సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"వికలాంగుల హక్కుల చట్టం 2016 నిబంధనల అమలుపై , అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల రెసిడెంట్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించిన వికలాంగుల సాధికారత విభాగం కార్యదర్శి


ఐసీటీ, నైపుణ్య అభివృద్ధి/వృత్తి శిక్షణ,బ్రెయిలీ ప్రెస్‌లకు ప్రోత్సాహం అందించి, వికలాంగుల సంక్షేమం కోసం రూపొందించిన అన్ని అంశాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన కార్యదర్శి

కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమంగా అమలు చేస్తున్న "నైపుణ్యంపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక" వికలాంగులకు నైపుణ్య శిక్షణ - డిడిజి దృష్టి

Posted On: 09 MAY 2023 3:54PM by PIB Hyderabad

కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ సలహాలు, సూచనలు మార్గదర్శకత్వంలో వికలాంగుల సంక్షేమం, సాధికారత కోసం వికలాంగుల సాధికారత విభాగం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరుపై ఈరోజు శ్రీ రాజేష్ అగర్వాల్ ఉన్నత  స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల  రెసిడెంట్ కమిషనర్లు, ప్రతినిధులు హాజరయ్యారు. 

వికలాంగుల సాధికారత విభాగం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు,పథకాల వివరాలను శ్రీ రాజేష్ అగర్వాల్ వివరించారు. వికలాంగుల సాధికారత, సంక్షేమం, హక్కుల పరిరక్షణ లక్ష్యంగా కార్యక్రమాలు,పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు. ఐసీటీ తో సహా వికలాంగుల సంక్షేమం రూపొందించిన అన్ని కార్యక్రమాలు అమలు చేయాలని ఆయన సూచించారు.కార్యక్రమాలు,పథకాలు సక్రమంగా సమస్యలు లేకుండా అమలు జరిగేలా చూసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి వ్యాధులను ముందుగా గుర్తించడానికి నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేయడం, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడం,ఉన్నత విద్యాసంస్థలు  ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు, నైపుణ్యాభివృద్ధి/వృత్తి శిక్షణ కార్యక్రమాలను  మాతృభాషలో అందించి,  విద్య మరియు అవగాహన కల్పన సామాగ్రి,  బ్రెయిలీ ప్రెస్‌ను ప్రోత్సహించడం మొదలైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని శ్రీ రాజేష్ అగర్వాల్ వివరించారు.

డీడీఆర్ఎస్, ఏఐసీ, సీడీఈఐసి ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల వివరాలను వికలాంగుల సాధికారత విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ రాజీవ్ శర్మ వివరించారు. కార్యక్రమాలు, పథకాలు క్షేత్ర స్థాయిలో  సక్రమంగా అమలు చేయడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు సహకారం అందించాలని కోరారు. 

కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమంగా అమలు చేస్తున్న "నైపుణ్యంపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక" కింద వికలాంగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ కిషోర్ బి. సుర్వాడే సూచించారు. కార్యక్రమాన్ని చర్చిండానికి ఇటీవల ఢిల్లీలో సంబంధిత వర్గాలతో ఎన్ఐఎస్డి జాతీయ స్థాయి  సమావేశాన్ని నిర్వహించింది.  

బ్రెయిలీ ప్రెస్ ప్రాధాన్యత వివరించిన డిప్యూటీ కార్యదర్శి శ్రీమతి మీనా కుమారి శర్మ బ్రెయిలీ ప్రెస్ పథకం కింద అందిస్తున్న సహకారాన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  బ్రెయిలీ పుస్తకాలు, దృష్టి లోపం ఉన్నవారికి ఇతర విద్యా సామగ్రి ప్రచురించడానికి సంబంధించిన ప్రతిపాదనలను నోడల్ ఏజెన్సీ NIEPVD ద్వారా పంపాలని కోరారు. 

2023 జనవరిలో గోవాలో నిర్వహించిన పర్పుల్ ఫెస్ట్ వంటి కార్యక్రమాలు  నిర్వహించడానికి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు నిధులు కేటాయించడానికి కొత్తగా  జాతీయ నిధి ఏర్పాటు చేశామని వికలాంగుల సాధికారత విభాగం అండర్ సెక్రటరీ శ్రీ అమిత్ శ్రీవాస్తవ తెలిపారు. దీని నుంచి నిధులు పొందడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతిపాదనలు పంపాలని కోరారు.   NIEPVD డెహ్రాడూన్‌ సహకారంతో   వివిధ పథకాల గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి విభాగం  రేడియో ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తుందని తెలిపారు.  ఈ ఇంటర్వ్యూలను స్థానిక భాషల్లో ప్రసారం చేయడానికి, సోషల్ మీడియా  ద్వారా మరింత ప్రచారం చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. 

వికలాంగుల హక్కుల చట్టం 2016 నిబంధనల అమలు కోసం సుప్రీంకోర్టులో దాఖలైన కేసుల వివరాలను శ్రీమతి సేజల్ పవార్ వివరించారు. 2016 ఆర్‌పిడబ్ల్యుడి చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా నిజ సమయ ప్రాతిపదికన అన్ని రాష్ట్రాలు/యుటిలు స్థితి నివేదికను అప్‌లోడ్ చేసే ఆన్‌లైన్ డ్యాష్‌బోర్డ్‌ను రూపొందించాలని భారత సుప్రీంకోర్టు ఆదేశించింది. 2016 ఆర్‌పిడబ్ల్యుడి నిబంధనల అమలు కోసం  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని శ్రీమతి సేజల్ పవార్ తెలిపారు. దేశంలోని మానసిక ఆరోగ్య సంస్థలు, పునరావాస గృహాలు/హాఫ్‌వే హోమ్‌ల వివరాలు  నిజ సమయ సమాచారాన్ని అప్‌లోడ్ చేయడానికి విభాగం  ' మనో ఐశ్వర్య'  డ్యాష్‌బోర్డ్‌ అభివృద్ధి చేసిందాని తెలిపారు. 

వికలాంగుల హక్కుల చట్టం 2016 నిబంధనల అమలు కోసం అమలు చేయాల్సిన చర్యలపై జరిగిన చర్చలో పాల్గొన్న రాష్ట్ర రెసిడెంట్ కమిషనర్లు/ప్రతినిధులు అనేక సూచనలు అందించారు. రెసిడెంట్ కమిషనర్లు/ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలకు అధికారులు సమాచారం అందించారు.  . 

 UDID, నేషనల్ ఫండ్  ఇతర పథకాలకు సంబంధించిన వివిధ  క్రింది సూచనలు అందాయి:

ఏ. అంగవైకల్యం కలిగిన వ్యక్తులకు సాధికారత కల్పించడానికి  సమగ్ర విధానం రూపొందాలి. . విద్యా సంస్థలో కల్పిస్తున్న రిజర్వేషన్లు తక్కువగా ఉన్నాయి. , వృత్తి శిక్షణ, నైపుణ్యం పెంపుదల మొదలైన వాటిలో ప్రైవేట్ రంగం పాత్ర  ఉండాలి.

బి. ప్రైవేటు రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి 

సి. వికలాంగుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలకు ప్రచారం కల్పించడానికి బ్రాండ్ అంబాసిడర్ ను నియమించాలి. 

డి. అన్ని కార్యక్రమాలు విజయవంతంగా అమలు జరిగేలా చూసేందుకు సమగ్ర సమాచార సేకరణ జరగాలి.  

ఈ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం 

ఎఫ్. లబ్ధిదారులను గుర్తించడానికి అట్టడుగు స్థాయి కార్యకర్త, ఆశా వర్కర్, అంగన్‌వాడీ కార్యకర్తకు ప్రోత్సాహకం అందించాలి. 

వికలాంగుల సాధికారత విభాగం ఏర్పాటు చేసిన సమావేశంలో సిడెంట్ కమీషనర్లు పాల్గోవడం ఇదే తొలిసారి. ప్రభుత్వ పధకాలు మరింత పటిష్టంగా అమలు జరిగేలా చూసేందుకు సమావేశం సహకరిస్తుందని ఆశిస్తున్నారు.  

 

***


(Release ID: 1923017) Visitor Counter : 782