రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఘనంగా బిఆర్ఓ 64 వ వ్యవస్థాపక దినోత్సవం


బిఆర్ఓ సిబ్బందికి మెరుగైన శిక్షణ కోసం పుణేలో టెక్నికల్ కాంప్లెక్స్, ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్ ప్రారంభించిన రక్షణ శాఖ సహాయ మంత్రి

బిఆర్ఓ పనితీరు మెరుగుపరచి, పారదర్శక పాలన కోసం అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించిన మంత్రి
స్వదేశీ పరిజ్ఞానంతో 70 ఆర్ డబుల్ లేన్ మాడ్యులర్ వంతెనల నిర్మాణం కోసం అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన బిఆర్ఓ, జీఆర్ఎస్ఈ

రక్షణ సంసిద్ధతను బలోపేతం చేసిన బిఆర్ఓ సరిహద్దు ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి తోడ్పడింది .. శ్రీ అజయ్ భట్

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో బలంగా, సమర్ధంగా రూపొందిన నవ భారతదేశం ఎవరి ముందు తలవంచను

Posted On: 07 MAY 2023 4:29PM by PIB Hyderabad

 బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బిఆర్ఓ) 64 వ వ్యవస్థాపక దినోత్సవం 2023 మే 7న దేశవ్యాప్తంగా ఉన్న( బిఆర్ఓ) కేంద్రాలలో ఘనంగా జరిగింది. పూణేలోని బిఆర్ఓ   స్కూల్ సెంటర్‌లో 'చీఫ్ ఇంజనీర్స్, ఎక్విప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కాన్ఫరెన్స్' ప్రధాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ పాల్గొన్నారు. బిఆర్ఓ సిబ్బందికి మెరుగైన శిక్షణ అందించడం కోసం పుణేలో నిర్మించిన టెక్నికల్ కాంప్లెక్స్, ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్ ను  రక్షణ శాఖ సహాయ  మంత్రి ప్రారంభించారు. కొత్తగా అభివృద్ధి చేసిన సౌకర్యాలు బిఆర్ఓ సిబ్బందికి ఇస్తున్న శిక్షణ ప్రమాణాలు మెరుగుపడతాయి.సవాళ్లను ఎదుర్కోడానికి బిఆర్ఓ సిబ్బందిని సిద్ధం చేస్తాయి. 

డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన  బిఆర్ఓ - సెంట్రిక్ సాఫ్ట్‌వేర్‌ను కూడా మంత్రి  ప్రారంభించారు. బిఆర్ఓ పనితీరు మెరుగు పరిచి పాలన పారదర్శకంగా సాగేలా చూసేందుకు  రిక్రూట్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ మెజర్‌మెంట్ బుక్, వర్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ను అభివృద్ధి చేశారు. 

వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో 70 ఆర్ డబుల్ లేన్ మాడ్యులర్ వంతెనల నిర్మాణం కోసం  అవగాహన ఒప్పందంపై బిఆర్ఓ, జీఆర్ఎస్ఈ సంతకం చేశాయి. సవాళ్లు ఎదుర్కోవడానికి సాయుధ దళాలు వేగంగా సిద్ధం కావడానికి ఈ వంతెనలు సహాయపడతాయి. 

పటిష్ట సంస్థగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో బిఆర్ఓ విజన్@2047 కార్యాచరణ ప్రణాళికను  బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బిఆర్ఓ) సిద్ధం చేసింది. రహదారులు, వైద్య సంస్థల ప్రామాణీకరణ, నాణ్యత పరిరక్షణ  కేంద్రాలు,వంతెనల నిర్మాణం, సంస్థ ఆస్తుల నిర్వహణ కోసం ఉపగ్రహాల సాయంతో పర్యవేక్షించడానికి డిఫెన్స్ ఎక్సలెన్స్ (iDEX) వ్యవస్థ రూపకల్పన తదితర అంశాలతో బిఆర్ఓ విజన్@2047 కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ బిఆర్ఓపై రూపొందించిన సైనిక్ సమాచార్ ప్రత్యేక పక్ష పత్రికను మంత్రి ఆవిష్కరించారు.  బిఆర్ఓ సాధించిన విజయాలు, చరిత్ర, సంస్థ అమలు చేస్తున్న ప్రాజెక్టులు తదితర అంశాలను ప్రత్యేక సంచిక లో పొందుపరిచారు.

‘ఏక్తా అవమ్ శ్రద్ధాంజలి అభియాన్’ యాత్రను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ‘ఏక్తా అవమ్ శ్రద్ధాంజలి అభియాన్’ యాత్ర 2023 ఏప్రిల్ 10 న ప్రారంభమైంది. మోటార్-సైకిల్, కార్లలో సాగుతున్న  ఈ యాత్రలో వివిధ సరిహద్దు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన బృందాలు పాల్గొంటున్నాయి.వివిధ ప్రాంతాల నుంచి  మట్టి, నదులు/సరస్సులు/జలాశయాల నుంచి నీరు , స్థానిక మొక్కల నమూనాలను బృందాలు సేకరించాయి. వీటిని  బిఆర్ఓ స్కూల్, సెంటర్‌లో రక్షణ శాఖ సహాయ మంత్రి ఇతర ప్రముఖులు నాటారు. 

  బిఆర్ఓ వ్యవస్థాగత దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ప్రసంగించిన శ్రీ అజయ్ భట్  దేశ సంరక్షణ కోసం సంస్థ అందిస్తున్న సేవలను ప్రశంసించారు.  బిఆర్ఓ నిర్మించిన రోడ్లు, వంతెనలు,  సొరంగాలు సాయుధ దళాల కార్యాచరణ సంసిద్ధతను పెంచాయన్నారు.సరిహద్దు ప్రాంతాల  సామాజిక-సామాజిక భద్రత కోసం సంస్థ తన వంతు సహకారం అందించిందన్నారు.  సంస్థ చేపట్టిన కార్యక్రమాల వల్ల   సరిహద్దు ప్రాంతాలు  ఆర్థిక అభివృద్ధి సాధించాయన్నారు.  సెలా సొరంగం, నెచిఫు సొరంగం  ప్రాజెక్టు నిర్మాణ ప్రగతి పట్ల మంత్రి  సంతృప్తి వ్యక్తం చేశారు.

సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని శ్రీ అయాజ్ భట్ తెలిపారు. శ్రీ నరేంద్ర మోదీ నవ భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్నదని మంత్రి అన్నారు. శ్రీ మోదీ నాయకత్వంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం 5వ స్థానంలో నిలిచిందన్నారు.  అనేక దేశాలకు భారతదేశం సైనిక పరికరాలు ఎగుమతి అవుతున్నాయన్నారు.  సొంత ప్రయోజనాలు రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్న భారతదేశం ఎవరికీ తలవంచచదు,నమస్కరించదు అని మంత్రి స్పష్టం చేశారు.

శక్తి ,అంకితభావంతో పని కొనసాగించాలని సిబ్బందికి డైరెక్టర్ జనరల్ బోర్డర్ రోడ్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి పిలుపు ఇచ్చారు సవాళ్లను ఎదుర్కోడానికి  బిఆర్ఓ 'మార్గాన్ని కనుగొంటాము  లేదా మార్గాన్ని నిర్మిస్తాం అన్ననినాదంతో ముందుకు సాగాలన్నారు.

ఆరు దశాబ్దాలకు పైగా దేశ సేవలో ఉన్న బిఆర్ఓ, 61,000 కిలోమీటర్ల రోడ్డు, 900 పైగా వంతెనలు, నాలుగు సొరంగాలు, 19 ఎయిర్‌ఫీల్డ్‌లను నిర్మించింది. భారతదేశ సరిహద్దు ప్రాంతాలతో సహా  భూటాన్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్‌లాంటి  స్నేహపూర్వక విదేశాల్లో ప్రతికూల పరిస్థితుల్లో నిర్మించింది. 

మౌలిక సదుపాయాలు కల్పించడానికి 2022-23 లో బిఆర్ఓ 103  ప్రాజెక్ట్‌లను పూర్తి చేసింది. తూర్పు లడఖ్‌లోని ష్యోక్ బ్రిడ్జ్, అరుణాచల్ ప్రదేశ్‌లోని 70వ తరగతికి చెందిన స్టీల్ ఆర్చ్ సియోమ్ బ్రిడ్జ్ అలోంగ్-యింకియాంగ్ రోడ్‌ ని సంస్థ నిర్మించింది.  వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులను రక్షణ శాఖ  మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఏడాది కాలంలో దేశానికి అంకితం చేశారు.

 

***

 


(Release ID: 1922457) Visitor Counter : 207