శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
మధుమేహం వ్యాధికి టెక్నాలజీ ఆధారిత సంరక్షణకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు
Posted On:
07 MAY 2023 2:59PM by PIB Hyderabad
మధుమేహం వ్యాధికి టెక్నాలజీ ఆధారిత సంరక్షణకు నాయకత్వం వహించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ & టెక్నాలజీ; సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ఎర్త్ సైన్సెస్ పీఎంవో, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి మరియు అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
ఇక్కడ "డయాబెటిస్ టెక్నాలజీ అండ్ థెరప్యూటిక్స్ 2023" (DTechCon 2023) 3-రోజుల ప్రపంచ కాంగ్రెస్‌ను ఉద్దేశించి, ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ మరియు ప్రొఫెసర్ అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా హాజయ్యారు. కరోనా మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొన్న తర్వాత ఆరోగ్య సంరక్షణ రంగంలో భారతదేశం వైపు మిగిలిన ప్రపంచం చూస్తున్నదని ఆయన అన్నారు. సాంకేతికంగా, మానవ వనరులలో మనం ఇతర దేశాల కంటే చాలా ముందున్నామని ఆయన చెప్పారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ భారతదేశం మరింత సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని, ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వ్యక్తిగతంగా సైన్స్ & టెక్నాలజీ ఆవిష్కరణలను ఆయన ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ప్రధానికి సైన్స్ పట్ల సహజమైన ఆసక్తి ఉందని, గత తొమ్మిదేళ్లుగా ఆయనతో సన్నిహితంగా పనిచేశానని, నూతన ఆలోచనలను ఆవిష్కరణలను అభివృద్ధి చేయడంలో మరియు వాటిని అమలు చేయడంలో మోదీ తన బృందానికి స్వేచ్ఛనిచ్చారని అందుకే నేను ఈ విషయం చాలా గట్టిగా చెప్పగలనని మంత్రి అన్నారు.
2014కి ముందు దాదాపు 350 స్టార్ట్‌అప్‌లు ఉండేవి, అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016లోఎర్రకోట ప్రాకారాల నుండి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో స్పష్టమైన పిలుపునిచ్చి ప్రత్యేక స్టార్టప్ స్కీమ్‌ను ప్రారంభించిన తర్వాత, దీని ప్రగతి చాలా స్పష్టంగా ఉంది. 100 కంటే ఎక్కువ యునికార్న్‌లతో 90,000 కంటే ఎక్కువ స్టార్టప్‌ల స్థాయి కి అవి నేడు చేరుకున్నాయని మంత్రి తెలిపారు. ప్రపంచంలోని స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో భారతదేశం నంబర్: 3గా కూడా గుర్తింపబడిందని ఆయన తెలిపారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ అదే విధంగా,అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ భాగస్వామ్యం కోసం తెరిచారు, దీని ద్వారా కేవలం మూడేళ్లలోనే 100కు పైగా స్టార్టప్‌లు అంతరిక్ష రంగంలో అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా, బయోటెక్ స్టార్టప్‌లు 2014లో దాదాపు 50 వుంటే అవి నేడు దాదాపు 6,000కు పెరిగాయని ఆయన చెప్పారు.
ఇటీవల కేంద్ర మంత్రివర్గం నేషనల్ క్వాంటం మిషన్ ప్రారంభానికి ఆమోదం తెలిపింది, ఇది దేశంలో వైద్య నిర్ధారణ మరియు చికిత్సను కూడా పెంచుతుంది. ప్రపంచంలోనే నేషనల్ క్వాంటమ్ మిషన్‌ను ప్రారంభించిన అతి కొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటని మంత్రి తెలిపారు.
టెలిమెడిసిన్ రంగంలో ప్రపంచంలోనే అత్యుత్తమ స్టార్టప్‌లు దేశం లో ఉన్నాయని మంత్రి అన్నారు. ఈ స్టార్టప్ గ్రూపులు ఏ ఐ వైద్యులను అభివృద్ధి చేశాయి. దాని అప్లికేషన్‌కు ఉదాహరణగా మంత్రి మాట్లాడుతూ, తన బృందం తన నియోజకవర్గంలోని దాదాపు 60 మారుమూల గ్రామాలను ఎంపిక చేసి, ‘డాక్టర్ ఆన్ వీల్స్’ అనే టెలిమెడిసిన్ వ్యాన్‌ను తిప్పామని చెప్పారు. ఈ బృందం మొత్తం 60 గ్రామాల్లో 3 నెలల పాటు దీన్ని నిర్వహించిందని, అతి తక్కువ సమయంలోనే అత్యుత్తమ సంప్రదింపులు అందించామని ఆయన చెప్పారు.
భారతదేశం టెక్నాలజీ అగ్రగామిగా మారడమే కాకుండా భారీ మెడికల్ టూరిజం హబ్‌గా మారుతోందని మంత్రి అన్నారు.
ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించిన డాక్టర్ జితేంద్ర సింగ్, ప్రధాని మోదీ వ్యక్తిగత ఆసక్తి మరియు జోక్యం కారణంగా రెండేళ్లలో భారతదేశం కోవిడ్ మహమ్మారిని చాలా చిన్న దేశాల కంటే మెరుగ్గా నిర్వహించిందని అన్నారు. అలాగే డీ ఎన్ ఎ వ్యాక్సిన్ తయారు చేసి ఇతర దేశాలకు కూడా అందించడంలో విజయం సాధించారు.
ప్రపంచంలోనే మధుమేహం పరిశోధనలో భారతదేశం అగ్రగామిగా ఉన్నందున, మధుమేహాన్ని నివారించడం ఆరోగ్య సంరక్షణ మన కర్తవ్యం మాత్రమే కాదు, దేశ నిర్మాణం పట్ల మన కర్తవ్యం కూడా ఎందుకంటే ఇది 40 ఏళ్లలోపు 70% జనాభా కలిగిన దేశం మనది అని మంత్రి అన్నారు. నేటి యువత 2047 నాటికి భారతదేశ ప్రధాన పౌరులు అవుతారు. డయాబెటిస్ మెల్లిటస్ మరియు తద్వారాసంభవించే ఇతర సంబంధిత రుగ్మతలు లేదా దాని సమస్యల ఫలితంగా సంభవించే అసమర్థత సమస్యలతో వారి శక్తిని వృధా చేయనివ్వలేము, అని ఆయన హెచ్చరించారు.
ఈ సదస్సును రూపొందించినందుకు డాక్టర్ బన్షి సాబూ మరియు అతని బృందాన్ని మంత్రి అభినందించారు.
ఇతర దేశాలతో పోలిస్తే ఆరోగ్య సంరక్షణ రంగంలో భారతదేశం చేస్తున్న సాంకేతిక పురోగతి చాలా వేగంగా ఉందని ఈ కార్యక్రమంలో గౌరవ అతిథి, ఏ టీ టీ డీ చైర్ డాక్టర్ తడేజ్ బట్టెలినో అంగీకరించారు.
భారత వైద్య సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శరద్ కుమార్ అగర్వాల్, రాజస్థాన్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సుధీర్ భండారీ, డీటెక్ (ఇండియా) వ్యవస్థాపకుడు డాక్టర్ బన్షీ సబూ, డీటెక్ ప్రెసిడెంట్ డాక్టర్ జోతిదేవ్ కేశవదేవ్, డాక్టర్ మనోజ్ చావ్లా, సైంటిఫిక్ చైర్మన్ డీటెక్కాన్, డా. అమిత్ గుప్తా, ఆర్గనైజింగ్ సెక్రటరీ డిటెక్‌కాన్, హెల్త్‌కేర్ నిపుణులు, ఇండస్ట్రీ లీడర్లు మరియు హెల్త్ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న అనేక స్టార్టప్‌లు సదస్సు ప్రారంభ సెషన్‌లో పాల్గొన్నారు.
డిటెక్‌కాన్ 2023 (వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ డయాబెటిస్ టెక్నాలజీ & థెరప్యూటిక్స్) అనేది టెక్నాలజీ మరియు థెరప్యూటిక్స్ రంగంలో తాజా సమాచారం, ఆవిష్కరణలు, పరిణామాలకు అంకితం చేయబడిన ఒక ప్రపంచ సదస్సు. అదనంగా, ఇన్సులిన్ పంపులు, నిరంతర గ్లూకోజ్ పర్యవేక్షణ, పాయింట్ ఆఫ్ కేర్ మరియు భవిష్యత్ వైద్య సంరక్షణ గురించి లోతైన అవగాహన కోసం వర్క్‌షాప్‌లు మరియు ప్రయోగాత్మక శిక్షణ కూడా ఈ సదస్సు ప్రణాళిక లో భాగం.
***
(Release ID: 1922459)
Visitor Counter : 160