యు పి ఎస్ సి
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా నేడు ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ మనోజ్ సోనీ
Posted On:
16 MAY 2023 1:13PM by PIB Hyderabad
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా డాక్టర్ మనోజ్ సోనీ నేడు (మంగళవారంనాడు) ప్రమాణస్వీకారం చేశారు. కమిషన్‌లో అత్యంత సీనియర్ సభ్యురాలు అయిన శ్రీమతి స్మిత నాగరాజ్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
డాక్టర్ మనోజ్ సోనీ 28.06.2017న కమిషన్ సభ్యునిగా నియమితులయ్య, 05.04.2023న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 316(ఎ) కింద యుపిఎస్‌సి చైర్మన్ పదవీ బాధ్యతలను నిర్వర్తించేందుకు నియమితులయ్యారు.
యుపిఎస్‌సిలోకి వచ్చే ముందు, డాక్టర్ సోనీ అంతర్జాతీయ సంబంధాల అధ్యయనాలలో స్పెషలైజేషన్‌తో పొలిటికల్ సైన్స్ చదివి, పోస్ట్ కోల్డ్ వార్ ఇంటర్నేషనల్ సిస్టమిక్ ట్రాన్సిషన్ అండ్ ఇండో- యుఎస్ రిలేషన్స్ ( ప్రచ్ఛన్న యుద్ధానంతర అంతర్జాతీయ వ్యవస్థాగత పరివర్తన- ఇండో యుఎస్ సంబంధాలు) అన్న అంశంపై సర్దార్ పటేల్ యూనివర్సిటీ నుంచి డాక్టొరేట్ పొందారు. ఆయన బరోడాకు చెందిన ఎంఎస్ యూనివర్సిటీ (ఒకసారి), గుజరాత్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (రెండు సార్లు) వైస్ ఛాన్సలర్‌గా మొత్తం మూడు పర్యాయాలు పని చేశారు. స్వతంత్ర భారతదేశంలో అతిపిన్న వయసులో వైస్ ఛాన్సలర్‌గా పని చేసిన వ్యక్తి ఆయన. డాక్టర్ సోనీ అనేక అవార్డులను, గుర్తింపులను పొందడమే కాక అనేక ప్రముఖ ప్రచురణలు ఆయన పేరిట ఉన్నాయి.
***
(Release ID: 1924539)
Visitor Counter : 226