సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
సంస్కృతి అందరినీ ఏకం చేస్తుంది అన్న ఇతివృత్తాన్ని ప్రముఖంగా పట్టి చూపనున్న భుబనేశ్వరలో జరుగనున్న రెండవ కల్చరల్ వర్కింగ్ గ్రూప్
మే 14వ తేదీన పూరీ సముద్ర తీరంలో సంస్కృతి అందరినీ ఏకం చేస్తుంది అన్న ఇతివృత్తంపై శాండ్ ఆర్ట్‌ను సృష్టించనున్న శ్రీ సుదర్శన్ పట్నాయక్
Posted On:
13 MAY 2023 5:00PM by PIB Hyderabad
విభిన్న సంస్కృతులు, వర్గాల మధ్య శాంతియుత సహజీవనం ఆధారంగా బహుముఖీయత పట్ల భారతదేశ అచంచలమైన విశ్వాసాన్ని వెలుగులోకి తెచ్చేందుకు జి20 భారత అధ్యక్షతన కల్చరల్ వర్కింగ్ గ్రూప్ (సిడబ్ల్యుజి) సంస్కృతి అందరినీ ఏకం చేస్తుందన్న భావనను ప్రముఖంగా పట్టి చూపనుంది.
అందరినీ సంస్కృతి ఏకం చేస్తుందన్నభావనను మే 14 నుంచి 17, 2023న ఒడిషాలోని భుబనేశ్వర్ లో నిర్వహించనున్న రెండవ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్‌లో ప్రచారం చేయనున్నారు. ఒడిషాకు చెందిన పద్మశ్రీ శ్రీ సుదర్శన్ పట్నాయక్ 14 మే 2023న పూరీ బీచ్‌లో ఈ ఇతివృత్తం పై శాండ్ ఆర్ట్ ను సృష్టించనున్నారు.
ఈ కళాసృష్టిని సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, డిఒఎన్ఇఆర్ మంత్రి శ్రీ జి.కె. రెడ్డి, సాంస్కృతిక శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ప్రారంభించనున్నారు.
నేటి పరస్పర అనుసంధానిత ప్రపంచంలో, సమన్వయ ఫలితాలను అందిదంచడంలో సంస్కృతి కీలక పాత్రను పోషించడమే కాక, సమ్మిళిత, సామరస్య జీవనాన్ని ప్రోత్సహిస్తుంది.
సంస్కృతి అందరినీ ఏకం చేస్తుంది అన్న ఇతివృత్తం సాంస్కృతిక సంప్రదాయాలు, ఆచరణలలో ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ, అవి తరచుగా అంతర్లీన విలువలను, సూత్రాలను పంచుకుంటాయని గుర్తించింది.
తన అన్ని వ్యక్తీకరణలలో సంస్కృతి సరిహద్దులను అధిగమించగల సామర్ధ్యాన్ని కలిగి ఉండటమే కాక, వ్యక్తులు, సమాజాలు, దేశాల మధ్య వాస్తవ సంవాదాన్ని, సంభాషణ, అవగాహనకు ప్రేరణను ఇస్తుంది.
సమకాలీన ప్రపంచ సవాళ్ళకు, స్థిరమైన, సమతులమైన పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు సహకరించుకోవడానికి సంస్కృతి మార్గాలను అందిస్తుంది.
వసుధైక కుటుంబం సారాంశాన్ని సంగ్రహిస్తూ, సంస్కృతి మనందరినీ ఏకం చేస్తుందన్న సందేశం స్థిరమైన సమిష్టి భవిష్యత్తు, సార్వత్రిక శ్రేయస్సు కోసం పని చేసేందుకు సమగ్ర దృష్టిని కలిగి ఉంటుంది.
భారతదేశంలో శాండ్ ఆర్ట్‌లో పథనిర్ణేతగా గుర్తింపు పొందిన శ్రీ సుదర్శన్ పట్నాయక్ తన విశిష్ట సేవకు మూడవ అత్యున్న పౌర సత్కారం అయిన పద్మశ్రీని అందికున్నారు. ఆయన శాండ్ ఆర్ట్ సృష్టి ప్రపంచ ప్రఖ్యాతిని పొందడమే కాదు, ప్రపంచ స్థాయిలో జరిగిన వివిధ పోటీలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాయి.
తన కళను సామాజిక, పర్యావరణ అంశాలు, సమస్యల గురించి అవగాహనను వ్యాప్తి చేసే సాధనంగా, ఒక సామాన్య హేతువు కోసం ప్రజలందరినీ ఐక్యం చేయడం ద్వారా శాంతి, సామరస్య సందేశాన్ని వ్యాప్తి చేయడానికి తన కళను ఉత్ప్రేరకంగా ఉపయోగించాలన్నది శ్రీ పట్నాయక్ విశ్వాసం.
శాండ్ ఆర్ట్ అభ్యాసంలో సాంస్కృతిక, ప్రాంతీయ బేధాలు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ కలిపి ఉంచే సామ్యతను అది కలిగి ఉంటుంది. మూలంలో శాండ్ ఆర్ట్ సహజ ప్రపంచపు సౌందర్యాన్ని, దాని అశాశ్వత లక్షణాన్ని ప్రతిఫలిస్తూ కొనియాడుతుంది.
బీచ్‌లో సులభంగా లభించే ఇసుక, నీరు నుంచి సృష్టించిన ఈ స్థిరమైన కళారూపం ప్రకృతిలోని సమతుల్యతకు జోడించదు లేదా దానిని తీసివేయదు.
***
(Release ID: 1923987)
Visitor Counter : 178