నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్కు తయారీదారులు, అనుమతించిన నమూనాల జాబితా విషయంలో భారీ సంస్కరణలను ప్రకటించిన ఎం.ఎన్.ఆర్.ఇ.
– దరఖాస్తు రుసుము 80 శాతం తగ్గింపు,
–తనిఖీ ఫీజు 70 శాతం వరకు తగ్గింపు.
–ఎ.ఎల్.ఎం.ఎం లిస్టింగ్ వాలిడిటీని 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు పెంపు.
–సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్కు సంబంధించి ఎ.ఎల్.ఎం.ఎం లో మార్పులు దేశీయంగా గల భారీ డిమాండ్కు అనుగుణంగా , దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు
సులభతర వాణిజ్యాన్ని పెంపొందించడానికి నిర్దేశించినట్టు ఎం.ఎన్.ఆర్.ఇ కార్యదర్శి శ్రీ. బి.ఎస్.భల్లా వెల్లడించారు.
Posted On:
15 MAY 2023 3:38PM by PIB Hyderabad
సోలార్ ఫొటో వోల్టాయిక్ మాడ్యూల్స్ కు సంబంధించి , నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ ఎ.ఎల్ ఎం ఎం.విషయంలో పలు సంస్కరణలను తీసుకువచ్చింది. ఈ సంస్కరణలు ప్రధానంగా సోలార్ పివి తయారీదారుల ఖర్చు తగ్గించేందుకు వీలుకల్పించేవి. అలాగే మొత్తం ఎ.ఎల్.ఎం. ఎం ప్రక్రియలో సులభతర వాణిజ్యాన్ని పెంపొందించడంతోపాటు, ఆయా సంస్థల నమోదుకు, దానికి సంబంధించిన విధివిధానాల పాటింపునకు సంబంధించిన సమయం తగ్గింపు వంటివి ఇందులో ఉన్నాయి.
ప్రధాన సంస్కరణలు కింది విధంగా ఉన్నాయి.
–(ఎ). దరఖాస్తు రుసుము 80 శాతం వరకు తగ్గింపు.
–(బి) . తనిఖీల రుసుము చెప్పుకోదగిన స్థాయిలో తగ్గింపు, కొన్నింటి విషయంలో 70 శాతం వరకు తగ్గింపు.
–(సి).ఎ.ఎల్.ఎం.ఎం.లో దరఖాస్తు దారు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాటితరహాలోనే అదనపు నమూనాలను నమోదు చేసుకోదలచుకుని , అది తక్కువ వాటేజ్ కలిగినది అయితే ఫాక్టరీ తనిఖీ నుంచి మినహాయింపు ఇస్తారు.
–(డి). ఫాక్టరీ తనిఖీకి ముందు, తయారీదారులు తమ దరఖాస్తును ఉపసంహరించుకోవడానికి వెసులుబాటు. దరఖాస్తు రుసుము 90 శాతం వెనక్కి ఇచ్చే ఏర్పాటు.
–(ఇ). ఎ.ఎల్.ఎం.ఎం లో నమోదు చెల్లుబాటును 2 సంవత్సరాలనుంచి 4 సంవత్సరాలకు పెంపు.
–(ఎఫ్). బిఐఎస్ రిజిస్ట్రేషన్ అందిన 7 రోజులలోగా ఎ.ఎల్.ఎం.ఎం. లో ప్రాథమిక నమోదుకు అవకాశం. తుది నమోదు, ఫ్యాక్టరీ నమోదుకు రెండు నెలల గడువు. లేకుంటే జాబితానుంచి తొలగింపు.
–(జి). భవిష్యత్తులో అన్ని ఎ .ఎల్.ఎం.ఎం దరఖాస్తులు , దరఖాస్తు కు సంబంధించిన స్కాన్ చేసిన కాపీలతో దాఖలు చేయాలి. ఎ.ఎల్.ఎం.ఎం దరఖాస్తుల ప్రాసెసింగ్ సంబంధిత వాస్తవ పత్రాల సమర్పణకోసం ఎదురు చూడకుండా
ప్రాసెసింగ్ ప్రారంభిస్తారు. అవసరమైన పత్రాలను తరువాత సమర్పించడానికి వీలు కల్పిస్తారు.
–(హెచ్). ఎ.ఎల్.ఎం.ఎంలో నమోదుకు ఆయా కేటగిరీల వారీగా కనీస సామర్ధ్య మాడ్యూల్ ను ప్రవేశపెట్టడం జరిగింది.
– యుటిలిటి, గ్రిడ్ స్కేల్ పవర్ ప్లాంట్ : 20 .00 శాతం
–రూఫ్ టాప్ , గ్రిడ్ స్కేల్ పవర్ ప్లాంట్లు : 19.50 శాతం.
– సోలార్ లైటింగ్ : 19.0 శాతం
ఈ మార్పులపై మాట్లాడుతూ ఎం.ఎన్.ఆర్.ఇ కార్యదర్శి శ్రీ బి.ఎస్. భల్లా, ఫోటో వోల్టాయిక్ మాడ్యూళ్లకు సంబంధించిన మార్పులు, సులభతర వాణిజ్యాన్ని పెంచడానికి,
దేశీయంగా సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూళ్ల తయారీని పెంచడానికి, ప్రస్తుతం దేశీయంగా ఉన్న డిమాండ్ను , భవిష్యత్తులో ఏర్పడే డిమాండ్ను తట్టుకొనేలా చేయడానికి ఉపకరిస్తుందన్నారు.
“పి.ఎల్. ఐ పథకం దేశీయంగా సోలార్ మాడ్యూళ్ల తయారీ సామర్ధ్యాన్ని పెంచడానికి ఉపయోగపడడమే కాకుండా వాల్యూ చెయిన్ ను సమ్మిళతం చేయడానికి ఉపకరిస్తుంది.
మనం ఇప్పటికేప్రతిసంవత్సరం, 50 జి.డబ్ల్యు పునరుత్పాదకతతో 5 సంవత్సరాల కాలానికి బిడ్ అంచనాలను ప్రకటించడం జరిగింది. ఇందులో 40 జి.డబ్ల్యు సౌరవిద్యుత్ సామర్థ్యానికి సంబంధించినది.
ఇది దేశంలో ఆర్.ఇ తయారీ పరిశ్రమకు మరింత ప్రోత్సాహం ఇస్తుంది. డిమాండ్ ను ఏర్పరుస్తుంది. ఎ.ఎల్.ఎం.ఎం చార్జీల తగ్గింపు, రెగ్యులేషన్లను సులభతరం చేయడం వల్ల సులభతర వాణిజ్యానికి వీలు కలుగుతుంది.
ఆయా సంస్థలు పాటించాల్సిన విధివిధానాల తగ్గింపు, ఎ. ఎల్.ఎం .ఎం కింద వివిధ ప్రాసెసింగ్ చార్జీల తగ్గింపు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది.”అని శ్రీ భల్లా చెప్పారు.
ఎ.ఎల్.ఎం.ఎం. నేపథ్యం:
1) సోలార్ పివి పవర్ వ్యవస్థలను 25 సంవత్సరాల కాలానికి ఏర్పాటు చేస్తున్నందున, సోలార్ పివి బ్యాటరీలకు, ప్లాంట్లలో వాడే మాడ్యూళ్లకు దీర్ఘకాలిక వారంటీలు అవసరం. ఇటువంటి వాటిని యూనిట్లలో తయారు చేయడం అవసరం.
కొన్ని యూనిట్లు ఒక చోట , మరి కొన్ని మరోచోట తయారు చేసే అవకాశం ఉంది. అందువల్ల ఆయా ఉత్పత్తులు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేవిగా ఉండాలి. అలాగే దేశ దీర్ఘకాలిక ఇంధన భద్రతకు పూచీ పడేవిధంగా ఉండాలి.
2) ఇందుకు అనుగుణంగా , కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ (ఎం.ఎన్.ఆర్.ఇ) , ఆమోదిత నమూనాలు,సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూళ్ల తయారీ (తప్పనిసరి రిజిస్ట్రేషన్) ఆదేశాలు 2019ని 2019 జనవరి 02 వ తేదీన జారీచేసింది.
3)ఈ ఏ.ఎల్.ఎం.ఎం ఆదేశం ప్రకారం, ఎ.ఎల్.ఎం.ఎం లో లిస్ట్ –1, నిర్దేశిత నమూనాలు, సోలార్ పివి మాడ్యూళ్ల తయారీదారులు, లిస్ట్ 2 కింద సోలార్ పివి సెల్స్ తయారీ దారుల వివరాలు ఉంటాయి. సోలార్ పివి మాడ్యూళ్లకు సంబంధించి తొలి ఎ.ఎల్.ఎం.ఎం. జాబితా,
ను 10.03.2021 న జారీ చేయడం జరిగింది. సోలార్ పివి సెల్స్ కు సంబంధించిన ఎ.ఎల్.ఎం.ఎం జాబితా ఇంకా విడుదల కాలేదు.
(4) ఎ.ఎల్ .ఎం.ఎం –1 జాబితాలోని (సోలార్ పివి మాడ్యూళ్లు) మాత్రమే ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రభుత్వ సహాయంతో చేపట్టే ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల కింద చేపట్టిన ప్రాజెక్టులు,
ఓపెన్ యాక్సెస్, నెట్ మీటరింగ్ ప్రాజెక్టులు, విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 63 కింద జారీచసిన మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వానికి విద్యుత్ విక్రయించేందుకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టులలో వాడవలసి ఉంటుంది.
ప్రభుత్వం అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ ప్రైజ్లు, స్టేట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ ప్రైజ్లు, కేంద్ర, రాష్ట్ర సంస్థలు, స్యయం ప్రతిపత్తి సంస్థలు ఇందులో ఉన్నాయి.
(5) 10.03.2023 నుంచి ఎ.ఎల్.ఎం ఆర్డర్ను 2023–24 ఆర్ధిక సంవత్సరానికి అబెయన్స్ లో పెట్టారు. ఫలితంగా, 31.03.2024 నాటికి ప్రారంభమయ్యే ప్రాజెక్టులు ఎ.ఎల్.ఎం.ఎం నుంచి సోలార్ పివి మాడ్యూల్స్ సేకరించడం నుంచి మినహాయించారు.
(6) ప్రస్తుతానికి ఎ.ఎల్.ఎం.ఎం జాబితాలో 91 మాడ్యూల్ తయారీ సదుపాయాలు (అన్నీ దేశీయమైనవి), సంవత్సరానికి సుమారు 22,389 ఎం.డబ్ల్యు సోలార్ పివి మాడ్యూల్ తయారీ సామర్ధ్యాన్ని కలిగిఉన్నాయి.
***
(Release ID: 1924420)
Visitor Counter : 218