కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఎంసిఎ రిజిస్టర్ నుంచి కంపెనీలను నిష్క్రమించేందుకు అవాంతరాలు లేని ఫైలింగ్, సకాలంలో ప్రక్రియాబద్ధంగా మార్గాన్ని కల్పించేందుకు సెంటర్ ఫర్ ప్రాసెసింగ్ యాక్సిలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ (సి-పిఎసిఇ) ఏర్పాటు
Posted On:
13 MAY 2023 1:50PM by PIB Hyderabad
కంపెనీలను తొలిగించే ప్రక్రియను కేంద్రీకృతం చేయడంలో సెంటర్ ఫర్ ప్రాసెసింగ్ యాక్సిలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ (సి-పిఎసిఇ - కార్పొరేట్ నిష్క్రమణను వేగవంతం చేసే ప్రక్రియ కేంద్రం) ఏర్పాటు చేయడం ద్వారా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసిఎ) ఒక అడుగు ముందుకు వేసింది.
సి-పిఎసిఇ స్థాపన రిజిస్ట్రీపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడడమే కాక, రిజిస్ట్రీని దోషరహితంగా ఉంచడంతోపాటు వాటాదారులకు మరింత అర్థవంతమైన డేటాను అందుబాటులోకి తేవడంలో తోడ్పడుతుంది. రిజిస్టర్ నుంచి తమ కంపెనీ పేర్లను ఎటువంటి అవాంతరాలు లేని ఫైలింగ్, సకాలంలో, పద్ధతి ప్రకారం దానిని తొలిగించడానికి వాటాదారులకు పిఎసిఇ సౌలభ్యతను కల్పించడం ద్వారా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. కంపెనీలు వ్యాపారం చేయడాన్ని సులభతరం చేయడమే కాక, సులభంగా నిష్క్రమించేందుకు ఇటీవలి కాలంలో ఎంసిఎ తీసుకున్న అనేక చర్యలలో భాగంగా సి-పిఎసిఎ ఏర్పాటు జరిగింది.
సెక్షన్ 396లోని సబ్-సెక్షన్ (1) కింద స్థాపించిన సి-పిఎసిఇ సంస్థ, దరఖాస్తుల విశ్లేషణ, విసర్జన ప్రక్రియల క్రియాత్మక అధికార పరిధిని వినియోగించుకునేందుకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఒసి) ద్వారా పని చేస్తుంది.
సి-పిఎసిఇ కార్యాలయాన్ని 1 మే 2023న ఎంసిఎ, డైరెక్టర్, ఇనస్పెక్షన్& ఇన్వెస్టిగేషన్ శ్రీ ఆర్.కె. దాల్మియా ప్రారంభించారు.ఐసిఎల్ఎస్‌కు చెందిన శ్రీ హరిహర సాహూ ను సి-పిఎసిఇ కార్యాలయ తొలి రిజిస్ట్రార్‌గా నియమించారు.
కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ (డిజిసిఒఎ), న్యూఢిల్లీ పర్యావేక్షణ/ పఆలన కింద సి-పిఎసిఎ కార్యాలయం పని చేస్తుంది.
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 17 మార్చి 2023న జారీ చేసిన నోటిఫికేషన్ నెం. ఎస్.ఒ. 1269 (ఇ) ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసిఎ), 7వ అంతస్థు, ప్లాట్ నెం. 6,7,8, సెక్టార్ 5, ఐఎంటి మానేసార్, గుర్గాంవ్ జిల్లా (హర్యానా), పిన్ కోడ్ -122050 నుంచి పని చేస్తుంది.
తదనంతరం, 17 ఏప్రిల్ 2023న ఆరీ చేసిన నోటిఫికేషన్ నెం. జి.ఎస్.ఆర్. 298 (ఇ) ద్వారా మంత్రిత్వ శాఖ కంపెనీల ( కంపెనీల రిజిస్టర్ నుంచి కంపెనీల పేర్ల తొలగింపు) నిబంధనలు, 2023ను సవరించింది. ఇవి 1 మే 2023 నుంచి అమలులోకి వచ్చింది.
***
(Release ID: 1923988)
Visitor Counter : 190