గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

ప్రాజెక్ట్ స్మార్ట్ కోసం జైకాతో సంయుక్త అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఎం.హెచ్.యు.ఎ. మరియు ఎంఓఆర్

Posted On: 08 MAY 2023 3:58PM by PIB Hyderabad

'ముంబయి-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్' (ప్రాజెక్ట్-స్మార్ట్) వెంట స్టేషన్ ఏరియా డెవలప్‌మెంట్ కోసం కేంద్ర గృహా & పట్టణ వ్యవహారాల శాఖ (ఎం.హెచ్.యు.ఎ.) మరియు రైల్వే మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్) సంయుక్తంగా జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా)తో ఒక సంయుక్త  ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్రాజెక్ట్-స్మార్ట్ అనేది ముంబయి - అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్వే (ఎంఏహెచ్ఎస్ఆర్) స్టేషన్‌ల పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి, ప్రయాణికులు మరియు ఇతర వాటాదారుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, స్టేషన్ ప్రాంతాల పరిసరాల్లో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించింది. ఈ ప్రాజెక్ట్ ఎంఏహెచ్ఎస్ఆర్ స్టేషన్ల పరిసర ప్రాంతాలను ప్లాన్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి, నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల సంస్థాగత సామర్థ్యాన్ని సులభతరం చేస్తుంది మరియు విస్తృతిని పెంచుతుంది. నాలుగు హైస్పీడ్ రైల్ స్టేషన్‌ల కోసం ఎంఓయూ కుదుర్చుకుంది. గుజరాత్‌లోని సబర్మతి, సూరత్ మరియు మహారాష్ట్రలోని విరార్ మరియు థానే; మార్గంలోని 12 స్టేషన్లు ఇందులో ఉన్నాయి. సూరత్, విరార్ థానే గ్రీన్ ఫీల్డ్ అయితే సబర్మతి బ్రౌన్ ఫీల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు.  ఎం.హెచ్.యు.ఎ., గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు మరియు జైకా ఢిల్లీ, అహ్మదాబాద్ మరియు ముంబైలలో ప్రాజెక్ట్-స్మార్ట్ల కోసం సెమినార్లు మరియు క్షేత్ర స్థాయి పర్యటనల శ్రేణిని నిర్వహిస్తున్నాయి. ఈ సిరీస్ యొక్క మొదటి సెమినార్ 8 మే, 2023న న్యూఢిల్లీలోని నిర్మాణ్ భవన్‌లో నిర్వహించబడింది; ఇందులో జపాన్ ఎంబసీ, జైకా హెచ్.క్యు, జైకా ఇండియా ఆఫీస్, జైకా నిపుణుల బృందం, రైల్వే మంత్రిత్వ శాఖ, నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎం.హెచ్.యు.ఎ., టీసీపీఓ అధికారులు చర్చించారు. ఈ సెమినార్ల చర్చలు సబర్మతి, సూరత్, విరార్ మరియు థానే హెచ్‌ఎస్‌ఆర్ స్టేషన్‌ల కోసం 'స్టేషన్ ఏరియా డెవలప్‌మెంట్ ప్లాన్‌లు' మరియు ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్ (టీఓడీ) స్టేషన్ ఏరియా అభివృద్ధి కోసం జపాన్, భారతదేశం మరియు ఇతర దేశాలలో అవలంబించిన అనుభవాలు మరియు పద్ధతులను కలిగి ఉన్న మోడల్ హ్యాండ్‌ బుక్ తయారీలో దోహదపడతాయి.

*********



(Release ID: 1922706) Visitor Counter : 147