శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
స్వస్తిక్ చొరవ కింద జల & పర్యావరణ సబ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్
నాడు పోస్టు చేయడమైనది:
10 MAY 2023 2:06PM by PIB Hyderabad
భారతదేశ శాస్త్రీయంగా ధృవీకరించిన విజ్ఞానాన్ని స్వస్తిక్ (ఎస్‌విఎఎస్‌టిఐకె- శాస్త్రీయయంగా ధృవీకరించిన సామాజిక సంప్రదాయ విజ్ఞానం) పేరిట తెలియచేసే జాతీయ చొరవలో భాగంగా, సిఎస్ఐఆర్ - నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (ఎన్ఐఎస్‌సిపిఆర్) జల, జీవావరణ& పర్యావరణ సబ్‌కమిటీ తొలి సమావేశాన్ని ఐఐటిట బాంబే, సీనియర్ ప్రొఫెసర్ అయిన ప్రొఫెసర్ బిఎన్ జగతాప్ అధ్యక్షతన మిశ్రిత పద్ధతిలో నిర్వహించింది.
ప్రొఫెసర్ ప్రదీప్ పి ముజుందార్, డాక్టర్ వీరేంద్ర ఎం తివారీ, డాక్టర్ ఎల్ఎస్ రాథోడ్, డాక్టర్ మనోహర్ సింగ్ రాథోడ్, ప్రొఫెసర్ సరోజ్ కె బారీక్, ప్రొఫెసర్ అనిల్ పి జోషి, డాక్టర్ పుష్పేంద్ర కె సింగ్, డాక్టర్ విశ్వజనని జె సత్తిగేరీ సహా ప్రముఖ నిపుణులు ఈ సబ్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఎన్ఐఎస్‌సిపిఆర్ నుంచి స్వస్తిక్ బృంద సభ్యులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. నిపుణులకు ఆహ్వానం పలుకుతూ సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రంజన అగర్వాల్ స్వస్తిక్ కార్యకలాపాలు, దాని డిజిటల్ జాడల గురించి సంక్షిప్తంగా పరిచయం చేశారు.సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్, ఐహెచ్& టికెఎస్ అధిపతి డాక్టర్ చారు లత తన ప్రెజెంటేషన్ లో స్వస్తిక్ ద్వారా చేపట్టిన కార్యకలాపాల సంగ్రహావలోనాన్ని ఇచ్చారు.
నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకొని, నీటి పొదుపు, వాన నీటి నిల్వ, ఉపరితల జల నిర్వహణ, నీటి శుద్ధి అంశాలలో భారతీయ సంప్రదాయ విజ్ఞానాన్ని, పద్ధతులను డాక్యుమెంట్ చేసి, వ్యాప్తి చేసేందుకు చర్యలను సూచించారు. తన సంక్షిప్త ప్రెజెంటేషన్ ద్వారా ప్రాచీన భారతదేశంలో జలవాతావరణ శాస్త్రం (హైడ్రాలజీ)కి సంబంధించిన కాలక్రమాన్ని బెంగళూరుల ఐఐఎస్‌సి ప్రొఫెసర్ ప్రదీప్ పి ముజుందార్ అందించారు. జీవావరణ, పర్యావరణం, నిలకడగా ప్రకృతిని, జల సంరక్షణ వెనుక ఉన్న శాస్త్రీయతను అర్థం చేసుకోవలసిన అవసరాన్ని పద్మభూషణ్ ప్రొఫెసర్ అనిల్ జోషి ఉద్భోధించారు.
ప్రాచీన జల సంరక్షణ వ్యవస్థలు సమాజానికి ఎంత ముఖ్యమో అవగాహనను సృష్టించి, ప్రోత్సహించాల్సిన అవసరం గురించి ప్రొఫెసర్ సరోజ్ కె బారీక్ వ్యాఖ్యానించారు. ఇందుకు అదనంగా, జీవావరణ పరిరక్షణ చర్యలకు సంబంధించి, పవిత్ర తోపులు, కొండ ప్రాంతంలో వ్యవసాయ పద్ధతులకు సంబంధించిన సంప్రదాయ విజ్ఞాన పద్ధతులను కూడా చర్చించారు.
నీటి సంరక్షణ, వివిధ పర్యావరణ పద్ధతులపై శాస్త్రీయ ప్రాతిపదికతో భారతీయ సంప్రదాయ విజ్ఞానాన్ని వ్యాప్తి చేసే చర్యలపై బహిరంగ చర్చతో సబ్ కమిటీ సమావేశం ముగిసింది.
***
(రిలీజ్ ఐడి: 1923115)
సందర్శకుల సూచీ సంఖ్య : : 241