నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వి.ఓ.చిదంబరనార్ పోర్ట్ వద్ద టుటికోరిన్ నుండి మాల్దీవులకు డైరెక్ట్ షిప్పింగ్ సర్వీస్‌ను ప్రారంభించిన శ్రీ శంతను ఠాకూర్


భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యానికి ఊతమివ్వడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన ‘నైబర్‌హుడ్-ఫస్ట్ పాలసీ’ మరియు ఈ ప్రాంతంలోని అందరికీ భద్రత మరియు అభివృద్ధి దృష్ట్యా ఈ సర్వీస్‌ ప్రవేశపెట్టబడింది.

ప్రధాన మంత్రి నాయకత్వంలో మరియు కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ జీ మార్గదర్శకత్వంలో హిందూ మహాసముద్ర ప్రాంతంలో (ఐఓఆర్) మరియు ప్రపంచవ్యాప్తంగా దేశాల వాణిజ్యం మరియు సముద్ర రంగం అభివృద్ధి చెందుతాయని మేము భావిస్తున్నాము: శ్రీ శంతను ఠాకూర్

Posted On: 05 MAY 2023 6:39PM by PIB Hyderabad

ఈ రోజు జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ సహాయ మంత్రి శ్రీ శంతను ఠాకూర్ వి.ఓ.చిదంబరనార్ పోర్ట్ వద్ద టుటికోరిన్ నుండి మాల్దీవులకు డైరెక్ట్ షిప్పింగ్ సర్వీస్‌ను జెండా ఊపి ప్రారంభించారు.

 

image.png


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 2019లో మాల్దీవులను సందర్శించిన సందర్భంగా భారత ప్రధాన మంత్రి & మాల్దీవుల ప్రెసిడెంట్..భారత్ మరియు మాల్దీవుల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా మౌలిక సదుపాయాలను ఏర్పరచాలని తద్వారా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యానికి కూడా ప్రోత్సాహాన్ని అందించాల్సిన అవసరాన్ని గురించి ప్రస్తావించారు.

 

image.png


ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మరియు రెండు దేశాల మధ్య పరస్పర అవగాహనను పునరుద్ఘాటించడానికి భారత ప్రధాని మాల్దీవుల పర్యటన సందర్భంగా భారత ప్రభుత్వ ఓడరేవు, షిప్పింగ్ & జలమార్గాల మంత్రిత్వ శాఖ మరియు మాల్దీవుల ప్రభుత్వ రవాణా మరియు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మధ్య సముద్ర  ప్రయాణీకుల మరియు కార్గో సేవల స్థాపన కోసం 08.06.2019న సంతకం చేసిన అవగాహన ఒప్పందం మేరకు ఈ సర్వీసు నిర్వహించబడుతోంది. ఇది కూడా 'నైబర్‌హుడ్-ఫస్ట్ పాలసీ' మరియు రీజియన్‌లోని అందరికీ భద్రత మరియు వృద్ధికి సంబంధించిన విజన్‌కి అనుగుణంగా ఉంటుంది.
 

image.png

 

ఈ ‘ఎం.వి.ఎంఎస్‌ఎస్‌ గలెనా’నౌక 421 టీఈయుల కంటైనర్‌లను మోసుకెళ్లే సామర్థ్యం మరియు బల్క్ కార్గోను తీసుకెళ్లే సదుపాయం కలిగిన ఓడ. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 04.05.2023న పిఎస్‌ఏ ఎస్‌ఐసిఏఎల్ కంటైనర్ టెర్మినల్‌కు చేరుకుంది. ఇది పిఎస్‌ఏ ఎస్‌ఐసిఏఎల్ కంటైనర్ టెర్మినల్ వద్ద 270 టీఈయుల కంటైనర్‌లతో లోడ్ చేయబడింది. ‘ఎం.వి. ఎంఎస్ఎస్ గలెనా’ 05.05.2023న టుటికోరిన్ నుండి మాలేకి బయల్దేరింది. ఇది 07.05.2023న మలేకి చేరుకుంటుంది. ఈ షిప్పింగ్ సర్వీస్  రొటేషన్ ట్యూటికోరిన్ – మేల్ – ట్యూటికోరిన్, మరియు నెలకు 3 సార్లు షెడ్యూల్ చేయబడింది.

 

image.png


ఈ సందర్భంగా శ్రీ శంతను ఠాకూర్ మాట్లాడుతూ ఈ చారిత్రాత్మకమైన మరియు మార్గదర్శక సేవను ప్రారంభించడం ద్వారా మన గౌరవనీయులైన ప్రధాన మంత్రి మాల్దీవుల పర్యటన సందర్భంగా చేసిన నిబద్ధత నిశ్చయంగా నెరవేరిందని అన్నారు. ఈ చొరవ లాజిస్టిక్ మరియు ఇతర ఖర్చులను తగ్గించడమే కాకుండా కనెక్టివిటీని మెరుగుపరచడానికి మరియు మన రెండు దేశాల మధ్య వస్తువులను రవాణా చేయడానికి పట్టే సమయాన్ని తగ్గించడానికి కూడా సహాయపడిందన్నారు. ఈ సేవ (ఐఓఆర్) హిందూ మహాసముద్ర ప్రాంతంలో రెండు దేశాలు చేపట్టిన కనెక్టివిటీ కార్యక్రమాలకు కొత్త అధ్యాయాన్ని జోడించిందని అలాగా భారత్‌& మాల్దీవుల ఓడరేవుల మధ్య షిప్పింగ్ కనెక్టివిటీని ప్రోత్సహించడం,అభివృద్ధి చేయడం, స్థిరీకరించడం జరిగిందని చెప్పారు. ఇది భారతదేశం మరియు మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యానికి మరింత ఊపునిస్తుందని తద్వారా మరింత వాణిజ్యం & ఆర్థిక అవకాశాలకు దారి తీస్తుందని తెలిపారు. రెండు దేశాల మధ్య పునరుద్ధరించబడిన శక్తితో సముద్ర వాణిజ్య సంబంధాలను మెరుగుపరుస్తుందన్నారు.

ఇంతకుముందు టుటికోరిన్ నుండి మాల్దీవులకు వెళ్లే భారీ సరుకును బార్జ్‌లు & సెయిల్ షిప్‌ల ద్వారా పంపేవారు మరియు మాల్దీవులకు వెళ్లే కంటైనర్‌లు కొలంబో మీదుగా మళ్లించబడ్డాయి. టుటికోరిన్ - కొచ్చి - కుల్హుదుఫ్ఫుషి - మేల్ మధ్య సర్వీస్ ఎస్‌సిఐ ద్వారా నిర్వహించబడుతుంది. 200 టీఈయు కంటైనర్లు మరియు 3000 టన్నుల సాధారణ కార్గో సామర్థ్యంతో ‘ఎంసిపి లింజ్’ అనే నౌక 21.09.2020న ప్రారంభించబడింది. ఆ ఒప్పందం 28.08.2022న ముగిసింది.


 

*******



(Release ID: 1922252) Visitor Counter : 198