పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చి కునో జాతీయ పార్క్‌లో వదిలిన ఆడ చిరుత "దక్ష" మృతి

प्रविष्टि तिथि: 09 MAY 2023 6:26PM by PIB Hyderabad

దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చి కునో జాతీయ పార్క్‌లో వదిలిపెట్టిన ఆడ చిరుత దక్ష మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన దక్షను ఇవాళ ఉదయం 10:45 గంటలకు పర్యవేక్షణ బృందం గుర్తించింది. పశు వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఈ రోజు మధ్యాహ్నం 12.00 గంటలకు చిరుత మృతి చెందింది.

సంభోగం సమయంలో మగ చిరుత హింసాత్మక చర్య వల్ల ఆడ చిరుత దక్ష గాయపడినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. సంభోగం సమయంలో ఆడ చిరుతపై మగ చిరుతల గుంపు హింసాత్మక చర్యలకు దిగడం సర్వసాధారణం. అటువంటి పరిస్థితిలో పర్యవేక్షణ బృందం జోక్యం చేసుకునే అవకాశాలు దాదాపుగా ఉండవు, ఆచరణ సాధ్యం కూడా కాదు.

చనిపోయిన ఆడ చిరుత దక్ష కళేబరానికి నిబంధనల ప్రకారం పశు వైద్యుల బృందం శవపరీక్ష నిర్వహించింది.

 

****


(रिलीज़ आईडी: 1923008) आगंतुक पटल : 232
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil