పార్లమెంటరీ వ్యవహారాలు
మే 17న న్యూఢిల్లీలో పెన్షన్ అదాలత్‌ను నిర్వహించనున్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
Posted On:
09 MAY 2023 3:51PM by PIB Hyderabad
పింఛన్లు, పింఛనుదార్ల సంక్షేమ విభాగం ఆదేశం మేరకు బుధవారం, మే 17, 2023న అన్ని మంత్రిత్వ శాఖలు/ విభాగాలు దేశవ్యాప్త పెన్షన్ అదాలత్‌ను నిర్వహించనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 17 మే 2023న ఉదయం 11.00 గంటల నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పింఛనుదారుల/ కుటుంబ పింఛనుదారుల కోసం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ, 92, పార్లమెంట్ హౌజ్, న్యూఢిల్లీలోని డిప్యూటీ కార్యదర్శి (ఎ&పి) కార్యాలయంలో మాత్రమే పెన్షన్ అదాలత్‌ను నిర్వహిస్తోంది. మంత్రిత్వ శాఖకు చెందిన పింఛనుదారుల, కుటుంబ పింఛనుదారులు పింఛనుకు సంబంధిత ఫిర్యాదులు ఏమైనా ఉంటే, వాటి పరిష్కారం కోసం పెన్షన్ అదాలత్‌కు హాజరు కావచ్చు.
పింఛనుదారుల, కుటుంబ పింఛనుదార్లు పింఛనుకు సంబంధించిన ఫిర్యాదులను rahul.agrawal[at]gov[dot]in or dhirendra.choubey[at]nic[dot]in అన్న ఇమెయిల్ ఐడికి పంపవచ్చు. మరిన్ని వివరాల కోసం పింఛనుదారులు 011-23034746/23034755 అన్న టెలిఫోన్ నెంబర్లపై కానీ పైన ప్రస్తావించిన ఇమెయిల్ ఐడికి మెయిల్ చేయడం ద్వారా సంప్రదించవచ్చు.
పింఛనుదారులు తమ పేరు, హోదా (వారు పదవీవిరమణ చేసిన నాటి), పిపిఒ నెంబరు, బ్యాంకు వివరాలు, పదవీవిరమణ చేసిన తేదీ, టెలిఫోన్ నెంబర్లతో సహా చిరునామాలను వారు ప్రస్తావించాలి. పిపిఒ & కోరిజెండమ్ పిపిఒలు (అందుబాటులో ఉంటే)/ తాజాపరిచిన బ్యాంకు పాస్ పుస్తకాల చివరి రెండు పేజీలను కూడా దరఖాస్తుకు జతపరచాలి. వీడియో కాన్ఫరెన్సింగ్‌కు సంబంధించిన లింక్‌ను తగిన సమయంలో ప్రచురిస్తారు.
***
(Release ID: 1923019)
Visitor Counter : 156