విద్యుత్తు మంత్రిత్వ శాఖ

హరితహారం కోసం లక్ష్యాలను నిర్దేశించుకోవాలని పరిశ్రమ నాయకులకు శ్రీ ఆర్.కె. సింగ్ సూచించారు, గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ నిబంధనలు పాటించని కేసులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని వారిని కోరారు.


2030 కోసం ఎన్.డి.సి. లక్ష్యానికి అనుగుణంగా భారతదేశం ఉద్గారాలను 45 శాతం తగ్గించే దిశగా, గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ రూల్స్, 2022, ఒక ప్రధాన అడుగు : కేంద్ర విద్యుత్, ఎన్ ఆర్.ఈ. శాఖల మంత్రి శ్రీ ఆర్. కె. సింగ్


గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ నిబంధనలను అనుసరించడంలో పరిశ్రమలకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని కేంద్ర విద్యుత్, ఎన్.ఆర్.ఈ. శాఖల మంత్రి హామీ ఇచ్చారు


గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ నిబంధనలపై పరిశ్రమలతో పాటు, ఇతర భాగస్వాములతో సమావేశానికి కేంద్ర విద్యుత్, ఎన్.ఆర్.ఈ. శాఖల మంత్రి అధ్యక్షత వహించారు.

Posted On: 13 MAY 2023 12:02PM by PIB Hyderabad

గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ నిబంధనలపై ఈరోజు న్యూఢిల్లీలో పరిశ్రమలు, ఇతర భాగస్వాములతో నిర్వహించిన సమావేశానికి కేంద్ర విద్యుత్, ఎన్.ఆర్.ఈ. శాఖల మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ అధ్యక్షత వహించారు.  హైబ్రిడ్ పద్ధతిలో జరిగిన ఈ సమావేశానికి, 500 మందికి పైగా ప్రతినిధులు దృశ్య మాధ్యమం ద్వారా హాజరుకాగా, దాదాపు 50 మంది ప్రత్యక్షంగా హాజరయ్యారు.   గ్రీన్ ఓపెన్ యాక్సెస్ నిబంధనలకు సంబంధించి తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రతినిధులు ఈ సమావేశంలో ప్రస్తావించారు.   భారతదేశ ప్రతిష్టాత్మకమైన పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు, అదే విధంగా, అందరికీ సరసమైన, నమ్మదగిన, స్థిరమైన, గ్రీన్ ఎనర్జీని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో, ప్రభుత్వం గత ఏడాది జూన్, 6వ తేదీన విద్యుత్ (గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ ద్వారా పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడం) నిబంధనలు, 2022 ను నోటిఫై చేసింది.

 

 

ఈ సందర్భంగా శ్రీ సింగ్ మాట్లాడుతూ, హరితహారం కోసం లక్ష్యాలను నిర్దేశించుకోవాలనీ, గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ నిబంధనలను సద్వినియోగం చేసుకోవాలనీ, సరసమైన ధరలకు హరిత విద్యుత్తును పొందేందుకు, పచ్చదనంతో కూడిన స్థిరమైన వాతావరణానికి దోహదపడాలనీ, పరిశ్రమ నాయకులకు పిలుపునిచ్చారు.  “భారతదేశం పచ్చగా మారడానికి, 2030 కి భారతదేశ నవీకరించబడిన ఎన్.డి.సి. లక్ష్యానికి అనుగుణంగా ఉద్గారాలను 45 శాతం మేర తగ్గించడానికి గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ నిబంధనలు-2022 ఒక ప్రధాన అడుగు.  విద్యుత్ వ్యయాన్ని గణనీయంగా తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.  మీరందరూ కొత్త నిబంధనలను సద్వినియోగం చేసుకోవాలని, భవిష్యత్ తరాలకు ఒక పచ్చని భూగోళాన్ని మిగిల్చే దృక్పథంతో పని చేయాలని నేను కోరుకుంటున్నాను” అని కేంద్ర విద్యుత్, ఎన్.ఆర్.ఈ. శాఖల మంత్రి తెలియజేశారు. 

 

 

గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ నిబంధనలను తు.చ. తప్పకుండా అనుసరించని కేసుల గురించి ప్రభుత్వానికి తెలియజేయాలని పరిశ్రమల భాగస్వాములను శ్రీ సింగ్ కోరారు. తద్వారా ఆ సమస్యలను ప్రభుత్వం సంబంధిత ఏజెన్సీల దృష్టికి తీసుకువెళ్ళి, అవసరమైతే, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, ఆయన చెప్పారు.    పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ నిబంధనలను స్వీకరించడానికి అవసరమైన నియంత్రణ, విధానం, తరలింపు మౌలిక సదుపాయాలు, అనుసంధానత, జి.ఎన్.ఏ. మొదలైన వాటితో సహా సాధ్యమైన అన్ని సహాయాలు సమకూర్చడానికి పరిశ్రమలకు హామీ ఇవ్వడం జరిగింది. 

 

 

గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ నిబంధనల ముఖ్య లక్షణాలు

 

 

'గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్' ముఖ్య లక్షణాలు, సాధారణ వినియోగదారులకు లభించే ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

 

 

(ఏ)     వ్యర్ధాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల నుండి లభించే విద్యుత్ తో సహా హరిత విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఈ నియమాలను రూపొందించడం జరిగింది. 

 

 

(బి)     గ్రీన్ ఓపెన్ యాక్సెస్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది.  ఓపెన్ యాక్సెస్ ద్వారా చిన్న వినియోగదారులు కూడా పునరుత్పాదక శక్తిని కొనుగోలు చేసేందుకు వీలుగా హరిత విద్యుత్తు కోసం ఓపెన్ యాక్సెస్ లావాదేవీ పరిమితి 1 మెగా వాట్ నుండి 100 కిలో వాట్ కు తగ్గించడం జరిగింది. 

 

 

(సి)     డిస్కమ్‌ ల నుండి హరిత విద్యుత్తు సరఫరా కోసం వినియోగదారులు డిమాండ్ చేయడానికి అర్హులు.  అర్హులైన వినియోగదారుల కోసం డిస్కమ్‌ లు హరిత విద్యుత్తు ను సేకరించి సరఫరా చేయాల్సి ఉంటుంది.

 

 

(డి)     ఓపెన్ యాక్సెస్‌ ని మంజూరు చేయడానికి వీలుగా ఈ నిబంధనలు మొత్తం ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరించడం జరిగింది.  అప్లికేషన్‌ లో ఏకరూపత, పారదర్శకతను తీసుకురావడం ద్వారా నిర్ణీత కాలవ్యవధిలో ప్రాసెసింగ్ తో పాటు జాతీయ పోర్టల్ ద్వారా ఓపెన్ యాక్సెస్‌ ను ఆమోదించడం తప్పనిసరి చేయడం జరిగింది.   గ్రీన్ ఓపెన్ యాక్సెస్ కోసం ఆమోదం 15 రోజుల్లో మంజూరు చేయడం జరుగుతుంది, లేదా అది మంజూరైనట్లు పరిగణించడం జరుగుతుంది. 

 

 

(ఈ)     వాణిజ్య మరియు పారిశ్రామిక వినియోగదారులు స్వచ్ఛంద ప్రాతిపదికన హరిత విద్యుత్ కొనుగోలు చేయడానికి అనుమతించడం జరిగింది. 

***

 



(Release ID: 1923995) Visitor Counter : 156