన జాతీయ వర్క్‌షాప్‌ను కేంద్ర మంత్రి శ్రీ వీరేంద్ర కుమార్ ప్రారంభించారు.జాతీయ విద్యా విధానం 2020 లో పొందుపరిచిన విధంగా అంగ వైకల్యం కలిగిన వ్యక్తులకు సమగ్ర విద్య, నైపుణ్యాభివృద్ధి అందించడం లక్ష్యంగా రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వర్క్‌షాప్ నిర్వహించింది.

వికలాంగులకు ఆత్మగౌరవం, సాధికారత, గౌరవం అందించడం అత్యంత అవసరమని వర్క్‌షాప్‌ను ప్రారంభ సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ స్పష్టం చేశారు. వికలాంగులకు ఆత్మగౌరవం, సాధికారత, గౌరవం అందించే అంశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విజన్ 2030 ప్రణాళిక లక్ష్యాలు సాధించడానికి ఉపాధి అవకాశాలు అందించే విధంగా ప్రత్యేక విద్యా కార్యక్రమాలు అమలు జరగాలని మంత్రి పేర్కొన్నారు.
11 రాష్ట్రాలకు చెందిన 300 మందికి పైగా ప్రతినిధులు వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. విధాన రూపకర్తలు, ప్రత్యేక విద్యావేత్తలు, పునరావాస నిపుణులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నపార్లమెంట్ సభ్యుడు శ్రీ రాకేష్ సింగ్ అంగవైకల్యం కలిగిన వ్యక్తులకు ఉపాధి కల్పించేందుకు జబల్పూర్ జిల్లాలో అమలు జరుగుతున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల వివరాలు తెలిపారు.

వికలాంగుల సాధికారత విభాగం కార్యదర్శి, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ శ్రీ రాజేష్ అగర్వాల్ అనుభవపూర్వక అభ్యాసం, సాంకేతికత ద్వారా నైపుణ్యాభివృద్ధి, సమగ్ర విద్య ప్రాముఖ్యతను వివరించారు. వినికిడి లోపం, అంధత్వం ఉన్న పిల్లల అవసరాలు దృష్టిలో ఉంచుకుని సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పుస్తకాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ సంకేత భాష,, ఆడియో వివరణ వంటి అంశాల ఆధారంగా పుస్తకాలు సిద్ధం చేయాలన్నారు.

పార్లమెంట్ చేసిన చట్టం కింద రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టబద్ధమైన సంస్థగా ఏర్పాటయింది. ప్రత్యేక విద్య, వైకల్యం రంగంలో పరిశోధనలు ప్రోత్సహించడం, శిక్షణా కార్యక్రమాల ప్రమాణాలు సిద్ధం చేయడం, నియంత్రణ, పర్యవేక్షణ లక్ష్యంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నరిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేంద్ర పునరావాస రిజిస్టర్ (CRR)ని నిర్వహిస్తోంది. సరళీకృత విద్యను అందించడం, అనుభవపూర్వక అభ్యాసం, ఆచరణాత్మక నైపుణ్య-ఆధారిత విద్య పై ప్రత్యేక దృష్టి సారించి నిర్వహించిన జాతీయ వర్క్‌షాప్ లక్ష్యాల మేరకు జాతీయ విద్యా విధానం 2020 అమలు జరిగేలా చూసేందుకు ఒక వేదికగా ఉపకరిస్తుంది.
ఆర్‌సీఐ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సుబోధ్ కుమార్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
***
(Release ID: 1924645)
Visitor Counter : 229