వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రానున్న 25 ఏళ్లలో భారతదేశానికి 10 రెట్ల కంటే ఎక్కువ వృద్ధి సామర్థ్యం: గోయల్


వాణిజ్యం, సాంకేతికత, పర్యాటకం, ప్రతిభ అనే 4టీలపై దృష్టి పెట్టాలన్న కేంద్ర మంత్రి

ఫెడరేషన్ ఆఫ్ బెల్జియన్ ఎంటర్‌ప్రైజెస్‌తో జరిగిన బిజినెస్ సమావేశంలో పీయూష్ గోయల్ కీలక ప్రసంగం

Posted On: 16 MAY 2023 12:17PM by PIB Hyderabad

భారత -యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ (టీటీసీ) మొదటి మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యేందుకు కేంద్ర వాణిజ్యం & పరిశ్రమలు, జౌళి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ బ్రస్సెల్స్‌ చేరుకున్నారు.  బ్రస్సెల్స్‌లో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఎంటర్‌ప్రైజెస్ ఇన్ బెల్జియం (ఎఫ్ఈబీ) నిర్వహించిన వ్యాపార సమావేశానికి హాజరయ్యారు.  ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా పీయూష్ గోయల్‌కు ఆహ్వానం అందింది. ఫెడరేషన్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి ముఖ్య ప్రసంగం చేశారు.

రౌండ్‌టేబుల్ చర్చలు..

ఈ సమావేశానికి భారతీయ వ్యాపార ప్రతినిధి బృందానికి చెందిన ఆరుగురు సభ్యులతో పాటు బెల్జియం వైపు నుండి 28 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు హాజరయ్యారు. ఎఫ్ఈబీ అధ్యక్షుడు శ్రీ రెనే బ్రాండర్స్ స్వాగత ఉపన్యాసం చేశారు. సమావేశాన్ని ఎఫ్ఈబీ సీఈఓ శ్రీ పీటర్ టిమ్మర్‌మాన్స్ మోడరేట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తన ముఖ్యోపన్యాసం చేస్తూ  రాబోయే 25 ఏళ్లలో భారతదేశం  పది రెట్లకంటే ఎక్కువ వృద్ధి సామర్థ్యాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా దాని స్థానాన్ని బలోపేతం చేస్తుందని వివరించారు, వాణిజ్యం యొక్క  4టీలై, సాంకేతికత, పర్యాటకం మరియు ప్రతిభపై దృష్టి సారించాలనిఅన్నారు. స్థిరత్వం మరియు పునరుత్పాదక ఇంధనం కోసం దాని ప్రతిష్టాత్మక లక్ష్యం 2021పారిస్ లక్ష్యాలను సాధించే విషయంలో భారత్ షెడ్యూల్ కంటే 9 సంవత్సరాల ముందుగానే అందిపుచ్చుకున్నట్టుగా పేర్కొన్నారు. ఈ సమావేశం తర్వాత రౌండ్‌టేబుల్ చర్చలు జరిగాయి. ఇందులో భారత దేశంలో ప్రస్తుతం ఉన్న మరియు పనిచేస్తున్న బెల్జియం ఎంటర్‌ప్రైజెస్ నుండి టెస్టిమోనియల్‌లు, బెల్జియంలో ఉన్న భారతీయ మరియు విదేశీ కంపెనీల నుండి టెస్టిమోనియల్‌లు సమావేశంలో పాల్గొన్న వ్యాపార సంస్థల అనుభవాల ప్రదర్శనలు జరిగాయి. రౌండ్‌టేబుల్‌లో ఆంక్షలు మరియు సుంకాలు, ఐపీఆర్ రక్షణ, పెట్టుబడులు, వ్యర్థ పదార్థాల నిర్వహణ రంగంలో నిబంధనల అవసరం, నియంత్రణ సమ్మతిని తగ్గించడం, జీరో కార్బన్ టెక్నాలజీ, గ్రీన్ ఫైనాన్సింగ్, ఆఫ్-షోర్ విండ్ సిస్టమ్‌లు మొదలైనవి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించారు. రౌండ్ టేబుల్ చర్చకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ వాతావరణ సమస్యల వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించేటప్పుడు అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కోసం ఒకే స్థాయి సమావనత్వపు అవకాశాలను గురించి గోయల్ ప్రస్తావించారు.  ఈ సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడానికి భారతదేశ ఈయు  ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ (టీటీసీ) యొక్క యంత్రాంగం సమర్థవంతమైన వేదికగా ఉద్భవించగలదని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశం మరియు ఈయు వారి స్థానాలు ఎక్కువగా సమలేఖనం చేయబడిన డబ్ల్యుటీఓ సమస్యలకు సంబంధించి అనేక సాధారణ ఆందోళనలను పంచుకుంటాయని. వారి సమిష్టి ప్రయత్నాల ద్వారా, రాబోయే డబ్ల్యుటీఓ మంత్రివర్గ సమావేశంలో ఏకాభిప్రాయం ఆధారిత పరిష్కారాలను కనుగొనడంలో సంయుక్తంగా దోహదపడుతుందని కూడా మంత్రి పేర్కొన్నారు.

*****


(Release ID: 1924614) Visitor Counter : 165