పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
సెంట్రల్ ఏషియన్ ఫ్లై వే (సీఏఎఫ్)లో వలస పక్షులు, వలస పక్షుల ఆవాసాల పరిరక్షణ కోసం పటిష్ట చర్యలు అమలు చేయాలని నిర్ణయించిన సెంట్రల్ ఏషియన్ ఫ్లై వే ప్రాంత దేశాలు
Posted On:
06 MAY 2023 12:54PM by PIB Hyderabad
వలస పక్షులు, వలస పక్షుల ఆవాసాల పరిరక్షణ కోసం పటిష్ట చర్యలు అమలు చేయాలని సెంట్రల్ ఏషియన్ ఫ్లై వే ప్రాంత దేశాలు నిర్ణయించాయి. సెంట్రల్ ఏషియన్ ఫ్లై వే (సీఏఎఫ్)లో వలస పక్షులు, వాటి ఆవాసాల కోసం పరిరక్షణ అమలు చేయాల్సిన చర్యలపై ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం/ వలస జాతులపై కన్వెన్షన్ (యూఎన్ఈపీ/సీఎంఎస్) సహకారంతో పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం న్యూఢిల్లీలో 2023 మే 2 నుంచి 4 వరకు జరిగింది.
సమావేశాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే ప్రారంభించారు. తన ప్రసంగంలో గ్లాస్గో లో జరిగిన కాప్ -26లో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధానమంత్రి చేసిన ప్రసంగాన్ని మంత్రి ప్రస్తావించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధానమంత్రి ప్రతిపాదించిన లైఫ్ (పర్యావరణ పరిరక్షణ కోసం పర్యావరణం కోసం జీవనశైలి) విధానాన్ని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు సెంట్రల్ ఏషియన్ ఫ్లై వే (సీఏఎఫ్)లో వలస పక్షులు, వాటి ఆవాసాల కోసం పరిరక్షణ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేసేందుకు భరతదేశం చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు. పర్యావరణహిత జీవనశైలి అవలంభించడం వల్ల వలస పక్షుల తో సహా అన్ని జీవుల ఉనికిని రక్షించడానికి అవకాశం కలుగుతుందన్నారు. భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని వలస పక్షుల తో సహా అన్ని జీవుల ఉనికిని పరిరక్షించడానికి తగిన చర్యలు అవసరమనిశ్రీ అశ్విని కుమార్ చౌబే స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీ అశ్విని కుమార్ చౌబే అన్నారు. పర్యావరణహిత జీవన శైలి కోసం ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన సమావేశం సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో పరిరక్షణ,సుస్థిర అభివృద్ధి అనే ఉమ్మడి లక్ష్యం సాధనకు ఉపకరిస్తుందన్నారు.
అర్మేనియా, బంగ్లాదేశ్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, కువైట్, మంగోలియా, ఒమన్, సౌదీ అరేబియా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌తో సహా సెంట్రల్ ఏషియన్ ఫ్లై వే ప్రాంతంలోని పదకొండు దేశాలు, సిఎంఎస్, ఏఈడబ్ల్యుఏ, రాప్టర్స్ ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాల, సెక్రటేరియట్‌లు, వన్యప్రాణి ముఖ్య ప్రతినిధులు, దేశానికి చెందిన శాస్త్రీయ సంస్థలు, అంతర్జాతీయ, జాతీయ ప్రభుత్వేతర సంస్థలు, నిపుణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రాల వార్డెన్‌లు,
సెంట్రల్ ఆసియన్ ఫ్లైవే కోసం ఒక సంస్థాగత వ్యవస్థ రూపకల్పనపై సమావేశంలో ప్రతినిధులు చర్చించారు. వ్యవస్థను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రతినిధులు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాల్సిన ప్రాధాన్యత గల ప్రాంతాలను గుర్తించాలని నిర్ణయించారు. సీఎంఎస్ సీఏఎఫ్ ముసాయిదా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అంగీకరించారు. వలస పక్షులు, వాటి ఆవాసాలను పరిరక్షించడానికి ఆలోచనలు , ఉత్తమ విధానాల ద్వారా సహకరించుకోవాలి అని సమావేశంలో నిర్ణయించారు. వలస పక్షులు, వాటి ఆవాసాల పరిరక్షణకు ఒక సమన్వయ విధానాన్ని అభివృద్ధి చేయాలని సమావేశం తీర్మానించింది.వలస పక్షులు, వాటి ఆవాసాల పరిరక్షణకు కృషి చేయాలని సమావేశానికి హాజరైన దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.
పక్షుల అభయారణ్యం నిర్వహణ, పక్షులసంరక్షణ కోసం భారతదేశంలో ఏర్పాటైన అభయారణ్యాలు, అభయారణ్యాల నిర్వహణ కోసం భారతదేశంలో అమలు జరుగుతున్న విధానాలు తెలుసుకోవడానికి ప్రతినిధులు హర్యానాలోని గురుగ్రామ్‌లోని సుల్తాన్‌పూర్ నేషనల్ పార్క్‌కు క్షేత్ర పర్యటనను కూడా చేపట్టారు.
****
(Release ID: 1922282)
Visitor Counter : 247